అధ్యాయము

విషయము

 1  దుష్టుల ఆలోచన చొప్పున నడువక ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు
2  రాజ్యములు ఏల అల్లరి చేయుచున్నవి. జనులు ఎందుకు వ్యర్ధమైన ఆలోచన చేయుచున్నారు
3  దేవా నన్ను బాధించువారు ఏల విస్తరించియున్నారు
4  నా నీతికి ఆధారమగు దేవా, నేను మొఱ్ఱపెట్టునప్పుడు నాకుత్తరమిమ్ము
5  యెహోవా, నా మాటలు చెవినిబెట్టుము నా ధ్యానముమీద లక్ష్యముంచుము
6  యెహోవా, నీ కోపముచేత నన్ను గద్దింపకుము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము
7  నా  దేవా,  నేను నీ శరణుజొచ్చియున్నాను
8  యెహోవా మా ప్రభువా భూమియందంతట నీ నామము ఎంత ప్రభావముగలది.
9  నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను
10  యెహోవా, నీ వెందుకు దూరముగా నిలుచుచున్నావు
11  యెహోవా శరణుజొచ్చియున్నాను
12  యెహోవా నన్ను రక్షింపుము, భక్తిగలవారు లేకపోయిరి
13  యెహోవా, ఎన్నాళ్లవరకు నన్ను మరచిపోవుదువు
14  దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయ ములో అనుకొందురు
15  యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు
16  దేవా, నీ శరణుజొచ్చియున్నాను, నన్ను కాపాడుము.
17  యెహోవా, న్యాయమును ఆలకించుము, నా మొఱ్ఱ నంగీకరించుము నా ప్రార్థనకు చెవియొగ్గుము
18  యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించు చున్నాను
19  ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది
20  ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చును గాక
21  యెహోవా, రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు
22  నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి
23  యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు
24  భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులును యెహోవావే
25  యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తి కొనుచున్నాను
26  యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము
27  యెహోవా నాకు వెలుగును రక్షణయునై యున్నాడు, నేను ఎవరికి భయపడుదును
28  యెహోవా, నేను నీకు మొఱ్ఱపెట్టు చున్నాను నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండకుము
29  దైవపుత్రులారా, యెహోవాకు ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి
30  యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతో షింపనియ్యక నీవు నన్నుద్ధరించి యున్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను.
31  యెహోవా, నీ శరణుజొచ్చి యున్నాను నన్నెన్నడును సిగ్గుపడనియ్యకుము
32  తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు
33  నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము. చేయుడి. స్తుతిచేయుట యథార్థవంతులకు శోభస్కరము.
34  నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును
35  యెహోవా, నాతో వ్యాజ్యెమాడు వారితో వ్యాజ్యెమాడుము నాతో పోరాడు వారితో పోరాడుము
36  భక్తిహీనుల దృష్టియెదుట దేవుని భయము బొత్తిగాలేదు
37  చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము
38  యెహోవా, కోపోద్రేకము చేత నన్ను గద్దింపకుము
39  నా నాలుకతో పాపముచేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును
40  యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టు కొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను
41  బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును.
42  దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది.
43  దేవా, నాకు న్యాయము తీర్చుము భక్తిలేని జనముతో నా పక్షమున వ్యాజ్యెమాడుము
44  దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసినపనినిగూర్చి మేము చెవులార విని యున్నాము
45  ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది
46  దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు
47  సర్వజనులారా, చప్పట్లు కొట్టుడి జయ ధ్వనులతో దేవునిగూర్చి ఆర్భాటము చేయుడి
48  యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై యున్నాడు
49  సర్వజనులారా ఆలకించుడి.
50  తూర్పుదిక్కు మొదలుకొని పడమటి దిక్కువరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు
51  దేవా, నీ కృపచొప్పున నన్ను కరుణింపుము
52  శూరుడా, చేసిన కీడునుబట్టి నీ వెందుకు అతిశయ పడుచున్నావు
53  దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు
54  దేవా, నీ నామమునుబట్టి నన్ను రక్షింపుము నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము
55  దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపమునకు విముఖుడవై యుండకుము
56  దేవా, నన్ను కరుణింపుము మనుష్యులు నన్ను మింగవలెనని యున్నారు
57  నన్ను కరుణింపుము దేవా నన్ను కరుణింపుము నేను నీ శరణుజొచ్చి యున్నాను
58  అధిపతులారా, మీరు నీతి ననుసరించి మాటలాడుదు రన్నది నిజమా
59  నా దేవా, నా శత్రువుల చేతిలోనుండి నన్ను తప్పింపుము
60  దేవా, మమ్ము విడనాడి యున్నావు మమ్ము చెదరగొట్టి యున్నావు
61  దేవా, నా మొఱ్ఱ ఆలకింపుము నా ప్రార్థనకు చెవియొగ్గుము
62  నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయనవలన నాకు రక్షణ కలుగును
63  దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును
64  దేవా, నేను మొఱ్ఱపెట్టగా నా మనవి ఆలకింపుము శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము
65  దేవా, సీయోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే
66  సర్వలోక నివాసులారా, దేవునిగూర్చి సంతోష గీతము పాడుడి
67  దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును  గాక ఆయన తన ముఖకాంతి మామీద ప్రకాశింపజేయును
68  దేవుడు లేచును గాక ఆయన శత్రువులు చెదరి పోవుదురు గాక
69  దేవా, జలములు నా ప్రాణముమీద పొర్లుచున్నవి నన్ను రక్షింపుము
70  దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము
71  యెహోవా, నేను నీ శరణుజొచ్చి యున్నాను. నన్నెన్నడును సిగ్గుపడనియ్యకుము
72  దేవా,  రాజునకు నీ న్యాయవిధులను రాజకుమారునికి నీ నీతిని తెలియజేయుము
73  ఇశ్రాయేలుయెడల శుద్ధహృదయుల యెడల నిశ్చయముగా దేవుడు దయాళుడై యున్నాడు
74  దేవా, నీవు నిత్యము మమ్మును విడనాడితివేమి
75  దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము
76  యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది
77  నేను ఎలుగెత్తి దేవునికి మొఱ్ఱ పెట్టుదును ఆయనకు మనవి చేయుదును
78  నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి నా నోటిమాటలకు చెవియొగ్గుడి
79  దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడియున్నారు వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరచియున్నారు
80  ఇశ్రాయేలునకు కాపరీ, చెవియొగ్గుము
81  మనకు బలమైయున్న దేవునికి ఆనందగానము చేయుడి
82  దేవుని సమాజములో దేవుడు నిలిచియున్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు
83  దేవా, ఊరకుండకుము దేవా, మౌనముగా ఉండకుము
84  సైన్యములకధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు
85  యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపియున్నావు
86  యెహోవా, నేను దీనుడను దరిద్రుడను చెవియొగ్గి నాకుత్తరమిమ్ము
87  ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతములమీద వేయబడియున్నది
88  యెహోవా, దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొఱ్ఱపెట్టునాడు
89  యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను
90  ప్రభువా, తరతరములనుండి మాకు నివాసస్థలము నీవే.
