| అధ్యాయము |
విషయము |
| 1 | యోబు యొక్క పరిశుద్దత, సాతాను మొదటి పరీక్ష, యోబు తన పిల్లలను, ఆస్థిని పోగొట్టుకొనుట |
| 2 | సాతాను రెండవ పరీక్ష. యోబు తన ఆరోగ్యము పోగొట్టుకొనుట |
| 3 | యోబు విలాపము |
| 4 | ఎలీఫజు యోబును గద్దించుట |
| 5 | ఎలీఫజు దేవుని న్యాయవంతుడుగా చూపించుట |
| 6 | యోబు తన స్నేహితుల నిర్దయ గురించి గద్దించుట |
| 7 | యోబు తన జీవితము నిష్ఫలమైనది అని చెప్పుట |
| 8 | బిల్దదు దేవుడు మంచివారికి న్యాయము చేయును అని చెప్పుట |
| 9 | యోబు దేవుని న్యాయమును గురించి అంగీకరించుట |
| 10 | యోబు తన జీవితము గురించి దేవునికి పిర్యాదు చేయుట, మరణమునకు ముందు తన ప్రాణము నెమ్మది పొందవలెనని కోరుకొనుట |
| 11 | జోఫరు యోబు స్వనీతిని గురించి గద్దించుట, దేవుని జ్ఞానము శోధింప శక్యము కానిదని చెప్పుట |
| 12 | యోబు తన గురించి తన స్నేహితులకు చెప్పుకొనుట, దేవుడు సర్వశక్తిమంతుడు అని అంగీకరించుట |
| 13 | యోబు తన స్నేహితులను పక్షపాతము గురించి గద్దించుట, దేవుని యొక్క ఉద్దేశ్యములయందు నమ్మకముంచుట |
| 14 | యోబు తన తక్కువ జీవితకాలము గురించి దేవుని మేలు అడుగుట |
| 15 | ఎలీఫజు యోబు స్వనీతిని గురించి గద్దించుట, జనుల యొక్క దుష్టత్వము గురించి చెప్పుట |
| 16 | యోబు తన స్నేహితుల దయలేనితనము గురించి గద్దించుట, తన నిర్దోషత్వము కొనసాగించుట |
| 17 | యోబు జనుల తరపున దేవునికి విన్నవించుట |
| 18 | బిల్దదు యోబు అహంకారము, అసహనము గురించి గద్దించుట |
| 19 | యోబు అవమానము పొందినట్లు బావించుట, జాలి కొరకు చూచుట, పునరుద్దానము నందు నమ్మికయుంచుట |
| 20 | జోఫరు దుష్టుల విజయము కొంతకాలమే అని చెప్పుట |
| 21 | యోబు దేవుడు దుష్టుల విషయము చూచుకొనును అని చెప్పుట |
| 22 | ఎలీఫజు యోబును పశ్చాత్తాపము విషయమై నిందించి బుద్ది చెప్పుట |
| 23 | యోబు దేవుని ముందు నిలబడాలని కోరుకొనుట |
| 24 | దుష్టత్వము కొన్నిసార్లు శిక్షింపబడక పోవచ్చు. కాని రహస్యమున దుష్టులకు న్యాయము తీర్చబడును |
| 25 | బిల్దదు మనుష్యుడు దేవుని ముందు నీతిమంతుడు కాలేడు అని చెప్పుట |
| 26 | యోబు దేవుని గొప్పతనము గురించి చెప్పుట |
| 27 | యోబు తన స్వనీతిని గురించి చెప్పుట, దుష్టులు శాపము పొందెదరు |
| 28 | భూమి యొక్క సంపదలను సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట కష్టము |
| 29 | యోబు తన పూర్వ వైభవము గురించి దుఃఖించుట |
| 30 | యోబు ప్రస్తుత స్థితి అణచివేయబడుట |
| 31 | యోబు తన నిష్కాపట్యము గురించి చెప్పుట |
| 32 | ఎలీహు యోబును తన ముగ్గురు స్నేహితుల విషయమై గద్దించుట |
| 33 | ఎలీహు దేవుడు దర్శనములు, ఇబ్బందుల ద్వారా మనుష్యులను పశ్చాత్తాపమునకు పిలుచునని చెప్పుట |
| 34 | దేవుడు అన్యాయము చేసియున్నాడు అన్న దానిని బట్టి యోబును ఎలీహు గద్దించుట |
| 35 | చాలా మంది బాధల యందు దుఃఖించుదురు. కాని విశ్వాసము లేకపోవుట వలన వారి మాటలు వినపడవు |
| 36 | యోబు యొక్క పాపము దేవుని ఆశీర్వాదములు ఎలా అడ్డుకొనునో చెప్పుట |
| 37 | దేవుడు చేయు మహా కార్యముల గురించి మనుష్యులు ఆయనకు బయపడవలెను అని ఎలీహు చెప్పుట |
| 38 | దేవుడు మాట్లాడుట, అజ్ఞానము గురించి యోబును ఒప్పించుట |
| 39 | దేవుడు తన సృష్టి గురించి మాట్లాడుట |
| 40 | యోబు దేవుని ముందు తనను తాను తగ్గించుకొనుట |
| 41 | దేవుని యొక్క శక్తి సృజించబడిన జీవులలో కనిపించుట |
| 42 | యోబు ఒప్పుకోలు, దేవుడు యోబు స్నేహితులను లోబడునట్లుగా చీసి బలి ద్వారా అంగీకరించుట, దేవుడు యోబును ఆశీర్వదించుట |