దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు, భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండుగాకనియు పలికెను; ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమిమీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను; అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను (1:14-19).

చంద్రునికి, సూర్యునికి మధ్య భూమి అడ్డుగా వచ్చినప్పుడు కలిగే గ్రహణము వలన నక్షత్రముల యొక్క వెలుగు భూమిమీద ప్రసరిస్తుంది. సంపూర్ణముగా వెలుగు అనేది block అవదు. కానీ సూర్యునికి భూమికి మధ్య చంద్రుడు అడ్డగా వచ్చినప్పుడు ఏర్పడే సూర్యగ్రహణము వలన భూమిమీద వెలుగు block అయ్యి చీకటి కమ్ముతుంది. పగలు సూర్యుని వెలుగు తప్ప వేరే alternative మనకు లేదు. అందుకే అది మంచి sign కాదు. దీని ద్వారా దేవుని సంఘము ఎప్పుడూ కూడా ఆయనకు మనకు అడ్డు రాకూడదు అని తెలియజేస్తున్నారు. చంద్ర గ్రహణం సమయములో ఒకవేళ సంఘము మనకు అందుబాటులో లేకపోయినా హెబ్రీ 11 లో చెప్పబడిన మన పితరుల సాక్ష్యములు, విశ్వాసవీరులు ఆకాశములోని నక్షత్రములవలె మనముందు ఉంచబడ్డారు. వారిని చూసి మనమూ స్పూర్తి తెచ్చుకోవాలి. సూర్యుని యొక్క లేక దేవుని వెలుగు మనకు చేరటం అనేది ఆగిపోతే భూమి మరల మొదటిలో ఉన్న అంధకార స్థితికి గందరగోళమునకు వెళ్ళవలసి వస్తుంది. ఆయన తప్ప మనకు వేరే source or option లేదు. అందుకే దేవుడు దేనితోనూ పోల్చుకోలేక నేను నేనే ( I AM THAT I AM) అని తెలియజేయటము జరిగినది. సంఘము కొన్నిసార్లు ఇలా గీతదాటి రావటము అనేది దురదృష్టకరము. కాబట్టి మనము మెలకువ కలిగి మన మంచికాపరి స్వరము గుర్తించే స్థితిలో ఎప్పుడూ వివేచనతో ఉండాలి.

పగటివేళ మనకు ఒక్కడికి సంచరించాలి అన్న భయము అనేది ఉండదు కానీ రాత్రివేళ ఎక్కడికి వెళ్లాలి అన్న భయము ఉంటుంది. చంద్రుడు, నక్షత్రముల వెలుగు మాత్రమే కాకుండా మరింత వెలుగును వేరొక రూపములో (torch or some other light) మనము ఉపయోగిస్తాము. కేవలము అంధకార సంబంధమైన క్రియలు చేసినప్పుడే మనము వెలుగు అనేది ఉపయోగించము. మనము ఏ పని చేయాలి అన్నాextra lighting మనకి కావలసినదే. చీకటిలో సాటి మనిషిని చూసికూడా భయపడతాము. దీనిని బట్టి మనము వెలుగు సంబంధులము, దానికొరకే చేయబడిన వారము, దానిని మాత్రమే వెంబడించాలి అని అర్థము అవుతుంది. కాబట్టి దేవుడు నీతో అనుదినము పగలు, రాత్రి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నిఅవకాశములు ఇచ్చియున్నారు అనేది ఒకసారి ఆలోచించుము. నీవు ఊహించిన దానికన్నా ఎక్కువగా ఆయన నీతో అనుదినము పరిపరి విధములుగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే లేఖనము నందు పగటికి పగలు రాత్రికి రాత్రి బోధ చేయుచున్నవి అని వ్రాయబడి ఉంది. ఒకవేళ బయట cinema లో చూపించినట్లు గంభీరమైన, ఆశ్చర్యకర, అద్భుత పరిస్థితులలో ఆయన నీతో మాట్లాడాలి అని ఎదురుచూస్తున్నావేమో. ఆయన నీతో మాట్లాడుతున్న మెల్లని స్వరము గుర్తించటానికి ప్రయత్నము చెయ్యి. హోరేబు కొండమీద ఏలియాను జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పటినుంచే చీకటినుండి విడిపోయి వెలుగును వెంబడించు.

సాతానుడు కూడా ఒకప్పుడు తేజో నక్షత్రముగా పిలవబడ్డాడు. దేవుని చేత అమితముగా అభిషేకించబడి ప్రధాన దూతలలో ఒకడిగా ఎంచబడ్డాడు. అయితే దేవునికి అవిధేయత చూపటము వలన పాతాళములో ఒక మూలకు త్రోయబడ్డాడు. దీనిని బట్టి మనము నీతిమంతులుగా మారుతూ ఉన్నప్పుడు ఎదుటివారితో మనలను పోల్చుకొని గర్వించకూడదు. ఎదుటివారిని మనకన్నా గొప్ప అని తలంచుచు మనల్నిమనము తగ్గించుకోవాలి. we are vulnerable at the most successful point of our life. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా భయముతోను వణుకుతోను మన రక్షణ కొనసాగించాలి. నక్షత్రముల వెలుగు ఎలా అయితే వాడబారకుండా ఉంటుందో మన రక్షణ వస్త్రము కూడా మలినపడకుండా చూసుకోవాలి. దేవుని సింహాసనము దగ్గర ఉన్న సాతానును పడదోసిన దేవునికి మనలను పడద్రోయటము పెద్ద విశేషమైన పని ఏమీ కాదు. దేవుడు ఇలాంటి విషయములలో రాజీపడడు అని పక్షపాతము చూపడు అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. దేవుని ప్రేమను అలసత్వముగా భావించి ఆయన శిరస్సు మీద ఎక్కటానికి ఎప్పుడు ప్రయత్నము చేయకూడదు. ఆయన చంకను మాత్రమే మనము ఎక్కాలి. మనము ఏ మాత్రము అలక్ష్యము చేసినా మన ప్రయత్నము అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. సాతానుకు ఇవ్వని అవకాశము దేవుడు నీకు యేసుక్రీస్తు ద్వారా దయచేసాడు అనే విషయము ఎప్పటికీ మరువకు.