🔹పాతనిబంధనలోను, ధర్మశాస్త్రములోను, పరిశుద్ధ గ్రంధము నందు రెండవ పుస్తకమై ఉన్నది

🔹నిర్గమకాండమును 3 భాగములుగా విభజించవచ్చును

👉ఇశ్రాయేలీయుల అద్భుతమైన విడుదల (1-13)

👉సీనాయి కొండ దగ్గరకు అద్భుతమైన ప్రయాణము (13-18)

👉సినాయి కొండ దగ్గర అద్భుతమైన ప్రత్యక్షతలు (19-40)

🔹రెండవ భాగము నందు నాలుగు ప్రధానమైన సంఘటనలు కలవు

👉దేవుని యొక్క అద్భుతమైన విడుదల శక్తిని హెబ్రీయులు చూచుట (13-15)

👉దేవుడు తన పిల్లలను ఎలా పోషిస్తారనేది అనుభవించుట (15-17)

👉వారి శత్రువులైన అమాలేకీయుల నుంచి రక్షించబడుట (17)

👉ప్రజల మధ్య సమాధానము ఉంచుట కొరకు నాయకులను ఏర్పాటు చేయుట (18)

🔹మూడవ విభాగము నందు మూడు ముఖ్యమైన విషయములు కలవు

👉పది ఆజ్ఞలు ఇచ్చుట అవి ప్రజల జీవితంలో ఎలా నెరవేర్చడం అనే సూచనలు వివరముగా తెలియజేయుట (19-23)

👉ప్రత్యక్ష గుడారము, దాని పరికరములు ఎలా చేయాలి అని సూచనలు ఇచ్చుట (25-31)

👉ప్రత్యక్ష గుడారము దాని పరికరములు తయారుచేసి నిలువబెట్టుట, దేవుని యొక్క సన్నిధి గుడారమును నింపుట (35-40)

🔹తనతో నిబంధన కలిగినటువంటి జనులను దేవుడు ఆశీర్వదిస్తారు అనే విషయం నిర్గమకాండము మనకు తెలియచేస్తుంది

🔹దేవుడు తనకు ఏవి అంగీకారమో వివరంగా తెలియజేశారు

🔹ఆదికాండము, నిర్గమకాండము మధ్య 300 సంవత్సరములు యెడము ఉన్నది

🔹ఇశ్రాయేలు ఒక దేశంగా ఎలా ఉద్భవించింది అనేది నిర్గమకాండము తెలియజేస్తుంది

🔹నిర్గమకాండము బాధతో మొదలై విడుదలతో అంతమవుతుంది

🔹నిర్గమకాండము యాకోబు సంతతి ఐగుప్తులో విస్తరించుట దగ్గర నుంచి ప్రత్యక్ష గుడారము  నిలువ బెట్టుట వరకు సుమారుగా 431 సంవత్సరములు  చరిత్ర కలిగి ఉన్నది

🔹ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తు గొప్ప సామ్రాజ్యముగా ఎదిగినది

🔹మోషే లేవీయుడు

🔹ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులు బయలుదేరు సమయమునకు 20 సంవత్సరములు పైబడిన వారు స్త్రీలు, పిల్లలు కాక ఆరు లక్షల మంది ఉన్నారు

🔹సుమారుగా 30 నుంచి 40 లక్షల మంది ఐగుప్తు నుంచి బయలుదేరారు

🔹ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు తీసుకురావటానికి దేవునికి ఒక్క రాత్రి మాత్రమే పట్టినా ఐగుప్తు వారి హృదయంలో నుంచి తీసివేయటానికి 40 సంవత్సరాలు పట్టింది

🔹నిర్గమకాండముతోనే మోషే యొక్క కథ కూడా మొదలవుతుంది

🔹మోషే గురించి బైబిలు మొత్తం మీద 1/7 శాతము ఉన్నది

🔹మోషే యొక్క చరిత్ర క్రొత్త నిబంధనతో పోల్చుకుంటే 2/3 శాతము ఉన్నది

🔹ఐగుప్తీయులు హాము సంతతికి చెందినవారు

🔹50 మంది పక్కన నిలబడితే సుమారుగా 40 మైళ్ల పొడవు ఉంటుంది గంటకు రెండున్నర మైళ్ళ వేగంతో ప్రయాణిస్తే ఒక చోటు దాటటానికి ప్రజలందరికీ కలిపి 16 గంటలు పడుతుంది

🔹పశువులు కాకుండా ప్రజలకు ఆహారము నీరు అందించడానికి 30 రైలు బోగీల ఆహారము, 300 ట్యాంకర్ల నీరు ప్రతిరోజు 40 సంవత్సరముల  ప్రయాణములో అవసరమవుతుంది.