బైబిలు ప్రకరణలు జలప్రళయం గూర్చి అది ప్రపంచవ్యాప్తంగా జరిగెనని స్పష్టము చేయును. ఆదికాండము 7:11 ప్రకటిస్తూ, “మహాగాధజలముల ఊటలన్నియు ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను.” ఆదికాండము 1:6-7 మరియు 2:6 మనకు మనము ఈ రోజు అనుభవించే వాతావరణం జలప్రళయం ముందు చాలా వ్యత్యాసంగా వుండేది అని చెప్పును. ఈ విషయాలపై మరియు ఇతర బైబిలు సంబంధమైన వివరణలపై ఆధారపడి, ఇది సహేతుకంగా ఒక సమయంలో భూమి ఏదో ఒకరకమైన నీటి పందిరిచే కప్పబడెనని ఊహించిరి. ఈ పందిరి ఒక ఆవిరి పందిరి, లేక అది వలయాలను, శనిగ్రహము యొక్క మంచువలయాల వలే కలిగియుండవచ్చు. ఇది, భూగర్భ జలముల పొరతో కలిసి, భూమిపై వదలబడెను (ఆదికాండము 2:6) అది ప్రపంచవ్యాప్త జలప్రలయమునకు కలుగజేసెను.
జలప్రళయం యొక్క విస్తారతను స్పష్టముగా చూపే వచనాలు ఆదికాండము 7:19-23. నీటిని గూర్చి, “ఆ ప్రచండ జలములు భూమిమీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నియు మునిగిపోయెను. పదిహేను మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలేను గనుక పర్వతములును మునిగిపోయెను. అప్పుడు పక్షులేమి పశువులేమి భూమిమీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయిరి. పొడి నేలమీదనున్న వాటన్నిటిలోను నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నియు చనిపోయెను. నరులతో కూడా పశువులును పురుగులును ఆకాశపక్షులును నేలమీదనున్న జీవరాశులన్నియు తుడిచివేయబడెను. నోవహును అతనితో కూడ ఆ ఓడలోనున్నవియు మాత్రము మిగిలియుండెను.”
పై ప్రకరణలో, “సమస్తము” అనే పదము మరలామరల వాడబడుట మాత్రం చూడము కానీ, మనము “ఆకాశామంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నియు మునిగిపోయెను,” “జలములు ప్రబలి పర్వతములను 20 అడుగుల కంటే ఎక్కువగా కప్పివేసెను,” మరియు “ఉపిరిగలవన్నియు భూమిమీద సంచరించువన్నియు చనిపోయెను” అని కనుగొందుము. ఈ వివరణలు స్పష్టముగా భూమినంతటిని కప్పివేసిన ఒక విశ్వవ్యాప్తమైన జలప్రళయమును వర్ణించును. అలాగే, ఒకవేళ ఆ జలప్రళయం స్థానికమైతే, దేవుడు నోవహును కేవలం జంతువులను అన్నిటినీ వలసపోనివ్వడానికి బదులుగా ఒక ఓడను ఎందుకు నిర్మించమని సూచించాడు? మరియు ఆయన నోవహును ఒక గృహమంత పెద్ద ఓడను అన్ని రకాల భూమిపైనున్న భూజంతువుల కొరకు నిర్మించమని ఎందుకు సూచిస్తాడు? ఒకవేళ ఆ జలప్రళయం ప్రపంచవ్యాప్తం కాకపోతే, అప్పుడు ఒక ఓడ అవసరమే వుండివుండేది కాదు.
2 పేతురు 3:6-7లో, పేతురు కూడా జలప్రళయం యొక్క విస్వవ్యాప్తతను వివరించును, అక్కడ అతడు చెప్తూ, “ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశానమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి.” ఈ వచనములలో పేతురు “విశ్వవాప్త” జలప్రళయ తీర్పు నోవహు సమయములో వచ్చెనని పోల్చి మరియు అప్పుడున్న ప్రపంచము నీటివరదతో ఉండెనని చెప్పెను. ఇంకా, చాలామంది బైబిలుసంబంధ రచయితలు ప్రపంచవ్యాప్త జలప్రళయము యొక్క చారిత్రాత్మికమని అంగీకరించెను (యెషయా 54:9; 1 పేతురు 3:20; 2 పేతురు 2:5; హెబ్రీ 11:7). చివరిగా, ప్రభువైన యేసుక్రీస్తు విశ్వవాప్త జలప్రళయము నమ్మి మరియు దానిని యానన తిరిగి వచ్చినప్పుడు ప్రపంచమునకు వచ్చే నాశన రకముగా తీసికొనెను (మత్తయి 24:37-39; లూకా 17:26-27).
ప్రపంచవ్యాప్త విపత్తును సూచించే దేశవ్యాప్త జలప్రళయమునకు చాలా ఎక్కువ బైబిలు ఆధారములు ఉండెను. ప్రతి ఖండములో అధికమైన శిలాజ స్మశానములు మరియు పెద్ద మొత్తములో వేగవంతమైన కప్పుదలకు అత్యధిక వృక్ష పరిమాణమునకు కావలసిన బొగ్గు నిక్షేపాలు కనుగొనబడెను. ప్రపంచము చుట్టూ పర్వత శిఖరములపై సముద్ర శిలాజములు కనుగొనబడెను. జలప్రళయ పురాణ రూపములో ప్రపంచ ఆని భాగాలలో సంస్కృతులు ఏదో ఒక రూపములో ఉండెను. ఈ వాస్తవములన్నియు మరియు చాల వేరేవి దేశవ్యాప్త జలప్రళయమునకు ఆధారములు.