1. ఈ అధ్యాయము దేవుని యొక్క సృష్టి గురించి మనకు వివరిస్తుంది
  2. దేవుడు 6 దినములలో సమస్త సృష్టిని చేశారు
  3. మొదటి 3 దినములలో చివరి 3 దినములకు అవసరమైన పరిస్థితులను, వాతావరణమును సృష్టించటము జరిగినది
  4. మనిషికి అవసరము అయిన సమస్తమును చేసిన తరువాత ఆఖరిగా మనిషిని చేశారు
  5. తాను చేసిన సమస్త సృష్టిమీద మనిషికి దేవుడు అధికారము ఇవ్వటము జరిగినది
  6. కేవలము మనుష్యులు మాత్రమే ఈ సృష్టి మొత్తముమీద దేవుని యొక్క పోలికలోను, స్వరూపములోను చేయటము జరిగినది
  7. దేవుడు కేవలము సృష్టి చేయటము మాత్రమే కాకుండా ప్రాణము కలిగిన ప్రతి జీవరాశి బ్రతుకుటకొరకు అవసరమైన ఆహారమును కూడా అందించారు
  8. అన్ని విషయములలోను మనిషికి ప్రత్యేకత ఇచ్చిన దేవుడు, ఆహారము విషయములో కూడా ప్రత్యేకత ఇచ్చారు. విత్తనము కలిగిన ఫలవృక్షములను ఇచ్చారు
  9. దేవుడు తాను చేసిన సృష్టిని అనుదినము పరిశీలించి మంచిది ఇచ్చినట్లుగా ఈ అధ్యాయములో మనము చూడగలము
  10. దేవుడు తన రాజ్యమును పరలోకము నుంచి విస్తరిం చాలి అనుకున్న సందర్భములో ఆయన భూమిని ఎన్నుకొని దానిమీద సృష్టి చేసిన సందర్భము వివరించుటకు ఈ అధ్యాయము వ్రాయబడినది
  11. దేవుడు తన రాజ్యము గురించి కలిగి ఉన్న అభిప్రాయము మనకు ఈ అధ్యాయము వివరిస్తుంది
    1. ఆయన యొక్క పరిపాలన క్రింద మనము బ్రతకాలి. ఆయన అధికారమునకు ఒప్పుకుని విధేయత చూపించాలి
    2. దేవుడు మనలను భూమిని పరిపాలించడానికి నియమించారు కానీ మరొక మనిషిని పరిపాలించమని కాదు
    3. మనము ఆయన పోలికలో చేయబడిన వారము అని జ్ఞాపకము చేసుకుని ఆయనకు తగిన వారసులుగా బ్రతకాలి
    4. ప్రతి రాజ్యము కూడా ఆయన అధికారము క్రిందనే ఉండాలి
  12. మనిషి యొక్క ఉనికి, సమాజములో, ప్రకృతిలో అతని యొక్క పాత్రను కూడా ఈ అధ్యాయము వివరిస్తుంది