ఇవ్వబడిన వాస్తవాలు అనుగుణంగా, బైబిలు ప్రకారం, మన గ్రహము యొక్క ఉనికిలో ఆరవ రోజున ఆదాము సృష్టించబడెను, మనము ఒక బైబిలు ఆధారిత, మానవాళి యొక్క కాలక్రమానుసార వివరాలు చూచుట ద్వారా భూమి యొక్క సుమారు వయస్సును గుర్తించవచ్చు. ఆదికాండ వివరణ దీనికి ఖచ్చితమైన ఆధారముగా అనుకొనవచ్చు, సృష్టి యొక్క ఆరు రోజులు అక్షరాలా 24-గంటల కాలాలు, మరియు ఆదికాండము యొక్క కాలక్రమములో ఏవిధమైన అనిశ్చిత ఖాళీలు లేవు.

ఆదికాండము 5 మరియు 11 అధ్యాయాలలో తెలుపబడిన వంశావళిలో ఆదాము మరియు అతని వారసులు ప్రతీ ఒక్కరూ తరువాత వంశములో ఒక క్రమానుగత పూర్వికుల వరుసలో జన్మనిచ్చినట్లుగా తెలుపుతుంది. కాలక్రమానుసారంగా అబ్రాహాము ఎక్కడ సరిపోతాడో నిర్ణయించుట మరియు ఆదికాండము 5 మరియు 11 అందించిన వయస్సులను జోడించి ద్వారా, భూమి 6000 సంవత్సరాల నాటిదని బైబిలు భోధించుచున్నది అని స్పష్టమగుచున్నది, కొన్ని వందల సంవత్సరాలు అటు ఇటుగా.

నేడు శాస్త్రవేత్తలలో అధికులు అంగీకరిస్తున్న బిలియన్ల సంవత్సరాలు మరియు మన అధిక విద్యా సంస్థలలో భోదించుచున్న దానిని గురించి ఏమిటి? ఈ వయస్సు ప్రధానంగా రెండు వయస్సును నిర్ణయించే పద్దతులను నుండి తీసుకోబడింది: రేడియోమెట్రిక్ కాలనిర్ణయము మరియు జియోలాజిక్ (భూవిజ్ఞాన) కాలపుకొలత. 6000 సంవత్సరాలకు అనుకూలమైన శాస్త్రవేత్తలు రేడియోమెట్రిక్ కాలనిర్ణయము పొరపాట్లతో కూడుకొని స్థాపించబడినది అని నొక్కి చెప్పుచున్నారు, కాని జియోలాజిక్ కాలవ్యవధి దానిలో విఫలమై వృత్త ఆలోచన ఉపయోగిస్తుంది. అంతేకాక, వారు పాత-భూపురాణాల అపోహలను సూచిస్తూ, స్తలీకరణ, శిలాజీకరణ మరియు వజ్రాలు, బొగ్గు, నూనె, శిలాజిత్తులు, గుహలలో ఏర్పడు స్తంబాలు మొదలగునవి ఏర్పడుటకు చాలా కాలము పడుతుంది అను అనేక సాధారణమైన అపోహలను తెలుపుతారు. చివరిగా, యువ-భూవాదులు భూమిని గురించి పాత-భూమి ప్రతిష్టతను నిలబెట్టు ఆధారాల స్థానంలో భూమి యొక్క యుక్త వయస్సును గూర్చి ఒక అనుకూలమైన ఆధారాలను తెలియజేసారు. యుక్త-భూమి శాస్త్రవేత్తలు నేడు తక్కువగా ఉన్నారని గుర్తిస్తున్నారు కానీ మరింతమంది శాస్త్రజ్ఞులు కాలక్రమేనా పరిక్షించుట ద్వారా మరియ ఇప్పుడు అంగీకరించిన పాత-భూ సమాహారమును సమీపంగా చూచుట ద్వారా వారి స్థానము పెరుగునని నొక్కి చెప్పుచున్నారు.

చివరికు, భూమి యొక్క వయస్సును రుజువుపరచుట సాధ్యం కాదు. 6000 సంవత్సరాలు లేక బిలియన్ల సంవత్సరాలు, రెండు దృక్పధాలు (మరియు మధ్యలో ప్రతీది) విశ్వాసం క్లేదా తలంపుల మిద ఆధారపడి ఉంటుంది. బిలియన్ల సంవత్సరాలను నమ్మువారు రేడియోమెట్రిక్ కాలనిర్ణయమును విశ్వసిస్తూ మరియు రేడియో- ఐసోటోప్స్ సాధారణ క్షయ బంగమును ఆపేందుకు చరిత్రలో ఎటువంటి సంఘటన జరుగలేదు అను పద్దతులను నమ్ముతారు. 6000 సంవత్సరాలను నమ్మువారు బైబిలు వాస్తవము అని నమ్మి భూమి యొక్క “స్పష్టమైన” వయస్సును వివరించేందుకు ఇతర కారణాలు, ప్రపంచ జలప్రళయం, లేదా దానికి ఎక్కువ వయస్సు ఇచ్చునట్లుగా “కనిపించునట్లు” దేవుడు లోకమును సృష్టించుట. ఒక ఉదాహరణగా, ఒక సంపూర్ణముగా ఎదిగిన యుక్త వయస్సు గల మానవులుగా దేవుడు ఆదామును హవ్వను సృజించెను. ఒకవేళ ఒక వైద్యుడు ఆదాము హవ్వను వారు సృజించబడినప్పుడు పరీక్షిస్తే, వైద్యుడు వారి వయస్సును 20 సంవత్సరాలుగా అంచనా వేయవచ్చు (లేదా వారు కనిపించినంత వయస్సు గలవారిగా) అప్పుడు, వాస్తవంగా, ఆదాము మరియు హవ్వ ఒక రోజు వయస్సు గలవారు. ఏది ఏమైనప్పటికీ, ముల్యాంకాన పద్ధతి గల నాస్తిక శాస్త్రవేత్తల మాటల కంటే దేవుని వాక్యమును విశ్వసించుటకు సరియైన కారణము ఉంటుంది.