దేవుడు ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్షమును మీకిచ్చియున్నాను; అవి మీకాహారమగును. భూమిమీదనుండు జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని భూమిమీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను. (1:29-30)

దేవుడు పరిపాలనా బాధ్యతలు అప్పగించిన తరువాత ఆహారము గురించి మాట్లాడటము జరిగినది. ఆదాముకు ఏదేను తోట బాధ్యతలు అప్పగించిన తరువాత అతను తినతగిన ఫలముల గురించి దేవుడు మాట్లాడారు. పౌలు కూడా పని చేయకుండా ఆహారము పుచ్చుకొనకూడదు అని తన పత్రికలలో పేర్కొన్నాడు. దీనిని బట్టి ఆహారము అనేది దేవుడు మనకు అనుగ్రహించిన బాధ్యతలు నెరవేర్చుటకు అవసరము అయిన శక్తి కోసమే అని అర్థము అవుతుంది. ఒక్కో Season కు ప్రత్యేకమైన ఎన్ని రకముల suits వెరైటీ దయచేసిన దేవునికి కృతజ్ఞతలు. ఇది మనపట్ల ఆయన కలిగి ఉన్న శ్రద్దకు,అనురాగమునకు గొప్ప నిదర్శనము. వీటినుంచి అనేక రకములైన రుచితో కూడిన వంటలు చేయుటకు మనిషికి ఇచ్చిన జ్ఞానము కొరకు కూడా వందనములు వీటిలో కొన్ని పండ్లను ఆయన తన ప్రత్యక్ష గుడారములోని ఆరాధనా క్రమములో ఉపయోగించడము జరిగినది. అంజూరపు చెట్టును, దాని ఫలములను తన రాకడకు గుర్తుగా కూడా పేర్కొనడము మనము లేఖనములో చూడవచ్చు. దేవుడు తన సృష్టిలోని వస్తువులను తన గురించిన వివరములు గ్రహించుటకు సంకేతముగా ఉపయోగించడము జరిగినది. అలానే విత్తనము తినినప్పుడు, దానిని బట్టే ఫలము ఆధారపడి ఉంటుంది అని, మనలను బట్టి మన తరువాతి తరము ప్రవర్తిస్తుంది అని మనకు పదే పదే హెచ్చరిక చేస్తున్నారు. ఈ విధముగా ఫలములు లేదా fruits తిన్న ప్రతిసారి దేవుడు మనకు అవకాశము ఇచ్చి మనతో మాట్లాడినట్లే. ఈ విధముగా మనము ఎన్ని అవకాశములు సరిదిద్దుకొనుటకు జారవిడుచుకున్నామో? – ఇప్పటికి అయినా జాగ్రత్త పడదాము.

విత్తనముతో కూడిన ఆహారము తినిన ప్రతిసారి అది దేవుని వాక్యమును మనకు గుర్తుచేస్తుంది. మన అనుదిన ఆహారములానే దేవుని వాక్యమును కూడా మనము అనుదినము స్వీకరించాలి. దేవుడు మనకు ఇచ్చిన బాద్యతలు నెరవేర్చటానికి కేవలము శరీరము యొక్క శక్తి , సరిపోదు. ఆత్మ బలము, జ్ణానము కూడా అవసరము. ఇవి వాక్యము ద్వారానే లభిస్తాయి అని మనకందరికీ తెలిసిన విషయమే. మనము శరీర విషయములో ఎక్కువ శ్రద్ధ కలిగి ఆహారము పుచ్చుకొనుచు, ఆత్న విషయములో అశ్రద్ధ కలిగి ఉండడము వలనే మన ఆత్మీయ జీవితములు కుంటుపడుతున్నాయి. మనము ఎలా అయితే బోజనమునకు daily schedule కలిగి ఉంటామో, అలానే ఆత్మ అవసరమునకు కూడా దేవుని వాక్యము విషయమై ఒక schedule కలిగి ఉండాలి. ” శరీరమునకు మూడు పూటలా తిని, ఆత్మకు ఒక పూటే పెడితే అది ఎంత బలహీనముగా ఉంటుందో మన అందరికీ తెలియని విషయము కాదు. అందుకే దేవుడు మనకు ప్రత్యేకమైన ఆహారము నియమించటము జరిగినది.

మనిషి యొక్క పాపము వలన భూసారము తగ్గి వృక్షముల యొక్క ఫలింపు కూడా తగ్గిపోయినది. మనము లేఖనములలో చూసినటువంటి కాపుదల ఈ రోజున మనకు కనిపించటము లేదు. మన పాపము మనము రోజూ తీసుకునే ఆహారము మీద ప్రభావము కలిగి ఉంటుంది. మన పాపము వలన కరువులు వస్తాయి అని కూడా లేఖనము (ద్వితి 28) సెలవిస్తుంది. అలానే మనలోని పాప స్వభావము (శరీరములోనిది) మన ఆత్మకు ఇచ్చే ఆహారమును పాడుచేస్తుంది. అందుకే, మన ఆత్మ శరీరము కన్నా ఎల్లప్పుడూ బలము కలిగి ఉండేలా చూసుకోవాలి. మనము నీతిని అనుసరించి ప్రవర్తించటము అనేది అన్ని విధములా శ్రేయస్కరమైనది.