1. మీరు స్టడీ చెయ్యాలి అనుకున్న వచనములు ఎంచుకొనండి
  2. 3-5 వచనములకు మించకుండా చూసుకొనండి. ఒకవేళ ఒక వచనములో ద్యానించుటకు ఎక్కువ సమాచారము ఉన్న యెడల ఒక్క వచనము అయినా చాలు
  3. మీరు ఎంచుకున్న వచనముల యొక్క అధ్యాయము గురించి మీకు కనీస అవగాహన ఉంటే మంచిది
  4. 5-10 సార్లు ఆ వచనములను చదవండి
  5. వచనములలో ప్రస్తావించబడిన విషయము వ్రాయండి
  6. వచనములు అధ్యాయము యొక్క సందర్భమునకు ఎలాంటి సంబంధము కలిగియున్నాయో చూడండి
  7. వచనములు అధ్యాయము యొక్క ఉద్దేశ్యమునకు ఎలాంటి సంబంధము కలిగియున్నాయో చూడండి
  8. ప్రతి వచనమునకు క్రాస్ రిఫరెన్స్ వెతికి వాటిని కూడా స్టడీ చెయ్యండి
  9. మీకు ఉన్న జ్ఞానమును బట్టి ఆ వచనములలోని దృశ్యమును ఊహించటానికి ప్రయత్నము చేయండి
  10. వచనములలో ఉపయోగించబడిన ప్రధాన పదములు గుర్తించండి
  11. ఆ వాక్యములోని పదములను ఒక్కోసారి ఒక్కోటి నొక్కిపట్టి చదవండి. ఆ పదము మీతో ఏమైనా మాట్లాడితే వ్రాసుకొనండి
  12. ఆ వచనముల యొక్క సారాంశము క్లుప్తముగా మీ స్వంత పదములతో వ్రాయండి
  13. అన్ని కోణములలోను ఆ సంఘటనను విశ్లేషించండి
    • వ్యక్తుల వైపు నుంచి
    • 3వ వ్యక్తిగా
    • దేవుని కోణము నుంచి
  14. మీరు స్టడీ చేసిన తరువాత గ్రహించిన అంశములను విపులముగా వ్రాయండి. క్లుప్తముగా వ్రాయవద్దు
  15. మీరు గ్రహించిన అంశములను మీ జీవితమునకు ఎలా అన్వయించుకోవాలో చూడండి
  16. వాటి నిమిత్తము ప్రణాళిక సిద్దము చెయ్యండి
  17. వచనములను స్టడీ చేస్తున్నపుడు ఈ క్రింది విషయము గమనించండి
    • ఒప్పుకుని విడిచిపెట్టవలసిన పాపము ఏమైనా ఉన్నాదా? అది ఏమిటి?
    • ఆ పాపము నుండి విడుదల ఎలా పొందాలి?
    • ఆ పాపము వలన ఎవరిని అయినా నొప్పించారా? అయితే క్షమాపణ అడగండి
    • ఆ పాపము వలన ఎవరికి అయినా నష్టము కలిగించారా? అయితే దానిని ఎలా భర్తీ చేస్తారు?
    • ఆ పాపమునకు దేవుని దగ్గర నుండి ఎలా పరిహారము, క్షమాపణ పొందాలి?
    • ఏదైనా వాగ్ధానము ఉన్నదా?
    • అది షరతులతో కూడిన వాగ్దానమా? షరతులు లేనిదా?
    • ఆ షరతులు మీరు కలిగి ఉన్నారా?
    • ఈ వాగ్ధానము ఏ సందర్భములో ఉపయోగించుకొనవచ్చు?
    • ఈ వాగ్ధానము ఎవరైనా ఒక వ్యక్తికి లేదా ప్రజలకు ఇవ్వబడినదా?
    • వాగ్ధానము విషయములో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా?
    • వ్యక్తిత్వము పరముగా మార్చుకొనవలసినది ఏమైనా ఉన్నదా?
    • అది మంచి లక్షణము అయితే అది మీలో ఎదిగేలా ఏమి చెయ్యాలి?
    • అది చెడ్డ లక్షణము అయితే మీలో నుంచి పోయేలా ఏమి చెయ్యాలి?
    • పాటించవలసిన ఆజ్ఞ ఏదైనా ఉన్నదా?
