ప్రతి వచనము యొక్క స్టడీ మెటీరియల్ కొరకు వచనము క్రింద ఈ ఐకాన్స్ ఇవ్వబడినవి. వాటి యొక్క అర్ధములు, వాటిలో లభించు సమాచారము కొరకు క్రింది పట్టిక గమనించండి
క్రాస్ రిఫరెన్స్ లు వచనములతో (Cross References With Verses) |
|
క్రాస్ రిఫరెన్స్ లు వచనములు లేకుండా (Cross References Without Verses) |
|
తెలుగు – ఇంగ్లీష్ పారలల్ (Telugu – English Parallel) |
|
తెలుగు – భారతీయ భాషల పారలల్ (Telugu – Indian languages Parallel) |
|
తెలుగు – హీబ్రూ, గ్రీకు పారలల్ (Telugu – Hebrew, Greek Parallel) |
|
స్ట్రాంగ్స్ డిక్షనరీ (Strong’s Dictionary) |
తెలుగు – ఇంగ్లీష్ ట్రాన్స్లిటరేషన్ పారలల్ (Telugu – English Transliteration Parallel) |
|
స్టడీ నోట్స్ (Study Notes) |
|
స్టడీ వీడియోలు (Study Videos) |
|
డిక్షనరీ (Dictionary) |
|
పదముల స్టడీ (Word Study) |
-
ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.
ఆది 1:1 క్రాస్ రిఫరెన్స్ వచనములతో
సామెతలు 8:22 => పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్యములలో ప్రథమమైనదానిగా యెహోవా నన్ను కలుగజేసెను.
సామెతలు 8:23 => అనాదికాలము మొదలుకొని మొదటినుండి భూమి ఉత్పత్తియైన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని.
సామెతలు 8:24 => ప్రవాహజలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని.
సామెతలు 16:4 => యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను.
మార్కు 13:19 => అవి శ్రమగల దినములు; దేవుడు సృజించిన సృష్ట్యాదినుండి ఇదివరకు అంత శ్రమ కలుగలేదు, ఇక ఎన్నడును కలుగబోదు.
యోహాను 1:1 => ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడైయుండెను.
యోహాను 1:2 => ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను,
యోహాను 1:3 => కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.
హెబ్రీయులకు 1:10 => మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి
1 యోహాను 1:1 => జీవవాక్యమునుగూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మాచేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము.
నిర్గమకాండము 20:11 => ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవ దినమున విశ్రమించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను.
నిర్గమకాండము 31:18 => మరియు ఆయన సీనాయి కొండమీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములుగల రెండు పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను.
1 దినవృత్తాంతములు 16:26 => జనముల దేవతలన్నియు వట్టి విగ్రహములే యెహోవా ఆకాశ వైశాల్యమును సృజించినవాడు.
నెహెమ్యా 9:6 => నీవే, అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటిని, సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటిని కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది.
యోబు 26:13 => ఆయన ఊపిరి విడువగా ఆకాశవిశాలములకు అందము వచ్చును. ఆయన హస్తము పారిపోవు మహా సర్పమును పొడిచెను.
యోబు 38:4 => నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడనుంటివి? నీకు వివేకము కలిగియున్నయెడల చెప్పుము.
కీర్తనలు 8:3 => నీచేతిపనియైన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా
కీర్తనలు 33:6 => యెహోవా వాక్కుచేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెను.
కీర్తనలు 33:9 => ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారమాయెను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను.
కీర్తనలు 89:11 => ఆకాశము నీదే భూమి నీదే లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి.
కీర్తనలు 89:12 => ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి. తాబోరు హెర్మోనులు నీ నామమునుబట్టి ఉత్సాహధ్వని చేయుచున్నవి.
కీర్తనలు 96:5 => జనముల దేవతలందరు వట్టి విగ్రహములే యెహోవా ఆకాశవిశాలమును సృజించినవాడు.
కీర్తనలు 102:25 => ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడ నీచేతిపనులే.
కీర్తనలు 104:24 => యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది.
కీర్తనలు 104:30 => నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు.
కీర్తనలు 115:15 => భూమ్యాకాశములను సృజించిన యెహోవాచేత మీరు ఆశీర్వదింపబడినవారు.
కీర్తనలు 121:2 => యెహోవావలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు.
కీర్తనలు 124:8 => భూమ్యాకాశములను సృజించిన యెహోవా నామమువలననే మనకు సహాయము కలుగుచున్నది.
కీర్తనలు 134:3 => భూమ్యాకాశములను సృజించిన యెహోవా సీయోనులోనుండి నిన్ను ఆశీర్వదించును గాక.
కీర్తనలు 136:5 => తన జ్ఞానముచేత ఆయన ఆకాశమును కలుగజేసెను ఆయన కృప నిరంతరముండును.
కీర్తనలు 146:6 => ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడును మాట తప్పనివాడు.
కీర్తనలు 148:4 => పరమాకాశములారా, ఆకాశముపైనున్న జలములారా, ఆయనను స్తుతించుడి.
కీర్తనలు 148:5 => యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను అవి యెహోవా నామమును స్తుతించును గాక
సామెతలు 3:19 => జ్ఞానమువలన యెహోవా భూమిని స్థాపించెను వివేచనవలన ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచెను.
సామెతలు 8:22 => పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్యములలో ప్రథమమైనదానిగా యెహోవా నన్ను కలుగజేసెను.
సామెతలు 8:23 => అనాదికాలము మొదలుకొని మొదటినుండి భూమి ఉత్పత్తియైన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని.
సామెతలు 8:24 => ప్రవాహజలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని.
సామెతలు 8:25 => పర్వతములు స్థాపింపబడకమునుపు కొండలు పుట్టకమునుపు
సామెతలు 8:26 => భూమిని దాని మైదానములను ఆయన చేయకమునుపు నేలమట్టిని రవంతయు సృష్టింపకమునుపు నేను పుట్టితిని.
సామెతలు 8:27 => ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచినప్పుడు మహాజలములమీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని.
సామెతలు 8:28 => ఆయన పైన ఆకాశమును స్థిరపరచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు
సామెతలు 8:29 => జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచినప్పుడు భూమియొక్క పునాదులను నిర్ణయించినప్పుడు
సామెతలు 8:30 => నేను ఆయనయొద్ద ప్రధానశిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని.
ప్రసంగి 12:1 => దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే,
యెషయా 37:16 => యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమ్యాకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై యున్నావు.
యెషయా 40:26 => మీకన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలుచువాడే గదా. తన అధికశక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయముచేతను ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు.
యెషయా 40:28 => నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము.
యెషయా 42:5 => ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దానిమీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడచువారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.
యెషయా 44:24 => గర్భమునుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను నేనొకడనే ఆకాశమును విశాలపరచినవాడను నేనే భూమిని పరచినవాడను
యెషయా 45:18 => ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిరపరచెను నిరాకారముగా నుండునట్లు ఆయన దాని సృజింపలేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను ఆయన సెలవిచ్చునదేమనగా యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు.
యెషయా 51:13 => బాధపెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడునప్పుడు వాని క్రోధమునుబట్టి నిత్యము భయపడుచు, ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులనువేసిన యెహోవాను నీ సృష్టికర్తయైన యెహోవాను మరచుదువా? బాధపెట్టువాని క్రోధము ఏమాయెను?
యెషయా 51:16 => నేను ఆకాశములను స్థాపించునట్లును భూమి పునాదులను వేయునట్లును నాజనము నీవేయని సీయోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతినీడలో నిన్ను కప్పియున్నాను.
యెషయా 65:17 => ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు.
యిర్మియా 10:12 => ఆయన తన బలముచేత భూమిని సృష్టించెను, తన జ్ఞానముచేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞచేత ఆకాశమును విశాలపరచెను.
యిర్మియా 32:17 => యెహోవా, ప్రభువా సైన్యములకధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ యధికబలముచేతను చాచిన బాహువుచేతను భూమ్యాకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియు లేదు.
యిర్మియా 51:15 => నా జీవముతోడని సైన్యములకధిపతియగు యెహోవా ప్రమాణము చేయుచున్నాడు ఆయన తన బలముచేత భూమిని సృష్టించెను తన జ్ఞానముచేత ప్రపంచమును స్థాపించెను తన ప్రజ్ఞచేత ఆకాశమును విశాలపరచెను.
జెకర్యా 12:1 => దేవోక్తి ఇశ్రాయేలీయులనుగూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశమండలమును విశాలపరచి భూమికి పునాదివేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చునదేమనగా
మత్తయి 11:25 => ఆ సమయమున యేసు చెప్పినదేమనగా తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను.
అపోస్తలుల కార్యములు 4:24 => వారు విని, యేక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొఱపెట్టిరి. నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసినవాడవు.
అపోస్తలుల కార్యములు 14:15 => అయ్యలారా, మీరెందుకీలాగు చేయుచున్నారు? మేముకూడ మీ స్వభావమువంటి స్వభావముగల నరులమే. మీరు ఈ వ్యర్థమైనవాటిని విడిచిపెట్టి, ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవముగల దేవునివైపు తిరుగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము
అపోస్తలుల కార్యములు 17:24 => జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు.
రోమీయులకు 1:19 => ఎందుకనగా దేవునిగూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపరచెను.
రోమీయులకు 1:20 => ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు.
రోమీయులకు 11:36 => ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్.
1 కొరిందీయులకు 8:6 => ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము.
ఎఫెసీయులకు 3:9 => పరలోకములో ప్రధానులకును అధికారులకును, సంఘము ద్వారా తనయొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి,
కొలొస్సయులకు 1:16 => ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను.
కొలొస్సయులకు 1:17 => ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.
హెబ్రీయులకు 1:2 => ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను.
హెబ్రీయులకు 3:4 => ఈయన మోషేకంటె ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను.
