సమూయేలు 17:45  దావీదు నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను
1సమూయేలు 17:47 అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని యీ దండువారందరు తెలిసికొందురు; యుద్ధము యెహోవాదే; ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను
2రాజులు 7:9 వారు మనము చేయునది మంచి పనికాదు, నేటిదినము శుభవర్త మానము గల దినము, మనము ఊరకొననేల? తెల్లవారువరకు మనము ఇచ్చట నుండిన యెడల ఏదైన నొక అపాయము మనకుసంభవించును గనుక మనము వెళ్లి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదము రండని ఒకరితోనొకరు చెప్పుకొని
కీర్తనలు 68:11 ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు దానిని  ప్రకటించు  స్త్రీలు  గొప్ప  సైన్యముగా ఉన్నారు
కీర్తనలు 110 :3 యుద్ధసన్నాహదినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా  వచ్చెదరు. నీ యవనస్థులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలె అరుణోదయ గర్భములో నుండి  నీ యొద్దకు వచ్చెదరు
కీర్తనలు 138:3 నేను మొఱ్ఱపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి
సామెతలు 3:26 యెహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును
సామెతలు 14:26 యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట  బహు ధైర్యము పుట్టించును
సామెతలు 28:1 ఎవడును తరుమకుండనే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహమువలె ధైర్యముగా నుందురు
యెషయా 40:9 సీయోనూ, సువార్త ప్రటించుచున్నదానా, ఉన్నతపర్వతము ఎక్కుము యెరూషలేమూ, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము భయపడక ప్రకటింపుమి ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము
యెషయా 41:15, 16 కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించియున్నాను నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడి చేయుదువు కొండలను పొట్టువలె చేయుదువు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని బట్టి అతిశయపడుదువు
యెషయా 42:13 యెహోవా శూరునివలె బయలుదేరును యోధునివలె ఆయన తన ఆసక్తి రేపుకొనును ఆయనహుంకరించుచు తన శత్రువులను ఎదిరించును వారియెదుట తన పరాక్రమము కనుపరచుకొనును
యెషయా 44:8 మీరు వెరవకుడి భయపడకుడి పూర్వకాలమునుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవుడున్నాడా? నేను తప్ప ఆశ్రయదుర్గమేదియు లేదు, ఉన్నట్టు నేనెరుగను
యెషయా 49:2 నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసియున్నాడు తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబులపొదిలో మూసిపెట్టియున్నాడు
మీకా 3:8 నేనైతే యాకోబు సంతతివారికి తమ దోషమును ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనుపరచుటకై, యెహోవా ఆత్మావేశము చేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను నింపబడినవాడనై యున్నాను
మీకా 5:8, 9 యాకోబు సంతతిలో శేషించిన వారు అన్యజనుల మధ్యను అనేక జనములలోను అడవిమృగములలో సింహము వలెను, ఎవడును విడిపింపకుండ లోపలికి చొచ్చి గొఱ్ఱలమందలను త్రొక్కి చీల్చు కొదమసింహము వలెను ఉందురు. నీ హస్తము నీ విరోధులమీద ఎత్తబడియుండును గాక, నీ శత్రువులందరు నశింతురు గాక
మత్తయి 10:19, 20 వారు మిమ్మును అప్పగించునప్పుడు,    ఏలాగు మాటాడుదుము? ఏమి చెప్పుదుము? అని చింతింపకుడి; మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకను గ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు
లూకా 12:12 మీరేమి చెప్పవలసినదియు పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పుననెను
అపోస్తలుల కార్యములు 4:13 వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతోకూడ ఉండినవారని గుర్తెరిగిరి
అపోస్తలుల కార్యములు 4:29-31 ప్రభువా, ఈ సమయమునందు వారి బెదరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును, నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచియుండగా, నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థనచేయగానే వారు కూడియున్న చోటు కంపించెను; అప్పుడు వారందరు పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి
అపోస్తలుల కార్యములు 8:4, 5 కాబట్టి చెదరిపోయివారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారముచేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను
అపోస్తలుల కార్యములు 11:21 ప్రభువు హస్తము వారికి తోడైయుండెను   గనుక నమ్మిన వారనేకులు ప్రభువు తట్టు తిరిగిరి
అపోస్తలుల కార్యములు 18:9, 10 రాత్రివేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకుము. నేను నీకు తోడైయున్నాను, నీకు హాని చేయుటకు నీమీదికి ఎవడును రాడు; ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా
1కొరిందీయులకు 2:4 మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక, దేవుని శక్తిని ఆధారము చేసికొని యుండవలెనని
ఎఫెసీయులకు 3:12 ఆయన యందలి విశ్వాసముచేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగియున్నవి
ఎఫెసీయులకు 6:18, 19 ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నానో, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరుతెరచునప్పుడు
1దెస్సలోకనీయులకు 2:2 మీరెరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది, యెంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవునియందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియును
1దెస్సలోకనీయులకు 1:8 అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని యెడల ఉన్న  మీ విశ్వాసము వెల్లడాయెను గనుక, మేమేమియు చెప్పవలసిన అవశ్యములేదు
2తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనము గల ఆత్మ నియ్యలేదు
హెబ్రీయులకు 4:16 గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము
హెబ్రీయులకు 10:20 ఆయన రక్తము వలన పరిశుద్ధస్థలము నందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుకను