0
వచనములు
0
దేవుని పిలుపు
0
అబ్రాహాము
0
కిలోమీటర్లు

అధ్యాయము యొక్క సారాంశము

దేవుడు అబ్రహామును పిలిచిన పిలుపు యొక్క వివరములు ఈ అధ్యాయము యొక్క మొదటి భాగమునందు ఇవ్వబడినాయి. దేవుడు తన ఇంటినుండి, దేశము నుండి, బంధువుల నుండి వేరై తను చూపించు దేశమునకు వెళ్లమని, అక్కడ అబ్రహామును తను జనములకు తండ్రిగాను, లోకమునకు ఆశీర్వాదముగాను చేసి తన పేరు గొప్ప చేస్తాను అని దేవుడు చెప్పటముతో అబ్రహాము దేవుని యొక్క పిలుపు ప్రకారము బయలుదేరి వెళ్లి కనానుకు చేరాడు. తనతోపాటు తన భార్యను, లోతును, తన దాసదాసీలను వెంటబెట్టుకుని వెళ్లటము జరిగినది. అబ్రహాము అ దేశము అంతా కూడా సంచారము చేయుచు బేతేలునకు, హాయికిని మద్య తన గుడారము వేసికొనెను. అబ్రహాము బలిపీటము కట్టి దేవునికి ప్రార్ధన చేసినపుడు ఆ దేశమును తన సంతానమునకు ఇస్తాను అని దేవుడు సెలవిచ్చాడు. ఆ సమయమునందు ఆ దేశములో కరువురాగా దాని నుండి తప్పించుకొనుటకు అతడు తన కుటుంబముతో ఇగుప్తునకు ప్రయాణమై వెళ్లాడు. ఇగుప్తీయులు తన భార్య గొప్ప సౌందర్యవతియై యుండుట చూచి తనను చంపి ఆమెను చెరపడతారేమో అని భయపడి, ఆమె తన సహోదరి అని చెప్పి అబద్దము చెప్తాడు. అలానే చెప్పమని తన భార్యయైన శారాకు కూడా సెలవిస్తాడు. ఆమె సౌందర్యము చూసి అధికారులు రాజు దగ్గర పోగిడినపుడు ఇగుప్తు రాజైన ఫరో ఆమెను తన ఇంటికి తెప్పిస్తాడు. ఆమెను బట్టి అబ్రహామునకు గొర్రెలు, గొడ్లు, గాడిదలు, ఒంటెలు, దాసీజనము బహుమతిగా ఇస్తాడు. శారాను ఇంటికి తీసుకువచ్చిన దానిని బట్టి దేవుడు ఫరో ఇంటివారిని మహావేదనల చేత బాధించటము జరిగినది. తరువాత ఫరో అసలు విషయము తెలుసుకుని శారాను అబ్రహాము దగ్గరకు చేర్చటము, తనకు కలిగిన సమస్తముతో ఇగుప్తునుండి తనను పంపివేయటముతో అధ్యాయము ముగుస్తుంది.

అధ్యాయము స్టడీ

  • అధ్యాయములోని విశేషములు
  • అధ్యాయము PPT
  • అధ్యాయములోని స్తుతి, ఆరాధన అంశములు
  • అధ్యాయము ఆడియో (ఆడియో, ఆడియో+వచనములు)
  • అధ్యాయము నుంచి నేర్చుకొనవలసిన పాటములు
  • అధ్యాయములో దేవుని గురించిన ప్రత్యక్షత