1. ఈ అధ్యాయములో దేవుడు చేసిన సృష్టిక్రమము పరిశీలించినప్పుడు మొదటి 3 దినములు చివరి 3 దినములు మధ్య సంబంధం కలిగి ఉన్నట్లు గమనించగలము
  2. మొదటి 3 దినములలో చేసినవాటిని సృష్టించిన పరిస్థితులను చివరి 3 దినములలో చేసిన ప్రాణులు ఉపయోగించుకొనినవి

1వ దినము – వెలుగు, చీకటి

4వ దినము – సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు

2వ దినము – ఆకాశము, జలములు

5వ దినము – చేపలు, పక్షులు

3వ దినము – భూమి, వృక్షములు

6వ దినము – జంతువులు, మనుషులు

  1. దేవుడు సమస్తమైన సృష్టిని 6 దినములలోగా సంపూర్తి చేయడము జరిగినది
  2. 6 కూడా 24 గంటల నిడివి కలిగిన దినములు
  3. దేవుడు 2వ దినమున చేసిన పనిగురించి అది మంచిగా ఉండెను అనే మాట పలకలేదు
  4. మిగతా అన్నిరోజులు ఒక్కసారే మంచిగా ఉండెను అనేమాట పలికిన దేవుడు 3వ దినమున రెండుసార్లు పలికారు
  5. మిగతా సృష్టితో పోల్చుకుంటే దేవుడు మానవునికి ప్రత్యేకతలు ఇచ్చారు
  6. ఆరవ దినమున చేయబడిన జంతువులు దీవెన పొందుకొనలేదు మనుషులు, పక్షులు, చేపలు మాత్రమే ఆ అవకాశము పొందుతున్నాయి
  7. ఆ యా జాతులు అని చెప్పటం ద్వారా డార్విన్ జీవపరిణామ సిద్ధాంతము కొట్టివేయబడినది
  8. దేవుడు నేను చేశాను అని చెప్పటం ద్వారా లోకములో ప్రాచుర్యము పొందిన బిగ్ బ్యాంగ్ లాంటి అనేకమైన సిద్ధాంతములను కొట్టివేయడము జరిగినది
  9. హెబ్రీ సంస్కృతి ప్రకారము దేవునిచేత చేయబడిన పనులకు మాత్రమే ఉపయోగించే “బార” అనే పదము ఇక్కడ ఈ అధ్యాయములో ఉపయోగించబడినది
  10. దేవుడు తాను త్రిత్వము అని ఎలోహిమ్ అనే తన నామముద్వారా ఈ అధ్యాయములో తెలియజేయడం జరిగినది
  11. సమస్తము ఆయనచేత చేయబడినవిగా చూపించుట ద్వారా ఆయనే పూజార్హుడు అని మిగతావి శక్తిలేనివి, స్వయంభువులు కాదు అని ఈ అధ్యాయము ద్వారా దేవుడు నిరూపించారు
  12. దినములు అస్తమయమునుంచి ఉదయము వరకు కొలవడము జరిగినది
  13. సూర్యుడు 4వ దినమున చేయబడినా కూడా మొదటి 3 దినములలో అస్తమయము, ఉదయము చూడగలము
  14. మొదటి స్త్రీ, పురుషుడు మాత్రమే ఈ లోకములో బాల్యము లేకుండా చేయబడినారు.
  15. ఆదాము దేవుని కుమారుడు అని లూకా (3:38) సువార్తలో చెప్పుటము ద్వారా వారు తల్లిదండ్రులు లేనివారు అని చెప్పకూడదు
  16. పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి అని చెప్పబడినది తప్ప వాటి పేరులు సూర్యుడు, చంద్రుడు అని ఈ అధ్యాయంలో వ్రాయబడలేదు