    • ఆ ఆజ్ఞను పాటించే విషయము
      1. మీకు నష్టము కలిగినా పాటించటానికి సిద్దమనస్సు కలిగి ఉన్నారా?
      2. లాభసాటిగా ఉన్నంతవరకే పాటిస్తారా?
    • మీ మనస్సునకు నచ్చితేనే పాటిస్తారా?
      1. దేవుడు చెప్పాడు కాబట్టి ఎలా అయినా సరే పాటిస్తారా?
    • మీరు అనుకరించదగిన మాదిరి ఏమైనా ఉన్నదా?
    • హెచ్చరికలు ఏమైనా ఉన్నాయా?
    • శాపములు ఏమైనా ఉన్నాయా?
    • జాగ్రత్త పడవలసిన విషయములు ఏమైనా ఉన్నాయా?
    • ఆ తప్పులలో పడిపోకుండా ఎలాంటి మెలకువ కలిగి ఉండాలి?
    • విశ్వసించవలసినది ఏమైనా ఉన్నదా?
    • దేవుని గురించి తెలిసికొనుటకు ఏదైనా విషయము కలదా?
      • తండ్రి గురించి
      • కుమారుడైన క్రీస్తు గురించి
      • పరిశుద్దాత్మ దేవుని గురించి
      • దేవదూతల గురించి ఏమైనా విషయములు చెప్పబడినవా?
      • సాతాను, వాడి దూతల గురించి ఏమైనా చెప్పబడినదా?
      • దేవుని శతృవులు గురించి ఏమైనా విషయములు కలవా?
      • భక్తిహీనులు, దుర్మార్గుల గురించి ఏమైనా విషయము ఉన్నదా?
      • పరిశుద్ద గ్రంధము నందలి ఏదైనా వేరే విషయము తెలిసికొనుటకు ఈ వచనములు ఉపకరిస్తాయా?
      • దేవునికి ప్రార్ధన చేయుటకు అంశములు ఏమైనా ఉన్నాయా?
      • దేవుని స్తుతించుటకు ఏమైనా అంశములు కలవా?
      • దేవుని ఆరాదించుటకు ఏమైనా అంశములు కలవా?
      • దేవునికి కృతజ్ఞత కలిగిఉండేలా ఏమైనా అంశములు కలవా?
    • వచనములలో కాలము గురించి ఏమైనా చెప్పబడినదా?
    • వచనములలో ఏవైనా పోల్చి చెప్పటము జరిగినదా?
    • వచనములలో ఉన్న ప్రధానమైన వ్యక్తులు ఎవరు?
    • వారి పేరులకు గల అర్ధము ఏమిటి?
    • ఆ వ్యక్తులు ఎలాంటివారు?
    • ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు?
    • ఈ మాటలు ఎవరైనా 3వ వ్యక్తి గురించి చెప్పబడినవా?
    • ఈ వచనములలో ఉన్న విషయములు ఏ కాలములో జరిగాయి?
    • ఈ వచనములలో ఉన్న విషయములు ఎక్కడ జరిగాయి?
    • ఆ ప్రదేశము యొక్క పేరు ఇప్పుడు ఏమిటి? అది ఎక్కడ ఉన్నది?
    • ప్రదేశము యొక్క పేరునకు అర్ధము ఏమిటి?
    • ఆ ప్రదేశమునకు పరిశుద్ద గ్రంధములో ఏదైనా ప్రత్యేకత ఉన్నదా?
    • ఈ వచనములలో ఉన్న విషయములు జరగటానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి?
    • ఆ పరిస్థితులు దేవుని చిత్తము వల కలిగినవా? మనుష్యుల వలన వచ్చినవా?
    • ప్రవచనము ఏదైనా ఉంటే అది ఎప్పుడు ఎలా జరుగుతుంది?
  18. ఈ వచనములను ఇంగ్లీషు బైబిలులోని వివిధ తర్జుమాలలో చదివి చూడండి. ఇంకా ఏమైనా క్రొత్త సంగతులు గ్రహించగలరేమో చూడండి?
  19. ఏవైనా వ్యాఖ్యానములు రిఫర్ చేసి క్రొత్త విషయములు కనుగొనగలరేమో ప్రయత్నించండి
  20. దేవుడు ఇంకా ఏవైనా క్రొత్త సంగతులు చెప్తారేమో చివరిలో మరలా పార్ధన చేసి కనిపెట్టండి