91  మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని  నీడను విశ్రమించువాడు
92  యెహోవాను స్తుతించుట మంచిది
93  యెహోవా రాజ్యము చేయుచున్నాడు
94  యెహోవా, ప్రతికారము చేయు దేవా,  ప్రకాశింపుము
95  రండి యెహోవానుగూర్చి ఉత్సాహధ్వని చేయుదము
96  యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి
97  యెహోవా రాజ్యము చేయుచున్నాడు
98  యెహోవా ఆశ్చర్యకార్యములు చేసియున్నాడు
99  యెహోవా రాజ్యము చేయుచున్నాడు
100  సమస్త్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి
101  నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను
102  యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము నా మొఱ్ఱ నీయొద్దకు చేరనిమ్ము
103  నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము
104  నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము.
105  యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి
106  యెహోవాను స్తుతించుడి యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు  చెల్లించుడి
107  యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి
108  దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది
109  నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనముగా ఉండకుము
110  నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము
111  యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదను
112  యెహోవాయందు భయభక్తులుగలవాడు ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు
113  యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించుడి
114  యూదా ఆయనకు పరిశుద్ధస్థలమాయెను ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను
115  మాకు కాదు, యెహోవా మాకు కాదు నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలగునుగాక
116  యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించియున్నాడు
117  యెహోవా కృప మనయెడల హెచ్చుగానున్నది
118  యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచును
119  యెహోవా ధర్మశాస్త్రము ననుసరించి నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు
120  నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను
121  యెహోవావలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు
122  యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని
123  ఆకాశమందు ఆసీనుడవైనవాడా, నీ తట్టు నా కన్ను లెత్తుచున్నాను
124  యెహోవా మనకు తోడైయుండని యెడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసియుందురు
125  యెహోవాయందు నమ్మిక యుంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలెనుందురు
126  యెహోవా  మనకొరకు  గొప్పకార్యములు  చేసి యున్నాడు మనము సంతోషభరితులమైతివిు
127  యెహోవా ఇల్లు కట్టించనియెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడనియెడల దాని కావలికాయువారు మేలుకొని యుండుటవ్యర్థమే
128  యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు
129  యెహోవా న్యాయవంతుడు భక్తిహీనులు కట్టిన త్రాళ్లు ఆయన తెంపియున్నాడు
130  యెహోవా, అగాధస్థలములలోనుండి నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను
131  నాకు అందనివాటియందైనను గొప్పవాటియందైనను నేను అభ్యాసము చేసికొనుట లేదు.
132  యెహోవా, దావీదునకు కలిగిన బాధలన్నిటిని అతని  పక్షమున జ్ఞాపకము చేసికొనుము
133  సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!
134  యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండువార లారా,  మీరందరు యెహోవాను సన్నుతించుడి
135  యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతలకంటె గొప్పవాడనియు నేనెరుగుదును
136   యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును
137  అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదుము
138  నేను నా పూర్ణహృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు  చెల్లించుచున్నాను దేవతల యెదుట నిన్ను కీర్తించెదను
139  యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొనియున్నావు
140  యెహోవా, దుష్టుల చేతిలోనుండి నన్ను విడిపింపుము బలాత్కారము చేయువారి చేతిలో పడకుండ నన్ను కాపాడుము
141  యెహోవా నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నాయొద్దకు త్వరపడి రమ్ము నేను మొఱ్ఱపెట్టగా నా మాటకు చెవియొగ్గుము
142  నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను
143  యెహోవా,  నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపములకు చెవి యొగ్గుము నీ విశ్వాస్యతనుబట్టియు నీ నీతినిబట్టియు నాకు ఉత్తరమిమ్ము
144  నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడైయున్నాడు.
145  రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను
146  యెహోవాను స్తుతించుడి. నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము
147  యెహోవాను స్తుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అది మనోహరము స్తోత్రముచేయుట ఒప్పిదము
148  యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి ఉన్నతస్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి
149  యెహోవాను స్తుతించుడి యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి
150  యెహోవాను స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధిచేయు ఆకాశవిశాలమందు ఆయనను స్తుతించుడి