ఆదికాండము 6:1-4 వచనములు దేవుని కుమారులను మరియు నరుల కుమార్తెలను గూర్చిన ప్రస్తావన చేస్తుంది. ఈ దేవుని కుమారులు ఎవరు మరియు నరుల కుమార్తెలతో వీరు కనిన బిడ్డలు ఎందుకు శూరుల వంశముగా (నెఫీలులు అను పదమునకు ఇదే అర్ధముగా సూచించబడినది) వర్దిల్లారు అనే విషయమై అనేకమైన సలహాలు చేయబడినవి.
దేవుని కుమారులు యొక్క గుర్తింపును గూర్చి చేయబడిన మూడు ప్రధానమైన ఆలోచనలు ఏవనగా: 1) వారు పడిపోయిన దూతలు, 2) వారు శూరులైన మానవ నాయకులు, లేదా 3) కయీను యొక్క దుష్ట సంతానముతో వివాహములాడిన సేతు యొక్క దైవీక సంతానమువారు. మొదటి ఆలోచనకు బలమును చేకూర్చే అంశము ఏమంటే పాతనిబంధనలో ఎప్పుడు కూడా “దేవుని కుమారులు” అనగా దూతలను సూచిస్తుంది (యోబు 1:6; 2:1; 38:7). దీనికి బహుశ ఎదురయ్యే సమస్య మత్తయి 22:30లో మనకు కనబడుతుంది, అక్కడ దూతలు వివాహమాడవని తెలియజేయబడింది. దేవదూతలకు లింగము అనేది ఉంటుందని లేదా అవి పునరుత్పత్తి చేయగలవని నమ్మునట్లు పరిశుద్ధ గ్రంధము మనకు ఎట్టి కారణములను ఇవ్వలేదు. మిగిలిన రెండు ఆలోచనలలో అయితే ఈ సమస్య ఉండడు.
2వ మరియు 3వ ఆలోచనల యొక్క బలహీనత ఏమంటే సాధారణమైన మానవ పురుషులు సాధారణమైన మానవ స్త్రీలను వివాహమాడినప్పుడు “శూరులు” లేదా “పూర్వకాలమందు శూరులు, పేరుపొందిన వారు” వీరికి ఎలా పుడతారు అనే ప్రశ్న. ఇంకా, బలవంతులైన మానవ పురుషులు లేదా సేతు యొక్క సంతానమువారు సాధారణమైన మానవ స్త్రీలను లేదా కయీను సంతానమువారిని వివాహమాడుటకు దేవుడు అభ్యంతరపరచలేదు గనుక దేవుడు ఈ లోకము మీదికి జలప్రళయమును ఎందుకు రప్పిస్తాడు (ఆది. 6:5-7)? ఆదికాండము 6:5-7లో సంభవించబోతున్న తీర్పు ఆదికాండము 6:1-4లో జరిగిన సంఘటనలతో అనుసంధానించబడింది. మానవ స్త్రీలతో పడిపోయిన దూతలు చేసుకున్న దుర్మార్గపు, విచక్షణారాహిత్యమైన వివాహము వలననే ఇటువంటి కఠోరమైన తీర్పు జరుగవచ్చునని మనకు తెలుస్తుంది.
ముందు ప్రస్తావించినట్లుగా, మొదటి ఆలోచన యొక్క బలహీనత ఏమనగా, మత్తయి 22:30వ వచనము “పునరుత్థానమందు ఎవరును పెండ్లిచేసికొనరు, పెండ్లి కియ్యబడరు; వారు పరలోకములో ఉన్న దూతలవలె ఉందురు” అని ప్రకటిస్తుంది. అయినప్పటికీ, “దేవదూతలు పెండ్లి చేసికొనుటకు సమర్ధులు కారు” అని ఈ వాక్యము చెప్పుటలేదు. కాని, దూతలు పెండ్లి చేసికొనరు అని మాత్రమే ఈ వాక్యము చెప్తుంది. రెండవదిగా, మత్తయి 22:30 “పరలోకములో ఉన్న దూతల”ను గూర్చి మాట్లాడుతుంది. పడిపోయిన దూతలను గూర్చి, అంటే సృష్టింపబడిన దేవుని క్రమమును గూర్చి ఆలోచించక దేవుని ప్రణాళికను ఎప్పుడు అభ్యంతరపరచవలెనని క్రియాశీలకంగా ఎదురు చూసే, దూతలను గూర్చి మాట్లాడుతుంది. దేవుని పరిశుద్ధ దూతలు పెండ్లి చేసికొనరు లేదా లైంగిక సంబంధములలో పాలుపొందరు అనే సత్యము సాతాను మరియు దాని దూతలు కూడా అలాగే ఉంటారు అని సూచించుటలేదు.
1వ ఆలోచనే అత్యంత సాధ్యమగు వివరణ. అవును, దూతలను లింగములు లేనివారిగా పరిగణించి “దేవుని కుమారులు” అంటే మానవ స్త్రీలతో పునరుత్పత్తిలో పాలుపొందిన పడిపోయిన దూతలు అని చెప్పడం నిజముగానే ఆశక్తికరమైన ఒక “వైరుధ్యము.” కానీ, దూతలు ఆత్మీయమైన జీవులు కాగా (హెబ్రీ. 1:14), అవి భౌతికమైన రూపములో మానవులుగా అగుపడవచ్చు (మార్కు 16:5). లోతు ఇంటిలో ఉన్న ఇద్దరు దూతలతో సొదొమ మరియు గొమోఱ్ఱ పురుషులు శయనించాలని కోరుకున్నారు (ఆదికాండము 19:1-5). దూతలు మానవ రూపమును తీసుకోవడం అనేది సాధ్యపడే విషయమే, అంటే మానవ లైంగికతను మరియు బహుశ వారి పునరుత్పత్తిని కూడా అనుకరించునంతగా మానవ రూపమును తీసుకోవడం సాధ్యమే. పడిపోయిన దూతలు తరచూ ఈ విధంగా ఎందుకు చేయరు? ఎందుకంటే చెడ్డదైన ఈ పాపమును చేసినందున దేవుడు ఈ పడిపోయిన దూతలను బంధించాడు గనుక, తద్వారా పడిపోయిన కడమ దూతలు ఇలా చేయకుండా ఉంటాయి (యూదా 6లో వివరించినట్లుగా). పడిపోయిన దూతలు ఆదికాండము 6:1-4లో ప్రస్తావించబడిన “దేవుని కుమారులే” అని మునుపటి హెబ్రీ వ్యాఖ్యానకర్తలు మరియు ప్రత్యక్షతను గూర్చిన వాక్యాలను మరియు ద్వితీయ ప్రాధాన్యత కలిగిన అట్టి వాక్యాలను (apocryphal మరియు pseudepigraphal) వ్యాఖ్యానించే వారు కూడా ఏకాభిప్రాయంతో ఉండేవారు. ఈ అభిప్రాయం ఎంతమాత్రమును ఈ వివాదాన్ని పరిష్కరించదు. కానీ, ఆదికాండము 6:1-4లో పడిపోయిన దూతలు మానవులైన స్త్రీలతో కూడారు అనే వాదన నేపథ్యపరంగానూ, వ్యాకరణ పరంగానూ, అలాగే చారిత్రిక ఆధారాల పరంగానూ బలమైన వాదనగా ఉంటుంది.