Skip to content
Genesis Chapter 05 Text Adult
- ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను;
- మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను.
- ఆదాము నూటముప్పది యేండ్లు బ్రదికి తన పోలికెగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను.
- షేతును కనిన తరువాత ఆదాము బ్రదికిన దినములు ఎనిమిదివందల ఏండ్లు; అతడు కుమారులను కుమార్తెలను కనెను.
- ఆదాము బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల ముప్పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
- షేతు నూట అయిదేండ్లు బ్రదికి ఎనోషును కనెను.
- ఎనోషును కనిన తరువాత షేతు ఎనిమిదివందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
- షేతు బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల పండ్రెండేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
- ఎనోషు తొంబది సంవత్సరములు బ్రదికి, కేయినానును కనెను.
- కేయినానును కనిన తరువాత ఎనోషు ఎనిమిదివందల పదునైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
- ఎనోషు దినములన్నియు తొమ్మిదివందల అయిదేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
- కేయినాను డెబ్బది యేండ్లు బ్రదికి మహలలేలును కనెను.
- మహలలేలును కనిన తరువాత కేయినాను ఎనిమిది వందల నలువది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
- కేయినాను దినములన్నియు తొమ్మిదివందల పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
- మహలలేలు అరువది యైదేండ్లు బ్రదికి యెరెదును కనెను.
- యెరెదును కనిన తరువాత మహలలేలు ఎనిమిదివందల ముప్పది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
- మహలలేలు దినములన్నియు ఎనిమిదివందల తొంబదియైదేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
- యెరెదు నూటఅరువది రెండేండ్లు బ్రదికి హనోకును కనెను.
- హనోకును కనిన తరువాత యెరెదు ఎనిమిదివందల యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
- యెరెదు దినములన్నియు తొమ్మిదివందల అరువది రెండేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
- హనోకు అరువది యైదేండ్లు బ్రదికి మెతూషెలను కనెను.
- హనోకు మెతూషెలను కనిన తరువాత మూడువందల యేండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను.
- హనోకు దినములన్నియు మూడువందల అరువదియైదేండ్లు.
- హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను.
- మెతూషెల నూటఎనుబది యేడేండ్లు బ్రదికి లెమెకును కనెను.
- మెతూషెల లెమెకును కనిన తరువాత ఏడువందల ఎనుబది రెండేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
- మెతూషెల దినములన్నియు తొమ్మిదివందల అరువది తొమ్మిదియేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
- లెమెకు నూటఎనుబది రెండేండ్లు బ్రదికి ఒక కుమారుని కని
- భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మనచేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను
- లెమెకు నోవహును కనిన తరువాత ఏనూట తొంబదియైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
- లెమెకు దినములన్నియు ఏడువందల డెబ్బది యేడేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
- నోవహు ఐదువందల యేండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను.
admin2022-01-10T14:17:58+05:30
Share This Story, Choose Your Platform!
Page load link