అధ్యాయము

విషయము

1  ఆదియందు వాక్యము, యోహాను సాక్ష్యము, పేతురు, ఆంద్రేయ, ఫిలిప్పు, నతానియేలు లను యేసుక్రీస్తు పిలచుట
2  కానా వివాహము, దేవాలయము లొ నుండి వ్యాపారము చేయువారిని త్రోలివేయుట
3  యేసుక్రీస్తు తిరిగి జన్మించుట గురించి నికోదేముకు బోధించుట, యేసుక్రీస్తు గురించి యోహాను సాక్ష్యము
4  సమరయ స్త్రీకి, ఊరి ప్రజలకు యేసుక్రీస్తు సాక్ష్యమిచ్చుట, అధికారి కుమారుని స్వస్థపరచుట
5  బెత్సయిదా కోనేరు దగ్గర స్వస్థత, క్రీస్తు గురించిన సాక్ష్యము
6  యేసుక్రీస్తు 5000 మందికి ఆహారము పెట్టుట, నీటి మీద నడచుట, నేనే పునరుద్దానము అని చెప్పుట, చాలా మంది యేసుక్రీస్తు ను వెంబడించకుండా వెనుదిరుగుట, క్రీస్తు గురించి పేతురు ఒప్పుకోలు
7  పర్ణశాలల పండుగలొ యేసుక్రీస్తు బోధించుట, ఆయన గురించి ప్రజలలో బేధాబిప్రాయము
8  వ్యభిచారము నందు పట్టబడిన స్త్రీ, యేసుక్రీస్తు లోకమునకు వెలుగు, సత్యము మిమ్ములను స్వతంతృలుగా చేయును
9  యేసుక్రీస్తు గృడ్డి వానిని స్వస్థపరచుట, పరిసయ్యులు యేసుక్రీస్తు అధికారము గురించి ప్రశ్నించుట, యేసుక్రీస్తు తానూ దేవుని కుమారుడని దృడముగా చెప్పుట
10  మంచి కాపరి ఉపమానము, యూదులలో విశ్వాసము, అవిశ్వాసము
11  యేసుక్రీస్తు మార్త మరియలను ఓదార్చుట, లాజరును లేపుట, యేసుక్రీస్తు చంపుటకు పధకము
12  బేతనియలొ యేసుక్రీస్తు అభిషేకము, యెరూషలేము ప్రవేశము, గ్రీసుదేశస్థులు యేసుక్రీస్తు ను చూడగోరుట, ఆయన మరణము గురించి చెప్పుట
13  యేసుక్రీస్తు శిష్యుల పాదములు కడుగుట, తనని మోసము చేయుట గురించి, పేతురు తనను ఎరుగనని చెప్పుట గురించి తెలియజేయుట
14  యేసుక్రీస్తు శిష్యులను ఓదార్చుట, నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పుట, పరిశుద్దాత్మ గురించిన వాగ్ధానము
15  ఆయన ద్రాక్షవల్లి మనము తీగెలము, లోకము చేత ద్వేషింపబడుట
16  యేసుక్రీస్తు పరిశుద్దాత్మ గురించి వాగ్ధానము చేయుట, తన మరణము, పునరుద్దానము గురించి చెప్పుట
17  యేసుక్రీస్తు తన గురించి, శిష్యుల గురించి, విస్వాసుల గురించి ప్రార్ధించుట
18  ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ను మోసము చేయుట, పేతురు తెలియదని చెప్పుట, యేసుక్రీస్తు అన్న మరియు పిలాతుల చేత ప్రశ్నించబడుట
19  ముళ్లకిరీటము, యేసుక్రీస్తు శిలువ మరియు సమాధి
20  ఖాళీ సమాధి, యేసుక్రీస్తు మగ్ధలేనే మరియ, శిష్యులకు, తోమాకు కనిపించుట
21  గలిలయ సముద్రములో గొప్ప చేపలు పట్టే అద్భుతక్రియ, తన గొఱ్ఱలను మేపమని చెప్పుట