ద్వితియోపదేశాకాండము 4:19 సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశసైన్యమును చూచి మరలుకొల్పబడి, నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజలకొరకు పంచిపెట్టినవాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్తపడుడి.

యోబు 25:3 ఆయన సేనలను లెక్కింప శక్యమా?ఆయన వెలుగు ఎవరిమీదనైనను ఉదయింపకుండునా?

యోబు 25:5 ఆయన దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాడునక్షత్రములు పవిత్రమైనవి కావు.

యోబు 38:12 అరుణోదయము భూమి దిగంతములవరకు వ్యాపించు నట్లును

యోబు 38:13 అది దుష్టులను తనలోనుండకుండ దులిపివేయునట్లును నీ వెప్పుడైన ఉదయమును కలుగజేసితివా? అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా?

యోబు 38:14 ముద్రవలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్పునొందును విచిత్రమైన పనిగల వస్త్రమువలె సమస్తమును కన బడును.

కీర్తనలు 8:3 నీచేతిపనియైన నీ ఆకాశములనునీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా

కీర్తనలు 8:4 నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటి వాడు?నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?

కీర్తనలు 19:1 ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయనచేతిపనిని ప్రచురపరచుచున్నది.

కీర్తనలు 19:2 పగటికి పగలు బోధచేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది.

కీర్తనలు 19:3 వాటికి భాషలేదు మాటలులేవు వాటి స్వరము వినబడదు.

కీర్తనలు 19:4 వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించియున్నదిలోకదిగంతములవరకు వాటి ప్రకటనలు బయలువెళ్లు చున్నవివాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను.

కీర్తనలు 19:5 అతడు తన అంతఃపురములోనుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడుశూరుడు పరుగెత్త నుల్లసించునట్లు తన పథమునందు పరుగెత్త నుల్లసించుచున్నాడు.

కీర్తనలు 19:6 అతడు ఆకాశమున ఈ దిక్కునుండి బయలుదేరి ఆ దిక్కువరకు దానిచుట్టు తిరిగి వచ్చుచున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏదియు లేదు.

కీర్తనలు 74:16 పగలు నీదే రాత్రినీదే సూర్యచంద్రులను నీవే నిర్మించితివి.

కీర్తనలు 74:17 భూమికి సరిహద్దులను నియమించినవాడవు నీవే వేసవికాలము చలికాలము నీవే కలుగజేసితివి.

కీర్తనలు 104:19 ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియ మించెను సూర్యునికి తన అస్తమయకాలము తెలియును

కీర్తనలు 104:20 నీవు చీకటి కలుగచేయగా రాత్రియగుచున్నది అప్పుడు అడవిజంతువులన్నియు తిరుగులాడుచున్నవి.

కీర్తనలు 119:91 సమస్తము నీకు సేవచేయుచున్నవి కావున నీ నిర్ణయముచొప్పున అవి నేటికిని స్థిరపడి యున్నవి

కీర్తనలు 136:7 ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు ఆయన కృప నిరంతరముండును.

కీర్తనలు 136:8 పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను ఆయన కృప నిరంతరముండును.

కీర్తనలు 136:9 రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను ఆయన కృప నిరంతరముండును.

కీర్తనలు 148:3 సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించుడి కాంతిగల నక్షత్రములారా, మీరందరు ఆయనను స్తుతించుడి.

కీర్తనలు 148:6 ఆయన వాటిని నిత్యస్థాయువులుగా స్థిరపరచియున్నాడు ఆయన వాటికి కట్టడ నియమించెను ఏదియు దాని నతిక్రమింపదు.

యెషయా 40:26 మీకన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలు దేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలుచువాడే గదా. తన అధికశక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయముచేతను ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు.

యిర్మియా 31:35 పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును, దాని తరంగ ములు ఘోషించునట్లు సముద్రమును రేపువాడునగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు, సైన్యముల కధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.

యిర్మియా 33:20 యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగాదివారాత్రములు వాటి సమయము లలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయకలిగినయెడల

యిర్మియా 33:25 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడుపగటినిగూర్చియు రాత్రినిగూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండనియెడల

ఆదికాండము 1:3 దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.

ఆదికాండము 8:22 భూమి నిలిచియున్నంతవరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములును వేసవి శీతకాలములును రాత్రింబగళ్లును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను.

ఆదికాండము 9:13 మేఘములో నా ధనుస్సును ఉంచితిని; అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా నుండును.

యోబు 3:9 అందులో సంధ్యవేళను ప్రకాశించు నక్షత్రములకు అంధకారము కమ్మును గాకవెలుగుకొరకు అది యెదురుచూడగా వెలుగు లేకపోవును గాక

యోబు 38:31 కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా?

యోబు 38:32 వాటి వాటి కాలములలో నక్షత్రరాసులను వచ్చు నట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా?

కీర్తనలు 81:3 అమావాస్యనాడు కొమ్ము ఊదుడి మనము పండుగ ఆచరించు దినమగు పున్నమనాడు కొమ్ము ఊదుడి.

యెహెజ్కేలు 32:7 నేను నిన్ను ఆర్పివేసి ఆకాశమండలమును మరుగు చేసెదను, నక్షత్రములను చీకటి కమ్మజేసెదను, సూర్యుని మబ్బుచేత కప్పెదను, చంద్రుడు వెన్నెల కాయకపోవును.

