దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను (1:5).

చీకటి మొదటిలో 2వ వచనమునందు భూమిని సంపూర్ణముగా ఆక్రమించినట్లు మరలా ఆక్రమించదు. అది సాధ్యము కాదు అనే విషయము మనకు అర్థము అవడానికి కూడా ఆయన పగలు, రాత్రి సంపూర్ణముగా భూమిని ఆక్రమించేలా చేయలేదు. చీకటిలో ఉన్న జనులకు అటుపక్క ఉన్న వెలుగు గొప్ప నిరీక్షణ ఇస్తుంది. వారి నిరాశలో ఆదరణ ఇస్తుంది. ఒకవేళ ఆ వెలుగు ఎక్కడా ప్రస్తుతమునకు లేదు అనే భయముతో మన హృదయము కొట్టుమిట్టాడకూడదు, ఆ వేదన మనము పడకూడదు అనే గొప్ప ప్రేమ, care మనకు కనిపిస్తాయి. ఇలాఎంత ఆలోచించినా ఆయన చేసిన సమస్తములో మనము, మన బాగు మన సంతోషము ప్రస్ఫుటముగా center placeలో కనిపిస్తాయి. మరి మనము చేస్తున్న పనులలో ఆయన స్థానము?????

ఇక్కడ మనము దినములను ఎలా లెక్కించాలి అనేది తెలియజేయుటకు కూడా దేవుడు ఒక కొలమానము ఇవ్వటము జరిగినది. అందుకే భూమిమీద గడిచిన సమయమును దినములుగా కొలవటము జరుగుతుంది. ఇక్కడ ఒకటి అని వ్రాయించటము ద్వారా కొలత 1 నుంచి మొదలుపెట్టాలి అని తెలియజేశారు. అందుకే మనము ఏదైనా లెక్క అనేది వేసేటపుడు 0 నుండి కాకుండా 1 నుంచి మొదలు పెడతాము. బైబిలులో number system అనేది కూడా ఇక్కడనుంచే ఆరంభము అయ్యింది అని మనము చెప్పవచ్చు. మనము పనిని రోజులు వారి విభజించుకోవాలి అనేది కూడా తెలియజేస్తుంది. రోజులు==>నెలలు==>సంవత్సరములు

ఇక్కడ దేవుడు పనిని విభజించిన విధానమును బట్టి మనము సంపూర్ణతలోనికి ఒకేసారి ప్రవేశించలేము. ప్రతిరోజు ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు జరగాలి. ప్రతిదినము ప్రాముఖ్యమైనదే. అనుదినము మనము ప్రగతి చూపించాలి. మన ఆయుష్షు నిర్దిష్టమైనది కాబట్టి మనము వృధాచేసిన దినములన్నియుకూడా సంపూర్ణత చెందకుండా నష్టపోయినట్లే. మన మరణదినము సమీపించేలోపు దానిని పొందలేకపోతే తప్పు మనదే అవుతుంది. దేవుడు మనకు అన్నిరకములగా అవకాశము ఇచ్చియున్నారు. అందుకే సమయము సద్వినియోగము చేసుకొనమని, వృధాగా పోనివ్వవద్దు అని పరిశుద్ధగ్రంథము మనలను హెచ్చరిస్తుంది. ఆ గ్రంథమునకు ఇవ్వవలసిన శ్రద్ధ, సమయము మనము ఇవ్వకపోవవటము వలననే మన జీవితములు ఇంత నిరాశాజనకముగా ఉన్నాయి. సంతోషము సమాధానము లేవు. ఇప్పటికైనా మేల్కొందాము. మనలను మరిచిపోకూడదు అని మన పేరును ఆయన అరచేతిలో చెక్కుకున్నాడు అంట దేవుడు. మనము ఎంతమందిమి ఇప్పటివరకు పుట్టాము. అందరి పేర్లు ఒకదాని తర్వాత ఒకటి పదునైన వస్తువుతో చెక్కడము అంటే ఎంత రక్తసిక్తమయి ఉంటుంది. ప్రతిరోజు ఎంత బాధ కలుగుతుంది ఆలోచించండి. మనము కనీసము బైబిలు చదవాలి, ప్రార్ధన, ఆయనతో సహవాసము అనే reminders పెట్టుకుంటున్నామా? ఆయన మనకు top priority గా ఉన్నారా? మనము ఆయనకు ఉన్నాము. ఆ ప్రేమలో 0.1% అయినా మనము ఆయన మీద చూపిస్తున్నామా???

అస్తమయము, ఉదయము అనేది భూమి ఉన్నంతవరకు ఉంటాయి. ఉదయముతో దానిని ముగించిన దేవునికి, మనకు వెలుగుద్వారా నిరీక్షణ, ధైర్యము ఇచ్చిన దేవునికి ఎంతైనా కృతజ్ఞతలు, స్తోత్రములు. ఇవి 2 కూడా ఎల్లప్పుడూ circular motion లో ఒక దానిని ఒకటి వెంబడిస్తూ ఉంటాయి. వెలుగును ఎల్లప్పుడూ కూడా చీకటిని వెంబడిస్తూ ఉంటుంది అనే సత్యము ఇక్కడ తెలియజేసిన దేవుడు ఆ చీకటిలోనికి మరలా మనము జారిపోకుండా, చిక్కుపడకుండా ఉండటానికి, తన లేఖనములలో అనేక సూత్రములను ఇవ్వటము జరిగినది. సాతాను మనలను, దేవుడు వెలిగించే కొలది ఆ వెలుగును ఆర్పివేయాలి అని ప్రయత్నము చేస్తాడు. కోతకాలము, తీర్పుదినము వరకు ఈ సృష్టిలో అది కొనసాగుతూనే ఉంటుంది. మనిషికి అయితే మరణదినము వరకు ఈ పోరాటము ఉంటుంది. అందుకే దేవుడు భూమిమీద నరులకాలము యుద్ధకాలము అని హెచ్చరించటము జరిగినది. పేతురు వ్రాసిన విధముగా ఆ చీకటినుండి తప్పించుకోవటానికి దేవుడు మనకు అనేక వాగ్దానములను ఇవ్వటము జరిగినది. అవి దేవుడు మనలను కంట్రోల్ చేయడానికి పెట్టిన వాటిగా భావించకూడదు కానీ అవి ఆయన మనకు ఇచ్చిన ఆయుధములు. ఆ వాగ్దానములను స్వతంత్రించుకోవటానికి మనము చేయవలసినవి అన్నీ కూడా చేయాలి. ఉదయముతో రోజు ముగించటము ద్వారా విజయము మనదే అని చెప్పి మనకు అర్థం అవుతుంది. దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో వ్రాయించిన ప్రతి మాట కూడా మన మేలుకొరకే అని ఇప్పటికైనా గ్రహించి వాటిని గైకొని పాటించు.