దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను  ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. (1:26-28)

రాజ్యము తనది కాబట్టి , దేవుడు భూమికి సంబందించి మనిషి అధీనములో ఏమేమి అయితే ఉంటాయో వాటికి పేరులు పెట్టలేదు. వీటికి పేరులు ఏమి పెట్టాలి అనేది వాటి రాజు అయిన మానవునికే విడిచిపెట్టటము జరిగినది. దీనిని బట్టి ఆయన మనలను ఎంతో గౌరవించే దేవుడు అని, మనకు ఇచ్చిన అధికారమును ఎప్పుడూ భంగం కలిగించరు అనేది అర్థము అవుతుంది. అందుకే దేవుడు వృక్షములకు, చేపలకు, పక్షులకు, జంతువులకు ఎక్కడా పేరులు పెట్టడము మనకు కనిపించదు. కేవలము ఆకాశమునకు సంబంధించిన వాటికి మాత్రమే ఆయన పేరులు పెట్టటము జరిగినది. మనలో చాలా మందిమి దేవుని యొక్క అధీనములోనికి వెళ్లాలి అంటే మనకు స్వతంత్రత ఉండదు, సమస్తము ఆయన చెప్పినట్లే చేయాలి, స్వేచ్చ ఉండదు అనే భ్రమలో ఉంటారు. అయితే ఆ అపోహలను అన్నింటిని పటాపంచలు చేస్తు దేవుడు తన వైఖరిని స్పష్టము చేయడము జరిగినది. అందుకే మనము దేవుని దగ్గరకు వెళ్లటానికి సంశయించకూడదు. ఇన్ని జీవరాసులకు పేర్లు పెట్టగలిగిన మొదటి మానవుని జ్ఞానము నిజముగా అద్భుతమైనది. కాని పాపము ద్వారా దానిని మనము పొగొట్టుకున్నాము . ఇప్పుడు మన జ్ఞానము మంచి, చెడు రెండూ కలిపిన సమ్మేళనముగా తయారు అయినది. మనము దేవుని స్వరూపము,పోలికెలోనికి మారినపుడు పొగొట్టుకొనిన ఆ జ్ణానమును తిరిగి సంపాదించుకుంటాము. దాని ద్వారా మనిషి జీవనము సాగించినట్లు అయితే మనకు సమాజములో దుఃఖము అనేదే ఉండదు.

దేవుని స్వరూపమందు స్త్రీగాను, పురుషునిగాను నరులు సృజింపబడ్డారు అని ఈ వచనములు మనకు తెలియజేస్తున్నాయి. ఇక్కడ ముందుగా నరుడు పురుషుడు మాత్రమే సృజించబడినాడు. దేవుని స్వరూపమందు వాని సృజించెను అన్న మాటలో ఉన్న ఏక వచనము ద్వారా ఇది మనకు అర్థము అవుతుంది. మిగిలిన జీవరాసులను ఆడది, మగదిగా సృజించిన దేవుడు మనుష్యుల విషయములో ముందుగా పురుషుని మాత్రమే సృజించటానికి ఒకటి కారణము ఉన్నది. మనుష్యులు free will కలిగి చేయబడ్డారు. వారికి ఏదైనా ఎంచుకునే అవకాశము ఇవ్వబడినది. పైగా రాజునకు తన భార్యను ఎంచుకునే అధికారము ఉంటుంది. అందుకే దేవుడు తన సృష్టిలోని ప్రతి జీవిని ఆదాము ముందుకు తీసుకురావడము జరిగినది. అతను దేనితోను సంతృప్తి చెందనప్పుడు స్త్రీని చేయడము జరిగినది. దేవుడు ఎప్పుడు, ఎక్కడా మనుష్యులలో స్వేచ్చను కాలరాయలేదు. ఆయన చిత్తమును ఎక్కడా బలవంతముగా రుద్దలేదు. స్త్రీ కూడా దేవుని స్వరూపమందు చేయబడినది, కావున జీవమును కృపావరములో ఇద్దరూ పాలిభాగస్తులే. స్త్రీకి కూడా దేవుని యొక్క చిత్తము నెరవేర్చుటలో సమానమైన పాత్ర ఉన్నది. వీరిని తక్కువగా చూడటము వీలుపడదు. దేవుడు ఇద్దరినీ కలిపి ఆశీర్వదించి మీరు అనే పదము ఉపయోగించటము జరిగినది. నీవు స్త్రీ యొక్క పాత్రను, దేవుని చిత్తమును నెరవేర్చుటలో గుర్తించావా? వారికి సమాన భాగస్వామ్యము కల్పిస్తున్నావా?

ఆయన వారు ఇద్దరికీ ఇచ్చిన ఆశీర్వాదము గమనించినపుడు – ఇద్దరూ collaborative గా దానిని అనుభవించాలి అని ఆయన ఉదేశ్యమై ఉన్నది. ఇందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన లేదు . విడుదల పొంది ఆయన స్వారూప్యము లోనికి మారిన స్త్రీ పురుషులకు పరలోకములో కూడా ఎక్కడా ఎలాంటి వ్యత్యాసము లేదు. అలాంటపుడు భూమిమీద కూడా అలాంటి వ్యత్యాసము ఉండటానికి వీలు లేదు. దేవుడు వీరు ఇద్దరూ ఏక శరీరము అని చెప్పడము ద్వారా, ఆయన కనుదృష్టిలో ఇద్దరూ సమానమే అని చెప్పడము జరిగినది. ప్రభువైన యేసుక్రీస్తు వారు అ కూడా స్త్రీని సంఘముతో పోల్చి ఆయన దానిని ప్రేమించినట్లుగానే మనము కూడా భార్యలను ప్రేమించాలి అని తెలియజేసారు. ఈలాగున ఇద్దరు స్త్రీ పురుషులు కుటుంబములుగా ఏర్పడి భూలోకములో నివాసము చేయాలి అని దేవుని ఉద్దేశ్యము. ఇద్దరిలో ఎవరు కూడా ఒంటరిగా ఉండటము ఆయనకు ఇష్టము లేదు. మరియు ఇద్దరు పురుషులు, ఇద్దరు స్త్రీల మద్య కుటుంబ వ్యవస్థను ఆయన ఎప్పుడూ ఏర్పాటు చేయలేదు. అది దేవుని దృష్టిలో abomination అని పరిశుద్ధ గ్రంధము సెలవిస్తుంది. అందుకే same sex marriages, Solo life, live in relation అనేవి దేవుని చిత్తము కాదు. వివాహబంధము ద్వారా ఏకమైనప్పుడు మాత్రమే స్త్రీ పురుషులు ఇద్దరూ ఈ ఆశీర్వాదము పొందుకొనగలరు. ఒకవేళ నీవు కుటుంబ వ్యవస్థకు ఏదైనా వ్యతిరేకముగా అభిప్రాయము కలిగి ఉంటే దానిని మార్చుకొనుము.