యెహెజ్కేలు 32:8 నిన్నుబట్టి ఆకాశమందు ప్రకాశించు జ్యోతుల కన్నిటికిని అంధకారము కమ్మజేసెదను, నీ దేశము మీద గాఢాంధకారము వ్యాపింపజేసెదను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

యెహెజ్కేలు 46:1 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగాతూర్పు తట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము, పనిచేయు ఆరు దినములు మూయబడియుండి, విశ్రాంతిదినమునను అమా వాస్య దినమునను తీయబడియుండవలెను.

యెహెజ్కేలు 46:6 అమావాస్యనాడు నిర్దోషమైన చిన్న కోడెను నిర్దోషమైన ఆరు గొఱ్ఱ పిల్లలను నిర్దోషమైన యొక పొట్టేలును అర్పింపవలెను.

యోవేలు 2:10 వాటి భయముచేత భూమి కంపించుచున్నది ఆకాశము తత్తరించుచున్నది సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది నక్షత్రములకు కాంతి తప్పుచున్నది.

యోవేలు 2:30 మరియు ఆకాశమందును భూమియందును మహత్కార్యములను, అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనుపరచెదను

యోవేలు 2:31 యెహోవాయొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును.

యోవేలు 3:15 సూర్యచంద్రులు తేజోహీనులైరి; నక్షత్ర ముల కాంతి తప్పిపోయెను.

ఆమోసు 5:8 ఆయన సప్తఋషీ నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు, కారుచీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటివలె మార్పుచేయువాడు, సముద్రజలములను పిలిచి వాటిని భూమిమీద పొర్లి పారజేయువాడు.

ఆమోసు 8:9 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ దినమున నేను మధ్యాహ్నకాలమందు సూర్యుని అస్తమింపజేయుదును. పగటివేళను భూమికి చీకటి కమ్మజేయుదును.

మత్తయి 2:2 యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి

మత్తయి 16:2 సాయంకాలమున మీరు ఆకాశము ఎఱ్ఱగా ఉన్నది గనుక వర్షము కురియదనియు,

మత్తయి 16:3 ఉదయమున ఆకాశము ఎఱ్ఱగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు గదా. మీరు ఆకాశవైఖరి వివేచింప నెరుగుదురు గాని యీ కాలముల సూచనలను వివేచింపలేరు.

మత్తయి 24:29 ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును.

మార్కు 13:24 ఆ దినములలో ఆ శ్రమ తీరినతరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును,

లూకా 21:25 మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలును, భూమిమీద సముద్రతరంగముల ఘోషవలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును.

లూకా 21:26 ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకముమీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి, మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యముచెడి కూలుదురు.

లూకా 23:45 సూర్యుడు అదృశ్యుడాయెను; గర్భాలయపు తెర నడిమికి చినిగెను.

అపోస్తలులకార్యములు 2:19 పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమిమీద సూచక క్రియలను రక్తమును అగ్నిని పొగఆవిరిని కలుగజేసెదను.

అపోస్తలులకార్యములు 2:20 ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు.

ప్రకటన 6:12 ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళివలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను,

ప్రకటన 8:12 నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో మూడవ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో మూడవ భాగము కొట్టబడెను.

ప్రకటన 9:2 అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలోనుండి లేచు పొగవంటి పొగ ఆ అగాధములోనుండి లేచెను; ఆ అగాధములోని పొగచేత సూర్యునిని వాయుమండలమున చీకటి కమ్మెను.

ఆదికాండము 1:6 మరియు దేవుడు జలముల మధ్యనొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాకని పలికెను.

ఆదికాండము 1:20 దేవుడు జీవముకలిగి చలించువాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను.

యోబు 38:19 వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది?చీకటి అనుదాని ఉనికిపట్టు ఏది?

కీర్తనలు 19:4 వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించియున్నదిలోకదిగంతములవరకు వాటి ప్రకటనలు బయలువెళ్లు చున్నవివాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను.

కీర్తనలు 89:37 నా పరిశుద్ధతతోడని నేను ప్రమాణము చేసితిని దావీదుతో నేను అబద్ధమాడను.

యోనా 2:10 అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేలమీద కక్కివేసెను.

మత్తయి 15:2 నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండ భోజనము చేయుచున్నారే, వారెందునిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి

1కొరిందీయులకు 15:41 నూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమనుబట్టి యొక నక్షత్రమునకును మరియొక సక్షత్రమునకును భేదము కలదుగదా

2కొరిందీయులకు 4:6 గనుక మేము మమ్మునుగూర్చి ప్రకటించుకొనుటలేదు గాని, క్రీస్తుయేసునుగూర్చి ఆయన ప్రభువనియు, మమ్మునుగూర్చి, యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము.

2కొరిందీయులకు 12:2 క్రీస్తునందున్న యొక మనుష్యుని నేనెరుగుదును. అతడు పదునాలుగు సంవత్సరములక్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను; అతడు శరీరముతో కొనిపోబడెనో నేనెరుగను, శరీరములేక కొనిపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును.

యాకోబు 1:17 శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును; ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనములవలన కలుగు ఏ ఛాయయైనను లేదు.