హెబ్రీయులకు 11:3 => ప్రపంచములు దేవుని వాక్యమువలన నిర్మాణమైనవనియు, అందునుబట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసముచేత గ్రహించుకొనుచున్నాము.
2 పేతురు 3:5 => ఏలయనగా పూర్వమునుండి ఆకాశముండెననియు, నీళ్లలోనుండియు నీళ్లవలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యమువలన కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు.
ప్రకటన 3:14 => లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేవనగా
ప్రకటన 4:11 => ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవని చెప్పుచు, తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి
ప్రకటన 10:6 => పరలోకమును అందులో ఉన్నవాటిని, భూమిని అందులో ఉన్నవాటిని, సముద్రమును అందులో ఉన్నవాటిని సృష్టించి, యుగయుగములు జీవించుచున్న వానితోడు ఒట్టుపెట్టుకొని ఇక ఆలస్యముండదు గాని
ప్రకటన 14:7 => అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి; ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను
ప్రకటన 21:6 => మరియు ఆయన నాతో ఇట్లనెను సమాప్తమైనవి; నేనే అల్ఫాయు ఓమెగయు, అనగా ఆదియు అంతమునై యున్నవాడను; దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును.
ప్రకటన 22:13 => నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను.
ఆదికాండము 2:1 => ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను.
2 రాజులు 19:15 => యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమ్యాకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవైయున్నావు.
1 దినవృత్తాంతములు 29:11 => యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి; యెహోవా, రాజ్యము నీది, నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొనియున్నావు.
2 దినవృత్తాంతములు 2:12 => యెహోవా ఘనతకొరకు ఒక మందిరమును నీ రాజ్య ఘనతకొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివియుగల బుద్ధిమంతుడైన కుమారుని రాజైన దావీదునకు దయచేసిన, భూమ్యాకాశములకు సృష్టికర్తయగు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా స్తుతినొందునుగాక.
యోబు 26:7 => శూన్యమండలముపైని ఉత్తరదిక్కుననున్న ఆకాశవిశాలమును ఆయన పరచెను శూన్యముపైని భూమిని వ్రేలాడచేసెను.
కీర్తనలు 90:2 => పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు
సామెతలు 8:26 => భూమిని దాని మైదానములను ఆయన చేయకమునుపు నేలమట్టిని రవంతయు సృష్టింపకమునుపు నేను పుట్టితిని.
యెషయా 66:2 => అవన్నియు నా హస్తకృత్యములు అవి నావలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయముగలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను.
మార్కు 10:6 => సృష్ట్యాదినుండి (దేవుడు) వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను.
యోహాను 1:3 => కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.
యోహాను 5:19 => కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును.
2 దెస్సలోనీకయులకు 2:13 => ప్రభువువలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుటవలనను, మీరు సత్యమును నమ్ముటవలనను, రక్షణ పొందుటకు దేవుడు ఆదినుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మునుబట్టి యెల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమైయున్నాము.
ప్రకటన 10:5 => మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచియుండగా నేను చూచిన ఆ దూత తన కుడిచెయ్యి ఆకాశముతట్టు ఎత్తి
ఆది 1:1 క్రాస్ రిఫరెన్స్ వచనములు లేకుండా
సామెతలు 8:22-24; సామెతలు 16:4; మార్కు 13:19; యోహాను 1:1-3; హెబ్రీయులకు 1:10; 1 యోహాను 1:1; నిర్గమకాండము 20:11; నిర్గమకాండము 31:18; 1 దినవృత్తాంతములు 16:26; నెహెమ్యా 9:6; యోబు 26:13; యోబు 38:4; కీర్తనలు 8:3; కీర్తనలు 33:6; కీర్తనలు 33:9; కీర్తనలు 89:11; కీర్తనలు 89:12; కీర్తనలు 96:5; కీర్తనలు 102:25; కీర్తనలు 104:24; కీర్తనలు 104:30; కీర్తనలు 115:15; కీర్తనలు 121:2; కీర్తనలు 124:8; కీర్తనలు 134:3; కీర్తనలు 136:5; కీర్తనలు 146:6; కీర్తనలు 148:4; కీర్తనలు 148:5; సామెతలు 3:19; సామెతలు 8:22-30; ప్రసంగి 12:1; యెషయా 37:16; యెషయా 40:26; యెషయా 40:28; యెషయా 42:5; యెషయా 44:24; యెషయా 45:18; యెషయా 51:13; యెషయా 51:16; యెషయా 65:17; యిర్మియా 10:12; యిర్మియా 32:17; యిర్మియా 51:15; జెకర్యా 12:1; మత్తయి 11:25; అపోస్తలుల కార్యములు 4:24; అపోస్తలుల కార్యములు 14:15; అపోస్తలుల కార్యములు 17:24; రోమీయులకు 1:19; రోమీయులకు 1:20; రోమీయులకు 11:36; 1 కొరిందీయులకు 8:6; ఎఫెసీయులకు 3:9; కొలొస్సయులకు 1:16; కొలొస్సయులకు 1:17; హెబ్రీయులకు 1:2; హెబ్రీయులకు 3:4; హెబ్రీయులకు 11:3; 2 పేతురు 3:5; ప్రకటన 3:14; ప్రకటన 4:11; ప్రకటన 10:6; ప్రకటన 14:7; ప్రకటన 21:6; ప్రకటన 22:13; ఆదికాండము 2:1; 2 రాజులు 19:15; 1 దినవృత్తాంతములు 29:11; 2 దినవృత్తాంతములు 2:12; యోబు 26:7; కీర్తనలు 90:2; సామెతలు 8:26; యెషయా 66:2; మార్కు 10:6; యోహాను 1:3; యోహాను 5:19; 2 దెస్సలోనీకయులకు 2:13; ప్రకటన 10:5;
ఆది 1:1 తెలుగు - ఇంగ్లీష్ పారలల్
KJV In the beginning God created the heaven and the earth.
Amplified IN THE beginning God (prepared, formed, fashioned, and) created the heavens and the earth.
ESV In the beginning, God created the heavens and the earth.
NIV In the beginning God created the heavens and the earth.
NASB In the beginning God created the heavens and the earth.
NKJV In the beginning God created the heavens and the earth.
NLT In the beginning God created the heavens and the earth.
ఆది 1:1 తెలుగు - భారతీయ భాషల పారలల్
Assamese আদিতে ঈশ্বৰে আকাশ-মণ্ডল আৰু পৃথিৱী সৃষ্টি কৰিলে।
Bengali শুরুতে, ঈশ্বর আকাশ ও পৃথিবী সৃষ্টি করলেন| প্রথমে পৃথিবী সম্পূর্ণ শূন্য ছিল; পৃথিবীতে কিছুই ছিল না|
Gujarati આરંભમાં દેવે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું.
Hindi आदि में परमेश्वर ने आकाश और पृथ्वी की सृष्टि की।
Kannada ಆದಿಯಲ್ಲಿ ದೇವರು ಆಕಾಶವನ್ನೂ ಭೂಮಿಯನ್ನೂ ಸೃಷ್ಟಿಸಿದನು.
Malayalam ആദിയിൽ ദൈവം ആകാശവും ഭൂമിയും സൃഷ്ടിച്ചു.
Marathi प्रारंभी देवाने आकाश व पृथ्वी ही उत्पन्न केली.
Oriya ଆରମ୍ଭରେ ପରମେଶ୍ବର ଆକାଶ ଓ ପୃଥିବୀକୁ ସୃଷ୍ଟି କଲେ।
Punjabi ਆਦ ਵਿੱਚ ਪਰਮੇਸ਼ੁਰ ਨੇ ਅਕਾਸ਼ ਤੇ ਧਰਤੀ ਨੂੰ ਉਤਪਤ ਕੀਤਾ
Tamil ஆதியிலே தேவன் வானத்தையும் பூமியையும் சிருஷ்டித்தார்.
ఆది 1:1 తెలుగు - హీబ్రూ, గ్రీకు పారలల్
Hebrew בראשית ברא אלהים את השמים ואת הארץ:
Hebrew Vowels בְּרֵאשִׁ֖ית בָּרָ֣א אֱלֹהִ֑ים אֵ֥ת הַשָּׁמַ֖יִם וְאֵ֥ת הָאָֽרֶץ׃
Greek ΣΤΗΝ αρχή δημιούργησε ο Θεός τον ουρανό και τη γη.
ఆది 1:1 తెలుగు - ఇంగ్లీష్ ట్రాన్స్లిటరేషన్ పారలల్
ఆది 1:1 ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.
aadi 1:1 aadiyaMdu daevuDu bhoomyaakaaSamulanu sRjiMchenu.
ఆది 1:1 స్టడీ నోట్స్
సృష్టికర్త ఉన్నాడు
మానవుడు దేవుడు ఉన్నాడు అని విశ్వసించడానికి అంగీకరించడానికి ఇష్టము లేక తన పరిజ్ఞానంతో ఈ సర్వ సృష్టి ఎలా ఉనికిలోనికి వచ్చినది వివరించడానికి అనేకరకాల సిద్ధాంతాలను ప్రాచుర్యములోనికి తీసుకురావడం జరిగినది. ఈ ప్రయత్నములలో మనిషి తెలుసుకున్న దానికన్నా ప్రశ్నలు ఎక్కువ మిగిలిపోయాయి. సృష్టి మొత్తం ఎలా పనిచేస్తుంది అనేది సంపూర్ణముగా వివరించుటలో మానవులు విఫలం చెందారు. అనేక రకాల సందేహాలతో కొట్టుమిట్టాడుతున్న మానవజాతికి దేవుడు ఈ ఒక్క వచనముతో సమాధానము చెప్పటం జరిగినది. ఏదీకూడా దానంతట అదే ఉనికిలోనికి రాలేదు. దీని అంతటి వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు అని, ఆయన పేరు దేవుడు అని ఈ వాక్యం తెలియజేస్తుంది. దేవుడు సత్యమును సూటిగా సింపుల్ గా మాట్లాడడము ఇక్కడ మనము గమనించగలము. ఎటువంటి వాదములు చేయలేదు. ఇంత అందముగా, ఎక్కడా లోపము లేకుండా సంక్లిష్టతతో కూడిన విశ్వము భారీ పరిణామములో ఉన్న వస్తువులు శూన్యములో వ్రేలాడటము అనేది దానంతట అదే జరగటానికి అవకాశం 0% అని చదువురాని వారు సహితము చెప్పగలరు. మన అహంకారము విడిచి పెడదాము. సృష్టికర్తఉన్నాడు అని విశ్వసిద్దాము.
