1. దేవుని యొక్క ఆత్మ జలములమీద అల్లాడుచుండెను (1:2). సృష్టికార్యమునందు ఆత్మ దేవుడు పాలుకలిగి ఉన్నారని మనకు తెలియజేస్తుంది
  2. యోసేపునందు జ్ఞానము కలిగిన ఆత్మగా “ఇతనివలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా? అని యనెను.” (41:38).
  3. మన పితరుల యొక్క జీవితకాలమునందు వారి కుటుంబములను కాపాడి వారిని దీవించుటయందు ఆత్మయొక్క కార్యము మనకు స్పష్టముగా కనిపిస్తుంది
  4. ఆదికాండము 8వ అధ్యాయములో భూమి దేవుని యొక్క తీర్పుద్వారా జలప్రళయమునకు గురి అయినపుడు మరలా సాధారణమైన నివాసయోగ్యమైన పరిస్థితులు భూమిమీద నెలకొనేలా చేయుటలో ఆయన పాత్ర అమోఘమైనది
  5. ఆదికాండము 1, 3, 11 అధ్యాయములలో ఉపయోగించబడిన “మనము” అనే మాటలో ఆయన ఇమిడి ఉన్నాడు
  6. అబ్రహాము, యోసేపులకు దేవుని మనస్సులో ఉన్నధర్మశాస్త్రము యొక్క విధులను గురించి ప్రత్యక్షత అనుగ్రహించిన ఘనత ఆయనదే
  7. రిబ్కాను, ఇస్సాకు దగ్గరకు తీసికొనివచ్చిన ఎలియాజరు, సంఘమును అను వధువును వరుడైన యేసుక్రీస్తు ప్రభువు కొరకు సిద్దము చేసి తీసికొనివచ్చు పరిశుద్దాత్మునికి సాదృశ్యముగా ఉన్నాడు
  8. యాకోబు తన కుమారులను దీవించినపుడు అతనిమీద ఉన్న ప్రవచన ఆత్మగా ఆయనను మనము చూడగలము
  9. ఓడలో ఉన్ననోవహు వద్దకు ఒలీవ ఆకు తెచ్చిఅతనికి నిశ్చయత, ధైర్యము, ఆదరణ కలిగించిన పావురమునకు ఆయన సాదృశ్యము