కీర్తనలు 18:32 నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థమార్గమున నడిపించువాడు ఆయనే.
కీర్తనలు 138:8 యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా, నీ కృప నిరంతరముండును నీ చేతికార్యములను విడిచిపెట్టకుము.
మార్కు 11:22 అందుకు యేసు వారితో ఇట్లనెను మీరు దేవునియందు విశ్వాసముంచుడి.
అపోస్తలుల కార్యములు 3:16 ఆయన నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి యెరిగియున్న వీనినిబలపరచెను; ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి యెదుట వీనికి ఈ పూర్ణస్వస్థత కలుగజేసెను.
రోమీయులకు 10:17 కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును.
రోమీయులకు 12:3 తన్నుతాను ఎంచుకొనతగినదానికంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొకనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణప్రకారము, తాను స్వస్థబుద్ధిగలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని, నాకు అనుగ్రహింపబడిన  కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను.
1కొరింధీయులకు 4:7 ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొంది యుండియు పొందనట్టు నీవు అతిశయింపనేల?
1 కొరింధీయులకు 12:9 మరియొకనికి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరములను
 గలతీయులకు 2:20  నేను క్రీస్తుతో కూడ  సిలువ వేయబడియున్నాను;  ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసమువలన జీవించుచున్నాను.
గలతీయులకు 5:22 అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయా ళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.
ఎఫెసీయులకు 2:8 మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.
ఎఫెసీయులకు 2:10 మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసు నందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము.
ఫిలిప్పీయులకు 2:13 ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే.
హెబ్రీయులకు 12:2 మనము కూడ ప్రతి భారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి,  విశ్వాసమునకు  కర్తయు  దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై యున్నాడు.
హెబ్రీయులకు 13:21 యేసు క్రీస్తుద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు, ప్రతి మంచి విషయములోను తన చిత్తప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్‌.
2 పేతురు 1:1 యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుడునైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి, మావలెనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది.
2 పేతురు 1:3 దేవునిగూర్చినట్టియు మన ప్రభువైన యేసునుగూర్చినట్టియునైన అనుభవజ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక.
యూదా 1:20  ప్రియులారా, మీరు విశ్వసించు అతిపరిశుద్దమైన దానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థనచేయుచు,
యూదా 1:24 తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువ బెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి