1. దేవుడు తను త్రిత్వము అని ముగ్గురు కలిసి ఒక్కరుగా పనిచేస్తారు అని ఎలోహిమ్ అనే ఆయన నామము ద్వారా మొదటి వచనములో ఆయన తన గురించి మనకు బయలుపరుచుకోవటము జరిగినది
  2. దేవుడు పరిశుద్ధ గ్రంథమును మనకోసము వ్రాయించుటను బట్టి ఆయన గురించి మనం తెలుసుకోవాలి అని ఆయన ఆశిస్తున్నట్లు అర్థమవుతుంది
  3. తన స్వరూపము, పోలికే మనకు ఇవ్వటము ద్వారా ఆయన మనలను ఎంతగానో ప్రేమిస్తున్నారు అని అర్థమవుతుంది
  4. దేవుడు మనలను అంధకారములో విడిచిపెట్టకుండా వెలుగులోనికి నడిపిస్తాడు
  5. మన జీవితమును అస్తమయముతో విడిచిపెట్టకుండా ఉదయకాలపు వెలుగులోనికి నడిపిస్తారు
  6. సమస్తము ఆయన ద్వారాను ఆయన మూలముగాను కలిగినవి అని తెలియజేయటము ద్వారా ఈ సమస్త సృష్టిని చేసిన ప్రక్రియలో ప్రభువైన యేసుక్రీస్తువారు భాగస్వామి అని అర్థమవుతుంది
  7. దేవుని ఆత్మ అని చెప్పటము ద్వారా పరిశుద్ధాత్మ దేవునిని రెండవ వచనము మనకు పరిచయం చేస్తుంది
  8. మనము అని పలకడం ద్వారా త్రిత్వమై ఉన్న దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ స్వరూపములో మనలను చేసినట్లు 26వ వచనము మనకు తెలియజేస్తుంది
  9. దేవుడు విత్తనము కలిగిన ఫలవృక్షములను మనకు ఆహారంగా ఇవ్వటము, ఆయన స్వరూపము, పోలికే మనలో విత్తనమువలె ఇమిడి ఉన్నాయి అని, అవి మనము తరువాత తరమునకు అందించాలి అని తెలియజేస్తుంది
  10. ఆయన నీతిసూర్యుడుగా ఉండి తన వెలుగును మనమీద ప్రసరింపజేస్తారు
  11. చీకటి, శోధన సమయములో కూడా మనము భయపడకుండా తన వెలుగు మన కన్నులకు అందజేస్తారు
  12. దేవుడు మనలను సృజించే విషయములో తీసుకున్న శ్రద్ధ ద్వారా ఆయన మన అనవసరతలను బాగుగా ఎరిగి ఉన్నారు అని అర్థమవుతుంది
  13. ఆయన ఎల్లప్పుడు శ్రద్ధ కలిగి పని చేస్తాడు కానీ అనుదినము తను చేసిన పని పరీక్షించడం ద్వారా కీడు అనేది మన జీవితములోనికి ఆయన ద్వారా రాదు అని అర్థమవుతుంది
  14. ఆయన ఇచ్చిన అధికారం ద్వారా దేవుడు మనలను తలగా చేస్తారు కానీ తోకగా చేయడు అని అర్థమవుతుంది.