సృష్టిలో ప్రభువైన యేసుక్రీస్తువారి పాత్ర అమూల్యమైనది
యోహాను సువార్త 1వ అధ్యాయము ప్రకారము ప్రభువైన యేసుక్రీస్తువారి మూలముగా సమస్తము కలిగినవి. ఆయన ఆదినుంచి ఉన్నవాడు. ఈ సమస్త సృష్టిని ఇంత అందముగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర మరువలేనిది. ఎలోహిమ్ అని ఉపయోగించబడిన ఆయన నామములో ప్రభువైన యేసుక్రీస్తువారు పరిశుద్ధాత్మ దేవుడు ఇమిడి ఉన్నారు. ఆయన తన స్వహస్తములతో చేయబట్టే సృష్టిమీద ముఖ్యముగా మానవులమీద ఆయనకు అంత ప్రేమ ఉండటము మనము గమనించగలము. అందుకే ఈ ప్రకృతిని మానవులను విడుదల కలిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాయశ్చిత్తము చేశారు. ఈ ప్రకృతి కూడా ఆయన మాటకు లోబడుట అనేది మనము పరిశుద్ధ లేఖనములలో చూడగలము. ఈ సృష్టి మొత్తమునకు ఆయన అధిపతియై ఉన్నారు. ఆయన తీర్చిదిద్దిన ప్రకృతి మనకు దయచేసిన వనరులను, వసతులను చూచినప్పుడు అవి ఆయనకు మనమీద ఉన్న ప్రేమకు అద్దంపడుతున్నాయి. ఒక తార్కాణముగా నిలుస్తున్నాయి. ఇంత సృష్టిచేసిన ఆయన తన చేతులద్వారా చేయబడిన అంతటి దానిమీద భూమిమీద మనకు అధికారము ఇచ్చినారు. ఆయన మనయెడల కలిగి ఉన్న తలంపులు ఎలాంటివి అనేది ఆయన కార్యములు మనకు వివరిస్తున్నాయి. ఈ భూమిని మించిన ఎన్నో గొప్ప గ్రహములు ఈ విశ్వంలో ఉన్నాకూడా ఈ వాక్యములో భూమి గురించి ఆయన ప్రత్యేకముగా ప్రస్తావించడము, ఆయన భూమి గురించి తీసుకున్న శ్రద్ధ, మిగతా గ్రహములు ఇలా తీర్చిదిద్దిబడకపోవుట చూడగా అది మన హృదయములకు అనేక విషయాలు బోధిస్తుంది
ఆయన జ్ఞానము అనంతమైనది శోధింప శక్యము కానిది
ఈ విశ్వము యొక్క సృష్టిని దేవుడు చేసిన రకరకముల జాతులను వాటిలోని వైవిద్యమును, అందమును, గౌరవమును మనము గమనించినప్పుడు అవి దేవుని యొక్క జ్ఞానమునకు, నైపుణ్యతకు, సమర్థతకు ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తాయి. మానవులు ఇంతవరకు ఈ వచనములో దేవుడు చేసిన సృష్టిని అర్థంచేసుకోవడంలో విజయము అనేది సాధించలేకపోయారు. దీనికి గల ప్రాముఖ్యమైన కారణము మనకు ఉన్న పరిమితి కలిగిన తెలివి, జ్ఞానముతో అనంతమైన దేవుని జ్ఞానమును అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేయటమే. ఈ లోకములో మనకు తెలియని విషయములను జ్ఞానము కలిగినవారి యొద్దకు వెళ్లి ఎలా తెలుసుకుంటామో అలానే దేవుని దగ్గర మనకు తెలియని విషయములు నేర్చుకోవాలి. తయారుచేసిన వ్యక్తికన్నా కూడా మిగిలిన ఎవరికికూడా చేయబడిన వస్తువును గురించిన జ్ఞానము, అవగాహన ఉండవు గదా. అలానే సమస్తమును చేసిన దేవునికి ఈ సృష్టి మొత్తమును గురించిన పరిపూర్ణ అవగాహన ఉంటుంది. గురువు కన్నా శిష్యుడు గొప్పవాడు కాదు అని లేఖనము సెలవిస్తుంది. ఆయన ద్వారా కాకుండా స్వంతముగా ఇన్ని ఆవిష్కరణలు, గొప్ప సంగతులు కనిపెట్టిన మానవజాతి ఆయన దగ్గర నేర్చుకుని ఉంటే ఎంతో తక్కువ సమయంలో ఇంకా ఎన్నో గొప్ప విషయాలను నేర్చుకుని ఉండేవారము. ఎంతో సమయము, ధనము ఆదా అయి ఉండేది, మన జీవన ప్రమాణములు కూడా ఎంతో మెరుగుగా ఉండేవి.
దేవుడు సమస్తమును మనకు అందుబాటులో ఉంచారు
ఈ లోకములో మనము జ్ఞానము అనేది సంపాదించాలి అంటే దానికి వెల చెల్లించవలసి ఉంటుంది. కొన్ని సమయములలో ఒక ప్రత్యేకమైన స్థలమునకు వెళ్లి అక్కడ నేర్చుకోవలసి ఉంటుంది. సమయము కూడా మన అధీనములో ఉండదు. ఎదుటివారు నిర్ణయించిన అంశములు, వారు ఇచ్చిన కాలపరిమితిలో నేర్చుకోవాలి. కానీ దేవుడు ఎల్లప్పుడూ మనకు అందుబాటులో ఉంటారు. ఆయన మనకు కేవలం మాట దూరములో ఉన్నారు. ఏ విధమైన వెల చెల్లించవలసిన అవసరము లేకుండా మనకు అవసరమైన సమస్తమును తెలియజేయడానికి ఏ సమయములో అయినా సిద్ధంగా ఉన్నాడు. మనకు అనుకూలమైన వేగముతో మనము నేర్చుకోవచ్చు. ఏదీ కూడా మరుగు చేసే వ్యక్తికాదు. ఈ లోకములో ఎవరైనా ఒక వస్తువును చేసినప్పుడు దానిని మనము ఉపయోగించాలి అంటే వెల చెల్లించవలసి ఉంటుంది. కానీ దేవుడు అనంతమైన వనరులను మన పరము చేయటము జరిగినది. ఎవరైనా ఒక వస్తువును తయారు చేసినప్పుడు దానిని ఎలాఉపయోగించాలి ఎందునిమిత్తం ఉపయోగించాలి అనే వివరములు మాన్యువల్లో పొందుపరచి ఇస్తారు. దాని ప్రకారము ఆ వస్తువును ఉపయోగించినప్పుడు అది మనకు ఉత్తమమైన సేవను అందిస్తుంది. అలానే దేవుడు సృష్టి గురించిన వివరములు మానవుల పద్ధతుల గురించిన అనేక వివరములు పరిశుద్ధగ్రంథములో పొందుపరిచారు. మనము ఆ సూచనల ప్రకారము నడుచుకుంటే సమాజము, ప్రకృతి అందరికీ గొప్ప ఆశీర్వాదముగా మారతాయి.
సమస్త నిర్వహణ బాధ్యత దేవుడే చూస్తున్నారు
మనము ఏదైనా ఒక వస్తువును ఉపయోగిస్తున్నప్పుడు సమయానుకూలముగా దానికి కొంత నిర్వహణ అవసరమవుతుంది. దానికి కూడా తయారీదారుడు మన దగ్గర డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. అయితే మనము భూమి యొక్క నిర్వహణ బాధ్యతలు ఏమికూడా నిర్వహించవలసిన అవసరము లేకుండా దేవుడు సమస్తము నిత్యత్వ పర్యంతము పనిచేసేలా రూపొందించారు. ప్రకృతి తనంతటతానే నిర్వహణ బాధ్యతలు నెరవేరుస్తుంది. ఆయన చేసినది ఏదీకూడా సమయానుకూలముగా క్షీణించిపోవటము లేదు. ఇలాంటి ఏకైక పరిజ్ఞానము దేవుని దగ్గర మాత్రమే మనకు లభిస్తుంది. మనిషికి ఇలాంటి జ్ఞానము లేదు అని మన అందరికీ కూడా తెలిసిన విషయమే. మనము దేవుని దగ్గర జ్ఞానము సంపాదించి ఏదైనా తయారు చేయటము అలవాటు చేసుకుని ఉంటే మానవాళి ఇంకా ఎన్ని అద్భుతాలు సృష్టించి ఉండేదో. మనము ఈ భూమిని, ప్రకృతిని ఉపయోగించే విషయంలో సరైన పద్ధతి అవలంబించకుండా వాటిని పాడుచేస్తూ ఉన్నా, దేవుడు దానిని మరలా మరలా బాగుచేస్తూ మన జీవితమునకు అవసరమైన వాటిని అందజేస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి ఏ విధమైన రుసుము మన దగ్గర వసూలు చేయడంలేదు. అందునిమిత్తం మనము అందరము కూడా ఆయనకు కృతజ్ఞత చెల్లించవలసినవారమై ఉన్నాము. మనము ప్రకృతిని ఉపయోగించే విషయంలో పశ్చాత్తాపము చెందవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇకముందు అయినా బాధ్యతగా ఉందాము
సమస్తమును మనకోసమే చేయడము జరిగినది
ఈ యొక్క వాక్యమును మనము గమనించినప్పుడు దేవుడు ఆదినుంచి ఉన్నవాడు అని ఆయన ద్వారానే సమస్తము చేయబడినవి అని అర్థమవుతుంది. ఆయన చేతిపనులమీద మనకు ఇచ్చిన అధికారమునుబట్టి ఆయన భూమిని మనకోసం చేశారు అని సృష్టం అవుతూ ఉంది. పరలోక రాజ్యములో మనలను చేర్చుకునే ప్రణాళిక చూచినప్పుడు దానిని కూడా మన కొరకు తీర్చిదిద్దారు అని అర్థం అవుతుంది. ఇవి ఏవీకూడా సృష్టించకమునుపు ఆయన ఉన్నారు కాబట్టి ఆయనకు కొదవ అయినది ఏమీకూడా లేదు. ఆయన కొరకు వీటిని అన్నింటిని చేయలేదు. మన విషయములో ఆయన కలిగి ఉన్న జాగ్రత్తకు, అనురాగము, ప్రేమకు ఈ భూమి, ఆకాశములు మచ్చుతునకగా నిలుస్తాయి. మనము శరీరము పరముగా జీవించిన కాలం కొరకు భూమి, మరణం తరువాత శరీరం విడిచినప్పుడు ఆత్మ నివాసం కొరకు పరలోకము సిద్ధంచేయడం జరిగినది. ఆయన అంతమును ఆదినుంచి ఎరిగినవాడు కాబట్టి అవసరమైనవి అన్నీ ముందుగానే చేసిపెట్టారు. దేవదూతలను కూడా ఎక్కువగా మన పరిచర్యకొరకు ఉపయోగించినట్లుగా మనకు లేఖనములనుబట్టి అర్థం అవుతూ ఉంది. దేవుడు మన ఆత్మీయ, భౌతిక అవసరాలను తీర్చగల సమర్థుడు.
శరీరము కన్నాకూడా ఆత్మకు ఆయన అధిక ప్రాధాన్యత ఇచ్చారు
సృష్టి చేయబడిన విధానము మనము గమనించినప్పుడు దేవుడు శరీరము కన్నాకూడా ఆత్మకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగినది. భూమిమీద మనిషి శరీరంతో జీవించడానికి అవసరమైన పరిస్థితులు, శరీరము యొక్క ఆకృతి మనము గమనించినప్పుడు, అవి పరలోకములో నివసించుటకు చేయబడిన పద్ధతుల కన్నా తక్కువస్థాయిలో ఉన్నట్లు గమనించగలము. ఉదాహరణకు భూమిమీద మామూలు నేలమీద నడిచిన మనము పరలోకములో బంగారంతో చేయబడిన నేలమీద నడుస్తాము. దేవుడు శరీరము, దాని అభివృద్ధి కన్నాఆత్మయొక్క అభివృద్ధికి దాని పరిపూర్ణత కొరకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా పరిశుద్ద గ్రంధములోని లేఖనములను పరిశీలించినప్పుడు అర్థము అవుతూ ఉంది. శరీరము వర్ధిల్లటము జరిగితే ఆత్మ వర్ధిల్లుతుంది అని బైబిల్లో చెప్పబడలేదు కానీ ఆత్మ వర్ధిల్లితే శరీరము కూడా వర్ధిల్లుతుంది అని చెప్పబడినది. దీనిని బట్టి ఒక విషయము మనకు సృష్టంగా అర్థం అవుతుంది. మనము శరీరపరమైన ఎదుగుదల కన్నా ఆత్మీయ ఎదుగుదల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. శరీరము మనలను దేవునికి దూరంగా జరపవచ్చునేమో కానీ ఆత్మ మాత్రము దేవునికి ఎల్లప్పుడు దగ్గరగా జరుపుతుంది
దేవుడు శూన్యమునుంచి సమస్త సృష్టిని చేయటము జరిగినది
ఈ వాక్యము ప్రకారము దేవుడు శూన్యములోనుంచి సమస్త సృష్టిని చేయడము జరిగినది. మానవులకు ఏదైనా ఉన్న పదార్థంనుంచి వేరొకటి తయారుచేయడం తెలుసుకాని, లేనిచోట చేయడము అనేది దేవునికి మాత్రమే సాధ్యము. ఆయన శక్తిసామర్ధ్యములు ఊహకు అందనివి. మన జీవితములో మనము ఊహించనివి, సాధ్యము కాదు అనుకున్నవి ఆయన చేయగలరు. మన దృష్టితో చూసినప్పుడు అవి అసాధ్యములుగా కనిపించవచ్చు కానీ దేవునికి అది చిటికెలో పని. ఏమీలేని శూన్యమునుంచి ఇంత అందమైన సృష్టిని కేవలము నోటిమాట ద్వారా చేయగలిగిన దేవుడు చీకటి, అంధకారము, మురికితో నిండిపోయిన మన జీవితములను కూడా అందముగా తీర్చిదిద్దిగలరు. కేవలము ఆయనయందు విశ్వాసము ఉంచడమే మనము చేయవలసిన పని. నిన్ను ఆమూలాగ్రము మార్చివేసి నూతనసృష్టిగా చేయగలరు. ఎవడైతే క్రీస్తునందు ఉన్నాడో వాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అని లేఖనము కూడా సెలవిస్తుంది. దేవునికి నీ జీవితములో ఏదైనా కార్యము చేయడానికి ముందే అవసరమైన, కావలసిన షరతులు పరిస్థితులు ఏమీ కూడా లేవు. నిన్ను ఉన్నపాటున ఆయన మార్చగలరు. ఇంత గొప్ప సంక్లిష్టతతో కూడిన విశ్వము చిన్న పొరపాటు జరగకుండా నిర్వహిస్తున్న దేవునికి మన సమస్యలు లెక్కలోనివి కావు అని అర్థం చేసుకోవాలి. ఆయన హస్తము మనందరి భారములు సునాయాసముగా ఒక్కసారే మోయగలదు.
దేవుడు మనలను సంరక్షిస్తున్నారు
ఈ విశ్వము పనిచేయు విధానము మనము గమనించినప్పుడు భారీ ఆకారములో ఉన్నటువంటి నక్షత్రములు, గ్రహములు, గెలాక్సీలు మన ఊహకు అందనటువంటి వేగముతో గమనము చేస్తూ ఉంటాయి. వాటిలో అవి ఒక్కోసారి గుద్దుకుని ప్రమాదములుగా మారి విస్పోటనం చెందటము, క్రొత్తవాటికి జన్మ ఇవ్వటము జరుగుతుంది. మనము చాలాసార్లు శాస్త్రవేత్తలు ఏదో భూమిని గుద్దే అవకాశము ఉన్నది అని చేసే హెచ్చరికలు వింటూ ఉంటాము. ఈ విశ్వములో ఏ చిన్న ఆస్ట్రాయిడ్ కానీ, ఉల్క గాని వచ్చి గుద్దుకున్న యెడల జరిగే పరిణామాలు ఊహించడానికే భయంకరంగా ఉంటాయి. కానీ ఇన్నివేల సంవత్సరములనుంచి మనము వాటిని అన్నింటి నుంచి కాపాడుకోవడానికి ఏమీ చేయలేని అశక్తులవలె ఉన్నాకూడా, దేవుడు మన గ్రహమును కంటికి రెప్పలా కాపాడుతున్నారు. దానికి ఏ ఆపదా సంభవించకుండా సంరక్షిస్తున్నారు. మనము ఆయనమీద ఎంత తిరుగుబాటు చేసినాకూడా సహనముతో, దీర్ఘశాంతముతో ఓర్చుకొని మనలను మన ఉనికిని రక్షించే బాధ్యత ఆయన తన భుజాలమీద వేసుకున్నారు. ఇశ్రాయేలు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. తల్లితన బిడ్డలను మరచినా నేను నిన్ను మరువను అని లేఖనములలో ఆయన సెలవిచ్చిన మాటలు ఇందుకు తార్కాణములు
దేవుడు తన శక్తిని మనకు అందుబాటులో ఉంచారు
దేవుడు ఈ సమస్త సృష్టిని కూడా తన నోటిమాటతో చేయడము జరిగినది. కేవలము మాట ద్వారా జరిగినది ఎంత గొప్పదో , అందమైనదో మనము కన్నులారా వీక్షిస్తున్నాము. దీనినిబట్టి ఆయన నోటిమాటకు ఉన్నటువంటి శక్తి ఎలాంటిది అనే విషయము మనకు అర్థం అవుతూ ఉంది. ఆయన మాటకు లోబడునటువంటిది, దానిని ఎదిరించగల శక్తి ఈ విశ్వములో దేనికికూడా లేదు. కేవలము మానవులమైన మనము మాత్రమే దానికి లోబడకుండా తిరుగుబాటు చేస్తూఉంటాము. అటువంటి ఆయన మహత్తరమైన శక్తి, బలము కలిగిన మాటను పరిశుద్ధ లేఖనముల రూపములో ఆయన మన చేతిలో ఉంచటము జరిగినది. ఈ యొక్క లేఖనముల ద్వారా సమస్త దుర్నీతిని, కీడును జయంచమని దేవుడు సెలవిచ్చారు. వాటిని మనము అందరమూ కూడా అర్థం చేసుకునే రీతిలో ఎంతోమంది తమ ప్రాణములు, ధనము, సమయము వెచ్చించి తర్జమా చేయడము జరిగినది. ఈ లేఖనముల యొక్క శక్తిని, విలువను వాటి వెనుక ఉన్న త్యాగము మానవులు ఇంకా గ్రహించలేకపోవడము, విశ్వాసులయొక్క దృక్పధము కూడా సరైన రీతిలో లేకపోవడము చాలా విచారకరము, దురదృష్టము కూడా. ఇకనైనా మన చేతిలో ఉన్న ఆయుధము యొక్క విలువను గొప్పతనాన్ని గుర్తిద్దాము. సాతాను యొక్క దుర్గములను పడద్రోసి దేవుని రాజ్యమును కలిసి నిర్మిద్దాము.
ఆయన తన దృష్టికి మరుగైనది ఏమీ కూడా లేదు
మనము ఏదైనా ఒక ఇంటిలో, ఊరిలో నివాసము చేస్తున్నప్పుడు వాటికి సంబంధించిన వివరములు అన్నీకూడా మనకు తెలిసే ఉంటాయి. ఒకవేళ ఆ ఇల్లు లేదా ఊరు మనచేత నిర్మించబడినది అయితే దానికి సంబంధించిన వివరములు చాలా క్షుణ్ణంగా తెలుస్తాయి. అలానే దేవుడు ఈ విశ్వమును సృజించారు కాబట్టి దీనికి సంబంధించిన ప్రతి విషయము రహస్యములు ఆయనకు క్షుణ్ణముగా తెలుసు. ఆయన కనుదృష్టికి మరుగైన ప్రదేశము ఏదీకూడా ఉండదు. అందుకే భక్తుడైన దావీదు తన కీర్తనలలో నీ సన్నిధినుంచి నేను ఎక్కడికి పారిపోగలను అని సెలవిస్తున్నాడు. సృష్టికర్త అయిన ఆయన కనుసన్నలలోనే మనము అనుదినము చలిస్తున్నాము. దీనిలో రెండు విషయములు మనము గుర్తించాలి. ఆయన కనుదృష్టి మనలను చూస్తూ ఉంది కాబట్టి ఏదీకూడా మనలకు హానిచేయదు అని ధైర్యంగా ఉండవచ్చు. రెండవది ఆయన కనుదృష్టి, సన్నిధిలోనే మనము చెడును, పాపమును కూడా చేస్తున్నాము అని. నాలుగుగోడల మధ్య మనుషులకు మరుగై ఉండవచ్చు కానీ ఆయనకు మనము చేసే ఏ కార్యము కూడా మరుగై ఉండలేదు అని గుర్తించాలి. సృష్టికర్తగా ఆయన దీనిమీద సర్వహక్కులు కలిగి ఉన్నారు. ఆయనకు వ్యతిరేకంగా నిలబడి నివసించడానికి మనకు ఎక్కడ అడుగు స్థలము కూడా లేదు అని గుర్తించాలి. మనము ఆయనకు ఇష్మటమైన రీతిగా జీవించకపోయినా కానీ మనలను త్రోసివేయని ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలి.
సృష్టి మనకు విధేయతను నేర్పిస్తుంది
ఈ మహత్తరమైన సృష్టిలో దేవునిచేత చేయబడిన గొప్ప పరిమాణము కలిగిన గ్రహములను, ప్రకృతిని, నక్షత్రములను మనము గమనించినప్పుడు అవి అన్నీ కూడా మనకు విధేయత నేర్పిస్తున్నాయి. సృష్టించబడిన దినమునుంచి అవి అన్నీకూడా నిర్దేశిత కక్ష్యలో నిర్దిష్టమైన వేగంతో తిరుగుతున్నాయి. వాటికి నిర్దేశించిన గమనమునుంచి అవి లేశమాత్రమైన ఆటు ఇటు జరుగుటము లేదు. ఆయనకు లోబడి ఉన్నాయి. ఒకవేళ అవి గమనమును మార్చుకున్నట్లయితే వేరే గ్రహములకు, నక్షత్రములకు గుద్దుకుని నశించిపోయే ప్రమాదము కలదు. దేవుడు కూడా మనకు పరిశుద్ధ గ్రంధము ద్వారా నిర్దేశిత మార్గదర్శకములను ఇవ్వటము జరిగినది. వాటిని పాటించే మనిషియొక్క జీవన ప్రమాణములు అద్భుతముగా ఉంటాయి. వాటిని త్రప్పి మనము అవిధేయత చూపితే ఆ గ్రహములకు పట్టిన గతే మనకుకూడా సంభవిస్తుంది. మన జీవితము గతితప్పి అదుపులేకుండా నాశనము ఆవుతుంది. వాటితో పోల్చుకుంటే మనము పరిమాణములో చాలా చిన్నవారము. గొప్పవి అంత విధేయత కలిగిఉన్నప్పుడు చిన్నవి మరింత విధేయతగా ఉండాలి అని గుర్తిద్దాము. మన జీవితము ఎటువంటి ప్రమాదములకు లోనుకాకుండా దేవునికి విధేయత కలిగి జీవిద్దాము. మరికొంతమందికి మాదిరికరముగా ఉందాము.
దేవుని అన్నిటికన్నా ముందుగా పెట్టుకోవాలి
పరిశుద్ధ గ్రంథము అన్నింటికన్నా ముందుగా దేవుని ఉంచటము జరిగినది. ఆయన పరిచయముతోనే సమస్తము ఆరంభించడము జరిగినది. చివర ముగింపులో కూడా దేవునితోనే ముగించటము జరిగినది. అనగా ఆదియు, అంతము ఆయనతోనే అనే గొప్ప లేఖన సత్యము మనకు తెలియజేస్తుంది. సాధారణముగా మనము కార్యములు ఆరంభించి దానిలో సమస్యలు ఎదురైనప్పుడు దేవుని దగ్గరకు వస్తాము. లేదా కార్యము ఆరంభించినప్పుడు ఏ ఆటంకములు జరగకూడదు అని ఆయనకు ప్రార్థిస్తాము. అంతేకానీ ప్రతి విషయములోను ఆయనను భాగస్వామిగా చేసుకుని మన జీవితము కొనసాగించము. అయితే దేవుడు మనలో నివాసము చేయాలి అని మనతో భాగస్వామి కావాలని ఆశిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథములోని ఎన్నో అద్భుతమైన సంగతులు దేవుని ద్వారా సామాన్య మానవులు ఏమి చేయగలిగారు అనేది మనకు తెలియజేస్తాయి. ఇంత గొప్ప సృష్టిని చేయగలిగిన జ్ఞానము కలిగిన దేవునికి మనము ప్రధమస్థానము ఇచ్చినట్లయితే మన జీవితము, దాని కార్యములు కూడా ఎంతో అద్భుతముగా తీర్చిదిద్దబడతాయి. ఆయన సలహాలు సూచనలు ఎంతో మేలుకరముగా ఉంటాయి. అందుకే కార్యము మధ్యలోనో చివర్లోనో కాకుండా ఆరంభమునుంచే ఆయనతో కలిసి నడుద్దాము. గొప్ప కార్యములు సాధిద్దాము
ఆయన ఇచ్చిన బహుమానము జాగ్రత్తగా కాపాడుకోవాలి
మనకు ఎవరైనా ఒక బహుమానము ఇచ్చినప్పుడు దానిని ఎలా జాగ్రత్త చేస్తున్నాము, ఎంత అపురూపంగా చూసుకుంటున్నాము అనే దానిమీద ఆ వ్యక్తిమీద మనకు ఉన్న గౌరవము, ప్రేమ ఆధారపడి ఉంటాయి. దేవుడు మనకు ఇచ్చిన బహుమానము గమనించినప్పుడు ఆయనకు మనమీద ఉన్న ప్రేమ ఎలాంటిది, అనురాగము, అభిమానము ఎంత ఉన్నాయి అనేది దాన్ని తీర్చిదిద్దిన తీరులో స్పష్టముగా కనిపిస్తుంది. ఈ బహుమానము మనము నిర్లక్ష్యముగా ఉపయోగించడము దానిని పాడుచేయడం గమనించినప్పుడు మనకు ఆయనమీద అలాంటి ప్రేమ, అభిమానమ లేవు అర్థం అవుతుంది. మనము ఇచ్చిన బహుమానము ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే మన మనసుకు ఎంత బాధ కలుగుతుందో చెప్పవలసిన అవసరము లేదు. మనము దేవుని ప్రేమిస్తున్నా అని కేవలం నోటిమాటతో చెప్పటము కాకుండా దానిని క్రియల రూపములో చూపించాలి. మన మాట, క్రియలు ఒకే విషయాన్ని ప్రతిబింబించాలి. విరుద్ధముగా ఉండకూడదు. ఈ భూమి పట్ల మనము అందరమూ కూడా బాధ్యత కలిగి ఉన్నాము. ఆయన ప్రేమకు కృతజ్ఞత కలిగి జీవిద్దాము.
ఆయనే మన ఆరాధనకు అర్హుడు పూజ్యనీయుడు
సృష్టించబడిన దానికన్నా సృష్టించినవాడే గొప్పవాడు. సృష్టించబడినది ఏదీకూడా సృష్టికర్తకు సమానము కాదు. లోకములో ఉన్నటువంటి అనేక మతములు, ఆచారములు సృష్టిని పూజిస్తున్నాయి. అయితే దేవుడు తన గ్రంథములో సృష్టముగా వ్రాయించారు. సమస్తము తనద్వారానే చేయబడినది అని. అందుకే మనము మనుషులను కానీ, ప్రకృతినిగాని పూజింపకూడదు. దేవుడు ఒక్కడే మన ఆరాధనకు, పూజకు అర్హుడు. మనుషులు దేవుని దేవునిగా ఆరాధించకపోవడము వలన వారికి భ్రష్టమనస్సు కలిగినట్లుగా మనము చూస్తున్నాము. సృష్టించబడినది సృష్టికర్తను తిరస్కరిస్తే అది అహంకారము, తిరుగుబాటు అవుతుంది. ఈ లోకరీతిగా చూసినాకూడా వీటికి శిక్ష అనేది విధించబడుతుంది. అదే విధముగా సృష్టికర్తను మరచి సృష్టమును పూజించువారు కూడా శిక్షకు గురి అవుతారు. అందుకే మనము నిజమైన దేవుని ఆరాధించాలి. ఆయనను మాత్రమే పూజించాలి. పరిశుద్ద గ్రంధము ఈ విషయమును చాలా సృష్టముగా తెలియజేస్తుంది. అది ఏమిటి అంటే అయన తప్ప వేరొక దేవుడు లేడు అని.
దేవుడు త్రిత్వమై ఉన్నాడు
దేవుని యొక్క నామములలో ఒకటయినటువంటి ఎలోహిమ్ అనే పదము ఇక్కడ ఉపయోగించబడినది. దేవుని యొక్క గుణగణములను/ లక్షణములను మనము ఆయన నామముల ద్వారా తెలుసుకోగలము. పరిశుద్ధ గ్రంథము యొక్క మొదటి వచనములోనే ఆయన ఏమై ఉన్నాడు అని మనకు తెలియజేయటము జరిగినది. ఎలోహిమ్ అనే మాటకు దేవుళ్ళు అని అర్థం వస్తుంది. పరిశుద్ధ లేఖనములను మనము గమనించినప్పుడు ఆయన తండ్రిగాను, కుమారుడిగాను, పరిశుద్ధాత్ముడుగాను మనకు బయలుపరుచుకొన్నారు. ఈ త్రిత్వము యొక్క లక్షణము మొదటిగానే ఈ నామము ద్వారా ఆయన బయలుపరచడం జరిగినది. ఇక్కడ ముగ్గురు సమానమే. సృష్టి అంతటిలోను ముగ్గురి భాగస్వామ్యము ఉన్నది. మనము ఒకరినే తీసుకొని మిగతావారిని విడిచిపెడితే వారి స్వరూపము కొంత మనలో లోపించే అవకాశము ఉన్నది. ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకొని ఆరాధిస్తేనే మనము ఆయన సంపూర్ణతలోనికి మారగలము. గొప్ప వ్యక్తులు ఎవరూకూడా తమ గురించి ఇతరులకు సులభముగా తెలియనివ్వరు. కానీ మన దేవుడు తన గురించిన సమస్తము సులభముగా అర్థం చేసుకునేలా మనకు తెలియజేయడం జరిగినది. ఆయన ఔన్యత్వము, తగ్గింపు చాలా గొప్పవి, ఆచరణీయమైనవి.
దేవునికి వ్యతిరేకముగా మనము నిలబడలేము
దేవుని యొక్క సృష్టిలోని నీరు, గాలి, నిప్పు అనేవి ఆయన అభీష్టము అనుసరించి మన అవసరతలు తీరుస్తున్నాయి. మనము అవిధేయత చూపించినప్పుడు దేవుడు వాటిని ఆయుధములుగా వాడి మనకు తీర్పుతీర్చటము కూడా గమనించగలము. మనము విధేయత కలిగినంత కాలము అవి మనకు ఏ విధమైన హాని కలగజేయకుండా దేవుడు వాటిని నియంత్రిస్తున్నారు. వాటిని ఎదుర్కోవడానికి సరి అయిన ఆయుధము గాని, వ్యూహము గాని మానవుల యెద్ద లేదు. ఆయన ప్రేమ, కరుణ ఎంత ఆహ్లాదముగా, అందముగా ఉంటాయో, ఆయన కోపము, తీర్పు అంతే భయంకరముగా ఉంటాయి. సృష్టికర్తగా ఆయనకు సమస్తముమీద సర్వహక్కులు ఉన్నాకూడా ఆయన ఎప్పుడు మనలను బానిసలుగా చూడలేదు. ఆయన స్నేహితులుగా, కుమారులుగా చూచిన ప్రేమ ఆయనది. తన స్వంత రూపము, పోలిక ఇచ్చిన కృప ఆయనది. ఆయనమీద తిరుగుబాటుచేసి, వెళ్లి నివసించడానికి మనకు విశ్వంలో ఎక్కడ స్థానము లేదు. అలాంటి ప్రేమ లేకుండా మన మనుగడ కూడా సాధ్యంకాదు. అది గుర్తించి ఆయన ప్రేమకు లోబడి ఉందాము. ఆయనకు కోపము రేపకుండా మన ప్రవర్తన సరిదిద్దుకుందాము. దేవుని తిరస్కరించినవారు నిత్యనాశనము పొందుతారు అని లేఖనము సెలవిస్తుంది.
ఆయన ద్వారా ఆకాశమహాకాశములు చేయబడ్డాయి
ఈ వచనము గమనించినట్లయితే భూమి, ఆకాశములు అని భూమికి ఏకవచనము ఆకాశమునకు బహువచనము ఉపయోగించటము జరిగినది. పరిశుద్ధ గ్రంథము ప్రకారము 3 ఆకాశములు కలవు. మొదటిది సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు మేఘములు కలిగి మన కంటితో చూచుచున్న ఆకాశము. రెండవది మధ్య ఆకాశము. ఇక్కడ దురాత్మ, అంధకార శక్తులు ఉంటాయి అని బైబిల్ సెలవిస్తుంది. మూడవ ఆకాశము దేవుని నివాసస్థలమైన పరలోకము. భూమి అని ఏకవచనము ఉపయోగించడం ద్వారా ఆయన అలాంటిదే మరొకటి లేదు అని తెలియజేస్తున్నారు. భూమిమీద తప్ప మిగతా గ్రహములలో ఎక్కడా సృష్టి చేసినట్లు మనకు లేఖనములలో ఆధారము లేదు. అందుకే ఇంతవరకు ఎక్కడా జీవము కనిపెట్టబడలేదు. మానవుడు నివసించడానికి భూమి తప్ప అనువైన ప్రదేశము మరొకటి లేదు. ఆయన సహకారము, కృప లేనిదే మన మనుగడ అసాధ్యము. ఆయన లేకుండా మనకు ఉనికి అనేది లేదు అనే విషయం గుర్తించాలి. మనకున్న మిడిమిడి జ్ఞానముతో దేవుని మీద తిరుగుబాటు చేయకుండా కృతజ్ఞత కలిగి ఉండాలి. జీవితము యొక్క విలువ గుర్తించాలి. ఆయన జాలి, కృప ద్వారానే మనము ఇంకా బ్రతికి ఉన్నాము అని గ్రహించాలి.
దేవునిలో గొప్ప కళాత్మక ఉన్నది
ఈ లోకములో ఎంతోమంది కళాకారులు, చిత్రకారులు, కవులు ఉన్నారు. కానీ ఎవరు వర్ణించినా, ఏదైనా తయారుచేసిన అవి దేవుడు చేసిన సృష్టిలోని వస్తువులను పోలి ఉంటాయి లేదా వాటితో పోల్చబడి కవితలు, గేయములు వ్రాయబడతాయి. చిత్రకారులు కూడా ప్రకృతిలోని అంశములను చిత్రీకరించి గొప్ప చిత్రాలను గీయటము జరిగినది. వీరిలో ఎవరూ కూడా దేవుని సృష్టిలోని వాటి పరిధి దాటి ప్రస్తావించిన, వర్ణించిన అంశములు ఏమీకూడా లేవు. ఇవి అన్నీకూడా దేవుని చేత చేయబడినా కూడా ఆయన యొక్క కళాత్మకతను మనము గుర్తించడానికి బదులు వ్యక్తులను గుర్తిస్తాము. వారిని గౌరవిస్తూ ఉంటాము. వారు చేసినవాటిని గొప్ప వెలకు కొనుగోలు చేస్తాము. కానీ వీటన్నింటికి వెనుక ఉన్న ప్రేరణ దేవుని సృష్టి అనే విషయం మర్చిపోతాము. ఇకనుంచి అయినా దేవునిలో ఉన్న సృజనాత్మకత, కళను గుర్తిద్దాము. ఎన్నో కోట్లకొలది నక్షత్రములు, గ్రహములు ఉన్నాకూడా ప్రతి దానికి ప్రత్యేకత ఇవ్వడం అనేది, వాటికి ఉనికి కలిగించడము అనేది దేవునికే చెల్లింది. అన్నింటికీ వాటి గుర్తింపుకు తగినట్లుగా పేర్లు పెట్టడం జరిగినది. సృష్టిలో ఏదీకూడా వృథాగా చేయబడలేదు. దేని స్థానము దానికి కలదు. మనమందరము కూడా ఆయన సృజనాత్మకతలో భాగము అయినందుకు ధన్యులము. Each of us are master pieces made by the hand of GOD.
దేవుని కనుదృష్టి నిన్ను చూస్తూ ఉంది
చిన్న గ్రహములు పెద్ద గ్రహముల చుట్టూ తిరగడం అనేది ఈ సృష్టిలో మనము గమనించగలము. అలానే మనకు అన్నింటిలోనూ పెద్ద అయిన మన దేవుని చుట్టూ మనము తిరగాలి. ఆయన చేతి నీడలోనే మనకు పరిపూర్ణ సంరక్షణ కలదు.
సూర్యుడు, చంద్రుని కాంతి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణంచేసి మన ఇంటిలోనికి ప్రసరిస్తుంది. భూమి యొక్క ఆకారములుతో పోల్చుకుంటే మనం నివసించే ప్రదేశం దుమ్ముకణము కన్నా చిన్నది. లెక్కలోనికి రానిది. అలాంటి చోటుకు సహితము ఆయన చేత సృష్టింపబడిన వస్తువులు తమ కాంతిని ప్రసరింప జేయగలిగినప్పుడు, ఆయన కనుదృష్టి మనలను మరింత తేటగా దర్శిస్తుంది. కనుక మనము ఏ విషయములోనూ భయపడి అధైర్యపడవలసిన పనిలేదు
దేవుని యొక్క కనుదృష్టిని మరుగుచేసి ఈ విశ్వంలో మనకు హాని చేయగలిగినది ఒకటి కూడా లేదు.
