నిర్గమకాండము 34:24 ఏలయనగా నీ యెదుటనుండి జనములను వెళ్లగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసెదను. మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోవునప్పుడు  ఎవడును  నీ  భూమిని  ఆశింపడు.
యెహోషువ 3:7 అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను నేను మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుందునని ఇశ్రాయేలీయులందరు ఎరుగునట్లు నేడు వారి కన్నుల యెదుట నిన్ను గొప్పచేయ మొదలు పెట్టెదను.
 2సమూయేలు 22:20, 21  నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చెను నా నిర్దోషత్వమును బట్టియే నాకు ప్రతిఫలమిచ్చెను.
 2సమూయేలు 22:37 నా పాదములకు చోటు విశాలపరచుదువు నా చీలమండలు బెణకలేదు.
1దినవృత్తాంతములు 4:10 యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవునిగూర్చి మొఱ్ఱపెట్టినీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండ దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను.
1దినవృత్తాంతములు 17:7, 8 కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు నీవు నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతివై యుండునట్లు, గొఱ్ఱల వెంబడి తిరుగుచున్న నిన్ను గొఱ్ఱల దొడ్డినుండి తీసికొని నీవు వెళ్లిన చోట్లనెల్ల నీకు తోడుగా ఉండి, నిన్నుద్వేషించిన వారిని నీ ముందర నిలువనియ్యక నిర్మూలము చేసితిని; లోకములోని ఘనులకు కలిగియున్న పేరువంటి పేరు నీకు కలుగజేయుదును
కీర్తనలు 1:1-3 దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటికాలువల యోరను నాటబడినదైక్ ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును.
కీర్తనలు 66:12 నరులు మా నెత్తిమీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోను నీళ్లలోను పడితివిు అయినను నీవు సమృధ్ధిగల చోటికి మమ్ము రప్పించియున్నావు.
కీర్తనలు 68:6 దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లజేయువాడు విశ్వాసఘాతకులు నిర్జలదేశమందు నివసించుదురు.
కీర్తనలు 71:21  నా గొప్పతనమును వృద్ధిచేయుము నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయుము
కీర్తనలు 75:6, 7 తూర్పునుండి యైనను పడమటినుండి యైనను అరణ్యమునుండి యైనను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును
కీర్తనలు 115:14 యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపొందించును.
కీర్తనలు 118:5 ఇరుకునందుండి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని విశాలస్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను
కీర్తనలు 144:13 మా కొట్లు నింపబడి పలువిధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి మా గొఱ్ఱలు వేలకొలదిగాను పదివేలకొలదిగాను మా  గడ్డిబీళ్లలో పిల్లలు వేయుచున్నవి.
యెషయా 54:2, 3 నీ గుడారపు స్థలమును విశాలపరచుము నీ నివాసస్థలముల తెరలు నిరాటంకముగ సాగనిమ్ము,  నీ త్రాళ్లను పొడుగు చేయుము నీ మేకులను దిగగొట్టుము. కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచుకొనును పాడైన పట్టణములను నివాసస్థలములుగా చేయును.
మత్తయి 20:26-28 మీలో ఆలాగుండ కూడదు; మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో    వాడు మీ పరిచారకుడై యుండవలెను; మీలో ఎవడు ముఖ్యుడై యుండగోరునో వాడు మీ దాసుడై యుండవలెను. ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను.
అపోస్తలుల కార్యములు 9:31 కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతట సంఘము క్షేమాభివృద్ధి నొందుచుసమాధానము కలిగియుండెను; మరియు ప్రభువునందు భయమును పరిశు ద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను.
అపోస్తలుల కార్యములు 9:34, 35 పేతురు ఐనెయా,  యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరచుకొనుమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురమున్న వారందరు అతని చూచి ప్రభువు తట్టు తిరిగిరి.
అపోస్తలుల కార్యములు 9:40-42 పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్లూని ప్రార్థనచేసి శవము వైపు తిరిగి తబితా, లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడామెకు