0
వచనములు
0
దేవుడు
0
సాతాను
0
కుటుంబము

మానవులు పాపములో పడిపోయి దేవుని సన్నిధికి దూరమగుట ఈ అధ్యాయములోని ప్రధానమైన అంశము. సాతాను సర్పము ద్వారా స్త్రీని మోసపరచి ఇద్దరు దేవుని నిబంధన మీరునట్లుగా చేసినది. నిషిద్దమైన ఫలము తినుటద్వారా వారు దేవుని నిబంధన మీరి తాము దిగంబరులమని తెలుసుకొని వారి కొరకు ఆకులతో కచ్చడములు చేసుకొనిరి. దేవుడు వారితో సహావాసమునకు వచ్చినపుడు దేవునికి ఎదురుపడే ధైర్యములేక వారు తోటలోని చెట్లమద్య దాగుకొనిరి. దేవుడు వారు దాగుకొనిన విషయము విచారణ చేసినపుడు, దేవుడు వారికి ఇచ్చిన అవకాశము స్త్రీ, పురుషులు ఇద్దరూ ఉపయోగించుకొనక పోవుటవలన వారు శిక్షకు గురికావలసి వచ్చినది. వారు తాము చేసిన తప్పు ఒప్పుకొనక ఒకరిమీద ఒకరు నేరము మోపుకొనిరి. ఆదాము ఒక అడుగు ముందుకు వేసి దేవుడు తనకు స్త్రీని ఇవ్వటము వలననే ఈ పాపము జరిగినట్లుగా సాహసించి మాట్లాడాడు. దేవుడు సర్పమును శపించి, సాతాను యొక్క అధికారమును తొలగించుటకు రక్షకుని గురించిన వాగ్ధానము చేసినారు. దేవుడే స్త్రీ, పురుషుల తరుపున పాపపరిహారార్ధ బలి అర్పించి వారికి చెర్మపు చొక్కాయిలను చేయించి తొడిగించారు. దీనిని బట్టి ఆయన మనలను అసహ్యించుకుని త్రోసివేసే దేవుడు కాదని అర్ధము అవుతుంది. వారు పాపములోనే ఎల్లకాలము జీవించి ఉండకుండా మరలా వారిని తనతో అనుసంధానము చేసుకోవటానికి జీవవృక్ష ఫలము తినకుండా వారిని ఏదేను తోటనుండి పంపివేయటము జరిగినది. ఎవరూ జీవవృక్షము సమీపించకుండా ఏదేనుకు తూర్పున కెరూబులను, వృక్షమునకు చుట్టూ అటు ఇటు తిరుగు ఖడ్గజ్వాలను కావలి ఉంచటము జరిగినది. 15వ వచనంలో పాముపై చివరికి విజయం మరియు అది చేసిన నష్టం గురించిన మొదటి ప్రవచనం ఉంది. ఇది దేవుని గురించి మనకు ఏమి చెబుతుందో పరిశీలించండి-ఈ సమయంలో కూడా ఆయన మీతో సహా పడిపోయిన మానవాళి కోసం తన విమోచన ప్రణాళికను ప్రారంభించాడు.

అధ్యాయము యొక్క అవగాహన

  • అధ్యాయము యొక్క వివరణ
  • అధ్యాయములో గమనించవలసిన అంశములు
  • అధ్యాయములో దేవుని ప్రత్యక్షత
  • అధ్యాయములో నేర్చుకొనవలసిన పాఠములు
  • అధ్యాయములో స్తుతి, ఆరాధన అంశములు
  • అధ్యాయము నిర్మాణము*

అధ్యాయము యొక్క స్టడీ

వచనముల వారీగా అధ్యాయము స్టడీ చేయుటకు. ప్రతి వచనమును సమగ్రముగా వివిధ కోణములలో అర్ధము చేసుకొనుట కొరకు ఈ క్రింది సమాచారము ఇవ్వబడినది

  • క్రాస్ రిఫరెన్స్ లు
  • పారలల్ బైబిలు
  • స్టడీ నోట్స్
  • స్టడీ వీడియోలు
  • డిక్షనరీ
  • పదముల స్టడీ (కంకార్డెన్స్)
  • స్ట్రాంగ్స్ డిక్షనరీ (హీబ్రూ, గ్రీకు పదముల వివరణ)

అధ్యాయము డౌన్లోడ్ లు

అధ్యాయము PPT

తెలుగు ఇంగ్లీష్ పారలల్ బైబిలు

తెలుగు భారతీయ బాషల పారలల్ బైబిలు

తెలుగు హీబ్రూ గ్రీకు బాషల పారలల్ బైబిలు

అధ్యాయము రిఫరెన్స్ లు వచనములు లేకుండా

అధ్యాయము రిఫరెన్స్ లు వచనములతో

అధ్యాయము ఆడియో

English Transliteration