ఈ విశ్వములో దేవుని యొక్క హస్తము చేరలేని ప్రదేశము లేదు. కాబట్టి నువ్వు ఆయనకు ఎంత దూరముగా జరిగినా, ఎంత లోతులో కూరుకుపోయినా, నువ్వు ఉన్నచోటికి ఆయన హస్తం వచ్చి నిన్ను రక్షించగలదు, పైకి లాగగలదు
ఆయన నీకోసం చూస్తున్నాడు
ఇంతమంచి లక్షణములు, జ్ఞానము, శక్తి, పరపతి కలిగిన వ్యక్తుల కోసము లోకములో అందరూ పరితపిస్తారు. అయితే మనము దేవుని పరిచయం కొరకు, ఆయన దగ్గర వరుసలో నిలిచి వేచిచూడడానికి బదులు ఆయనే మన తలుపు దగ్గర నుంచుని తడుతున్నాడు. మనలో చాలామందిమి ఆయనకు తలుపు తీయకుండా నిరీక్షించేలా చేయడము శోచనీయము, బాధాకరము. ఈ లోకంలోని గొప్పవారు మనకు ఎప్పుడూ అందుబాటులో ఉండరు. వారి కోసము మనము పడిగాపులు పడాలి. అదికూడా నిర్ణీత సమయంలోనే వారు అందుబాటులో ఉంటారు. కానీ దేవుడు మనకు ఎల్లవేళలా ఎప్పుడూ ప్రార్థన రూపంలో అందుబాటులో ఉన్నారు. ఇప్పటికి అయినా ఆయన స్నేహం విలువ గుర్తిద్దాము.
గ్రహములు తమ కక్ష్యను వీడినప్పుడు నాశనము చెందడం జరుగుతుంది. వాటిని తిరిగి సరిచేసే మార్గము లేదు. కానీ మానవుడు తన పరిధి దాటి పాపములో పడినప్పుడు దేవుడు మనము నాశనం కాకుండా కాపాడారు. తన కుమారుని ప్రాణం ధారపోశారు. మరల మనలను విడిపించి సరిదిద్దారు. ఆయన సృష్టిలో మనము ఎంత ఆయనకు ప్రాముఖ్యమో గుర్తించాలి. ఆయన ప్రేమకు త్యాగమునకు స్పందించాలి.
సృష్టికర్త దగ్గరనుంచి ఇన్ని మంచి అవకాశములు విడిచిపెట్టుకుని ఆయనను తిరస్కరించి దూరముగా ఉంటే మనకన్నా దురదృష్టవంతులు, తెలివిలేనివారు ఎవరూ ఉండరు. ఆయనను (ఇంత గొప్ప దేవుని) తెలుసుకొనకపోవడమే జీవితములో నిజమైన, అతి పెద్ద శాపము
పరిశుద్ధగ్రంథములోని లేఖనముల ప్రకారము దేవదూతలకు కూడా ఆయనను గురించి తెలుసుకునే అవకాశంలేదు వారిలో ఎవరితోనూ ఆయన ఎలాంటి సంబంధము(మనతో ఉన్నలాగున) కలిగిలేరు. వారిలో ఎవరికి ఆయన స్వరూపము, పోలికే ఇవ్వలేదు. ఎవరికీ తన చేతి పనులమీద అధికారము ఇవ్వలేదు. వారు పాపం చేస్తే శిక్షించారు తప్ప విడుదల ఇవ్వలేదు. కానీ మనము దేవదూతలతో పోల్చుకుంటే చిన్న వారము అయినా, వాటి శక్తితో పోల్చుకుంటే మన బలము ఎంతో కొరగానిది అయినా కూడా, అవి నిత్యము ఆయన సన్నిధిలో ఉండి ఆరాధించినా కూడా మనకు ఉన్న అవకాశములు వాటికి లేవు. దేవుని యొక్క కార్యములు తొంగి చూడటంద్వారా ఆయన గురించి అవి తెలుసుకోవలసినదే తప్ప, లేఖనములు లేవు. పైగా అవి మనకు పరిచర్య చేయటానికి నిర్మించబడ్డాయి. ఇప్పటికైనా దేవుడు మనకు ఇచ్చిన అవకాశములు గుర్తించులాగున మన కన్నులు తెరుద్డాము. ఆయన మనకొరకు పడుతున్న ఆతృత, తపన అర్థము చేసుకుని స్పందిద్దాము.
సృష్టికర్తకు తాను తయారుచేసిన వస్తువుల గురించిన పరిపూర్ణ జ్ఞానము ఉంటుంది. ఈ భూమికి పునాది వేయకముందే ఆయన మన గురించి ఆలోచించి ప్రణాళిక వేశారు అని లేఖనము సెలవిస్తుంది. సృష్టికర్తగా నీకు ఏది మంచిది, ఏది చెడు, నీవు ఎలాంటి పరిస్థితుల్లోఇమడగలవు, ఎలాంటి పరిస్థితులు నీకు పడవు అనేది ఆయనకు బాగా తెలుసు. మన గురించి మన తల్లి తండ్రి కన్నాకూడా ఆయన ఎక్కువ జ్ఞానము కలిగి ఉన్నారు. కాబట్టి ఆయన సృష్టిలో నీకు అవసరము అయినవి అన్నీ కూడా సమకూర్చి ఇచ్చారు అని విశ్వసించు. నీకు లేనివి నీకు హానికరములేమో గుర్తించు. ప్రతిదీ కూడా ఆయన సలహా మేరకు పనిచేస్తే మన జీవితము అన్నివిధాలా సంతోషంగా ఉంటుంది. మనము ఆయనకు అవిధేయులుగా ఉన్నాకూడా మన మనుగడ కొనసాగించడానికి అవసరమైనవి అన్నీకూడా ఉచితముగా, ధారాళముగా అనుదినము దయచేయుచున్న దేవునికి ఎన్నివందనములు చెల్లించినా కూడా తక్కువే.
మనము తయారుచేసిన వస్తువు ఏదైనా మనము ఆశించిన రీతిలో పని చేయనప్పుడు దానిని మనము అవతల పారవేస్తాము. లేదా దానిని ఏ పార్ట్ ఆ పార్ట్ ఊడదీసి ప్రక్కన పెట్టేస్తాము. అయితే మనలను సృజించినప్పుడు దేవుడు కలిగివున్న ప్రణాళిక ప్రకారము మనము నివసించకపోయినా కూడా ఆయన మనలను దీర్ఘశాంతముతో సహిస్తూ ఉన్నారు. మనలను లయపరచకుండా విడుదల కొరకు ఆయన కుమారుని పంపారు. ఆయన కుమారుని త్యాగము మనము అర్థంచేసుకొని ఆయన దగ్గరకు వెళ్లేలాగున పరిశుద్ధాత్ముని భూమిమీద మనకు తోడుగా, సహకారిగా ఉంచారు. కానీ ఏదో ఒకరోజు మనము ఆయన న్యాయ సింహాసనము ఎదుట నిలువవలసి ఉన్నది. అందుకే ఆ దినము రాకముందే మనలను మనము సరిచేసుకుందాము.
ఈ విషయములు అన్నీకూడా గమనించినప్పుడు ఒకటి మనకు స్పష్టంగా అర్థమవుతుంది, అది ఏమిటి? ఈ లోకములో మనము ఉన్నంతకాలము సంపూర్ణముగా గ్రహించలేనిది, అర్థము చేసుకోలేనిది ఏదైనా ఉన్నదీ అంటే అది ఆయన ప్రేమ మాత్రమే. మిగతావి అన్ని మానవుడు తన మేధోసంపత్తితో ఏదో ఒకరోజు తెలుసుకోగలడేమో.
ఆయన సృష్టించిన ప్రకృతి మనతో అనేక విషయములు తెలియజేస్తుంది అని పరిశుద్ధ గ్రంధము సెలవిస్తుంది. మనము ఆయన చేసిన ప్రకృతితో సమయం గడిపి దాని గురించి ఆలోచించటానికి సమయం వెచ్చించినపుడు మనకు ఇంకా అనేక సంగతులు బోధపడతాయి.
ఈ ప్రకృతిలో గొప్పవి ఎన్ని ఉన్నాకూడా ఒక మనిషితో సహవాసము, అతడు మారుమనస్సు పొందడము దేవునికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. మన ఆనందము కొరకు ఇంత చేసిన దేవునికి మారుమనస్సు కలిగిన హృదయముతో ఆనందము కలిగించటము మన కనీస బాధ్యత.
దేవుడు తలుచుకుంటే శాస్త్రవేత్తల భాషలో వారికి అర్థం అయ్యేలాగున సైన్స్ భాషలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, గణితశాస్త్ర ఫార్ములాల రూపంలో బైబిల్ రాయించి ఉండవచ్చు కానీ మనలో అందరమూ కావాలి అని చెప్పి , ఇంగిత జ్ఞానం కలిగిన ప్రతి ఒక్కరు అర్థం చేసుకునే శైలిలో అనుదిన వాడుక భాషలో బైబిల్లోని లేఖనములను వ్రాయించడము జరిగినది. ఆయనకు నువ్వు కావాలి.
ఆది 1:1 స్టడీ వీడియోలు
ఆది 1:1 డిక్షనరీ
ఎలోహిమ్
ఎలోహిమ్ అనేది “దేవుడు” అని సూచించే హీబ్రూ పదం. ఇది పాత నిబంధనలో దేవునికి అత్యంత సాధారణ పేర్లలో ఒకటి, ఇది మొదటి వచనములో ప్రారంభమవుతుంది: “ప్రారంభంలో [ఎలోహిమ్] స్వర్గాన్ని మరియు భూమిని సృష్టించాడు” (ఆదికాండము 1:1). ఎలోహిమ్ అనే పేరు తనఖ్లో 2,500 సార్లు వస్తుంది.
ఎలోహిమ్ పేరు వెనుక ఉన్న ప్రాథమిక అర్థం బలం లేదా ప్రభావం యొక్క శక్తి. ఎలోహిమ్ అనంతమైన, సర్వశక్తిమంతుడైన దేవుడు, అతను ప్రపంచానికి సృష్టికర్త, సంరక్షకుడు మరియు సర్వోన్నత న్యాయమూర్తి అని తన పనుల ద్వారా చూపించాడు. “దుష్టుల హింసను అంతమొందించు మరియు నీతిమంతులను భద్రపరచుము – నీతిమంతుడవైన నీవు [ఎలోహిమ్] మనస్సులను మరియు హృదయాలను పరిశోధించు వాడవు” (కీర్తన 7:9).
కొన్నిసార్లు ఎలోహిమ్ అనే పదం ఎల్గా కుదించబడుతుంది మరియు పొడవైన పేరులో భాగంగా ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు ఎల్ షద్దాయి అంటే “సర్వశక్తిమంతుడైన దేవుడు” (ఆదికాండము 49:24); ఎల్ ఎల్యోన్ అంటే “అత్యున్నతమైన దేవుడు” (ద్వితీయోపదేశకాండము 26:19); మరియు ఎల్ రోయి అంటే “చూసే దేవుడు” (ఆదికాండము 16:13). వ్యక్తుల వ్యక్తిగత పేర్లలో దేవుని పేరును చేర్చవచ్చు: డేనియల్ (“ఎల్ ఈజ్ మై జడ్జ్”), నతానియేలు (“ఎల్ యొక్క బహుమతి”), శామ్యూల్ (“ఎల్ ఈజ్ హియర్డ్”), ఎలిజా (“ఎల్ ఈజ్ యెహోవా”) మరియు అరీయేలు (“లయనెస్ ఆఫ్ ఎల్”) ఉదాహరణలు. స్థలాల పేర్లు కూడా ఎలోహిమ్ యొక్క సంక్షిప్త రూపాన్ని కలిగి ఉండవచ్చు: బెతెల్ (“హౌస్ ఆఫ్ ఎల్”), జెజ్రీల్ (“ఎల్ విల్ సో”), మరియు, ఇజ్రాయెల్ (“ప్రిన్స్ ఆఫ్ ఎల్”) ఉదాహరణలు.
యేసు సిలువపై నుండి “ఎలోయీ, ఎలోయీ, లేమా సబక్తానీ?” అని కేకలు వేసినప్పుడు. (మార్క్ 15:34), అతను ఎలోహిమ్, ఎలోయి రూపంలో తండ్రిని సంబోధించాడు. “నా దేవా, నా దేవా, నీవు నన్ను ఎందుకు విడిచిపెట్టావు?” అని యేసు చెప్పిన మాటలను మార్క్ అనువదించాడు.
బైబిల్ అనువాదాన్ని మరింత క్లిష్టంగా మార్చడం ఏమిటంటే, ఎలోహిమ్కు పాత నిబంధనలో ఒకే నిజమైన దేవుడిని సూచించడమే కాకుండా ఇతర ఉపయోగాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో, ఎలోహిమ్ అనేది మానవ పాలకులను లేదా న్యాయాధిపతులను సూచిస్తుంది (కీర్తన 82:6 మరియు యోహాను 10:34 చూడండి)-అటువంటి వ్యక్తులు భూమిపై దేవుని ప్రతినిధులుగా వ్యవహరించాలని, అధికారాన్ని తెలివిగా అమలు చేసి, న్యాయాన్ని నిర్ధారిస్తారు. 82వ కీర్తనలోని హెచ్చరిక ఏమిటంటే, మానవ దేవత ఏదో ఒకరోజు సర్వోన్నతుడైన దేవుడికి సమాధానం చెప్పాలి. మరోచోట, ఎలోహిమ్ తప్పుడు దేవుళ్లను సూచించడానికి ఉపయోగిస్తారు (ఉదా., ద్వితీయోపదేశకాండము 4:28). “వారు నన్ను విడిచిపెట్టి, సీదోనీయుల అష్టోరెతును, మోయాబీయుల కెమోషును, అమ్మోనీయుల మోలెకును ఆరాధించారు” (1 రాజులు 11:33). ఎలోహీ అనేది అర్హతగల పదాలు లేదా పదబంధాలతో ఉపయోగించబడిన ఎలోహిమ్ యొక్క రూపమని మరియు “గాడ్ ఆఫ్” అని అనువదించబడిందని గమనించండి.
ఆసక్తికరంగా, ఎలోహిమ్ అనే పదం ఏకవచనం కాకుండా వ్యాకరణపరంగా బహువచనం (హీబ్రూలో -im ప్రత్యయం బహువచన రూపాన్ని సూచిస్తుంది). ఎలోహిమ్ యొక్క ఏకవచనం బహుశా ఎలోహ్. బహువచనం నుండి మనం ఏమి చేయాలి? ఎలోహిమ్ యొక్క బహువచన రూపం బహుదేవతారాధనను సూచిస్తుందా? లేదు, దేవుడు ఒక్కడే అని తోరా స్పష్టం చేస్తుంది (ద్వితీయోపదేశకాండము 6:4). పాత నిబంధనలో బహుదేవత స్పష్టంగా నిషేధించబడింది.
త్రిత్వవాదం గురించి ఏమిటి? ఎలోహిమ్ బహువచనం అనే వాస్తవం దేవుని త్రిగుణ స్వభావాన్ని సూచిస్తుందా? పద నిర్మాణం ఘనత యొక్క బహువచనంగా అర్థం చేసుకోవడం ఉత్తమం; అంటే, “ఎలోహిమ్” రాయడం అనేది గొప్పతనం, శక్తి మరియు ప్రతిష్టను నొక్కి చెప్పే శైలీకృత మార్గం. దానితో, మరియు బైబిల్ యొక్క మొత్తం బోధన వెలుగులో, ఎలోహిమ్ యొక్క బహువచన రూపం ఖచ్చితంగా దేవుని త్రిగుణ స్వభావాన్ని మరింత వెల్లడి చేయడానికి అనుమతిస్తుంది; మానవ ప్రవక్త కంటే ఎక్కువగా ఉండే మెస్సీయ కోసం ప్రజలను సిద్ధం చేయడానికి పాత నిబంధన ట్రినిటీని సూచిస్తుంది. యేసు కనిపించినప్పుడు, అతను పాత నిబంధనలో సూచించిన రహస్యాలను మరింత పూర్తిగా వెల్లడించాడు. యేసు బాప్టిజం వద్ద మనకు ముగ్గురు ఎలోహిమ్ వ్యక్తులు ఉన్నారు: తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ (మత్తయి 3:16-17).
మన దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు. అతను సృష్టించిన విశ్వంలో అతని శక్తి ప్రతి రోజు మరియు రాత్రి ప్రదర్శించబడుతుంది. “అయ్యో, సర్వోన్నత ప్రభువా, నీవు నీ గొప్ప శక్తితో మరియు చాచిన బాహువుతో ఆకాశాన్ని భూమిని సృష్టించావు. ఏదీ నీకు కష్టం కాదు” (యిర్మీయా 32:17). ఎవరూ అరికట్టలేని ఈ గొప్ప శక్తి ఎలోహిమ్ అనే పేరుకు ప్రాథమికంగా దేవుని లక్షణం.
ఆది 1:1 పదముల స్టడీ
మరింత సమాచారము కొరకు పదముల మీద క్లిక్ చెయ్యండి
త్రిత్వము
దేవుడు
దేవుని జ్ఞానము
దేవుని నామములు
దేవుని లక్షణములు
దేవుని శక్తి
సృష్టి
ఆది 1:1 స్ట్రాంగ్స్ డిక్షనరీ
అదియందు-H7225-రేషిత్
బైబిల్ నందు 53 సార్లు కలదు
మొదలు, మొదటిది, ఎంచుకోతగినది, ముఖ్యమైనది అని అర్థములు ఇచ్చును. మరింత సమాచారము
దేవుడు-H430-ఎలోహిమ్
బైబిల్ నందు 2605 సార్లు కలదు
దేవుళ్లు, దైవత్వము కలిగినవారు, దూతలు, అధికారులు, న్యాయాధిపతులు, దేవునికి సంబంధించినవి, నిజమైన దేవుడు అని అర్థము ఇచ్చును. ఇది బహువచన అర్థములు ఇచ్చు ఏక వచనము మరింత సమాచారము
సృజించెను-H1254-బారా
బైబిలు నందు 54 సార్లు కలదు
నిర్మించుట, రూపము ఇచ్చుట, మలచుట, కోయుట, లావుగా చేయుట, పుట్టించుట, అద్భుతము చేయుట, క్రొత్త పరిస్థితులు కలిగించుట, అని అర్థములు ఇచ్చును.
కేవలము దేవునికి సంబంధించిన కార్యములలో మాత్రమే ఉపయోగించబడే పదము. మరింత సమాచారము
ఆకాశము-H8064-షమాయిమ్
బైబిలు నందు 419 సార్లు కలదు
ఆకాశము,పరలోకము,నక్షత్రములు ఉండు స్థలము అను అర్దములు ఇచ్చును. మరింత సమాచారము
భూమి-H776- ఎరెట్స్
బైబిలు నందు 2502 సార్లు కలదు
భూమి,నేల,దేశము,ప్రాంతము,సరిహద్దు అను అర్దములు ఇచ్చును. మరింత సమాచారము
2. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.
ఆది 1:1 క్రాస్ రిఫరెన్స్ వచనములతో
Coming soon….
ఆది 1:1 క్రాస్ రిఫరెన్స్ వచనములు లేకుండా
Coming soon….
ఆది 1:1 తెలుగు - ఇంగ్లీష్ పారలల్
Coming soon….
ఆది 1:1 తెలుగు - భారతీయ భాషల పారలల్
Coming soon….
ఆది 1:1 తెలుగు - హీబ్రూ, గ్రీకు పారలల్
Coming soon….
ఆది 1:1 తెలుగు - ఇంగ్లీష్ ట్రాన్స్లిటరేషన్ పారలల్
Coming soon….
ఆది 1:1 స్టడీ నోట్స్
Coming soon….
ఆది 1:1 స్టడీ వీడియోలు
Coming soon….
ఆది 1:1 డిక్షనరీ
Coming soon….
ఆది 1:1 పదముల స్టడీ
Coming soon….
ఆది 1:1 స్ట్రాంగ్స్ డిక్షనరీ
Coming soon….