నిర్గమకాండము 15:26 |
మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడచినయెడల, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను |
నిర్గమకాండము 23:25, 26 |
నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమునుదీవించును. నేను నీ మధ్యనుండి రోగము తొలగించెదను. కడుపు దిగబడునదియు గొడ్డుదియు నీ దేశములోను ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసెదను. |
ద్వితియోపదేశాకాండము 33:25 |
నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై యుండును. నీవు బ్రదుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును |
యోబు 33:25 |
అప్పుడు వాని మాంసము బాలుర మాంసముకన్న ఆరోగ్యముగా నుండును. వానికి తన చిన్ననాటిస్థితి తిరిగి కలుగును |
కీర్తనలు 103:2-5 |
నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. సమాధిలోనుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యౌవనమువలె నీ యౌవనము క్రొత్తదగు చుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు |
కీర్తనలు 105:37 |
అక్కడనుండి తన జనులను వెండిబంగారములతో ఆయన రప్పించెను వారి గోత్రములలో నిస్సత్తువ చేత తొట్రిల్లు వాడొక్కడైనను లేకపోయెను |
కీర్తనలు 107:20 |
ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను |
కీర్తనలు 118:17 |
నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. |
సామెతలు 4:20-22 |
నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ కన్నుల యెదుటనుండి వాటిని తొలగిపోనియ్యకుము నీ హృదయమందు వాటిని భద్రము చేసికొనుము. దొరికినవారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును |
యెషయా 40:30, 31 |
బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు యౌవనస్థులు తప్పక తొట్రిల్లుదురు. యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు. |
యెషయా 53:4-6 |
నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయిననుమొత్తబడినవానిగాను దేవుని వలన బాధింపబడినవానిగాను శ్రమనొందిన వానిగాను మనమతనిని ఎంచితివిు. మన యతిక్రమక్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొఱ్ఱలవలె త్రోవ తప్పిపోతివిు మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను. |
యిర్మియా 30:17 |
వారు ఎవరును లక్ష్యపెట్టని సీయోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు; అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను నీ గాయములను మాన్పెదను; ఇదే యెహోవా వాక్కు. |
యిర్మియా 33:6 |
నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్యసమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను |
మలాకీ 4:2 |
అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు |
మత్తయి 8:2, 3 |
ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టరోగము శుద్ధి యాయెను. |
మత్తయి 8:17 |
ఆయన మాటవలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్తయైన యెషయా ద్వార చెప్పబడినది నెరవేరెను |
మత్తయి 9:35 |
యేసు వారి సమాజమందిరములలో బోధించుచు రాజ్యసువార్త ప్రకటించుచు, ప్రతివిధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణములయందును గ్రామములయందును సంచారము చేసెను |
మత్తయి 10:1 |
ఆయన తన పండ్రెండుమంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్లగొట్టుటకును, ప్రతివిధమైన రోగమును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుటకును, వారికి అధికారమిచ్చెను |
మత్తయి 10:7, 8 |
వెళ్లుచు పరలోక రాజ్యము సమీపించి యున్నదని ప్రకటించుడి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్లగొట్టుడి. ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి |
మత్తయి 14:36 |
వీరిని నీ వస్త్రపుచెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి; ముట్టినవారందరును స్వస్థతనొందిరి. |
మత్తయి 21:14 |
గ్రుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను. |
మార్కు 16:17, 18 |
నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును; ఏవనగా, నా నామమున దయ్యములనువెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. |
అపోస్తలుల కార్యములు 10:38 |
అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెననునదియే. దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయుచు, అపవాదిచేత పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను |
రోమీయులకు 8:11 |
మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలోనుండిక్రీస్తుయేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మద్వారా జీవింపజేయును |
యాకోబు 5:15, 16 |
విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థత పొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండును |
1పేతురు2:24 |
మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తనశరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను. ఆయన పొందిన గాయములచేత మీరుస్వస్థత నొందితిరి. |
3యోహాను 1:2 |
ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను |