దైవత్వములో ఎదుగుట
దైవత్వ జీవితము అనగా మన జీవితంలో దేవుని కలిగి ఉండి ఆయన జీవము మనలో ఉండి నివాసము చేయటం. ఆయన నియమముల మీద మన జీవితములను ఎలా కట్టుకోవాలి అనేది ఆయన నడిపింపు దయచేసి మనకు సహాయం చేస్తారు. విశ్వాసము లేకుండా మనం చేసే టువంటి ధర్మకార్యములు అన్నీ కూడా శూన్యమైనవి స్వచిత్తముతో కూడుకొన్నవి. విశ్వాస సహితమైన భక్తి మృత సంబంధమైన ఆచారములను మానిపించి అనుసరించువారు మాత్రమై ఉండక నిజమైన దేవుని కార్యములు మనము హత్తుకొని ఉండునట్లు చేస్తుంది.
- దేవుని యొక్క పనిని వెతకటానికి మెలకువ గా ఉండండి. అది మనం ఊహించని దారిలో నుంచి వస్తుంది
- క్రమం తప్పకుండా ప్రభువు బల్ల లో పాలుపంపులు పొందండి. పస్కా అనేది క్రీస్తు ప్రభువు వారు మనకు కలిగించిన విడుదలను సూచిస్తుంది
- దేవుని యొక్క కార్యములను నిలబడి గమనించండి. ఆయన ఇచ్చు విడుదలను మీరు చూడగలరు
- దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా అన్వయించుకొనండి. ఆయన ఆజ్ఞలను మనం పాటించాలి అని దేవుడు కోరుకుంటున్నారు
- దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదములు విషయమై సంతోషించండి
- దేవుని యొక్క సన్నిధిలో నివాసం చేస్తూ దాన్ని గౌరవించండి. ఇది ఆయన ప్రజలను ఇతరుల నుంచి వేరుపరుస్తుంది
- దేవుని యొక్క సబ్బాతులో విశ్రమించండి. ఆయన ఇచ్చే విశ్రాంతి మన యొక్క క్రియలు అన్నింటి నుండి విశ్రాంతి కలిగిస్తుంది (హెబ్రీ 4:10, 11).
ఆరాధన అలవరచుకొనుట
దేవుని తెలుసుకునే విషయములో ఎదుగుటతో దేవుని పట్ల ఆరాధన మొదలవుతుంది.
నిర్గమకాండములో దేవుడు తన స్వభావము, వ్యక్తిత్వము గురించి కొంతవరకు తెలియజేశారు
దేవుని సత్యము ద్వారా తెలిసికొనుట మన జీవితములను ప్రభావితము చేస్తుంది
మన జీవితములను మరింత విశ్వాసభరితముగాను, ఫలభరితముగాను చేసికొనుటకు నిర్గమకాండము మనకు కొన్ని తాళములు ఇస్తుంది
- దేవుడు ఉన్నవాడు అనువాడై ఉన్నాడని అర్ధము చేసికొనండి
- ఆయన పునాదిమీద విశ్రమించండి
- ఆయనలో వేరుపారి స్థిరపడండి
- నిన్ను స్వస్థపరచు దేవునిమీద ఆధారపడండి. మనలను సంపూర్ణులుగా చేయుట ఆయన చిత్తమై ఉన్నది.
- నీకు ద్వజమైయున్న దేవునిమీద ఆధారపడండి. ఆయనకు లోబడి ఉండండి. యుద్దము, విజయము దేవునికే చెందినవి
- నిన్ను పరిశుద్దపరచు దేవుని వెంబడించు. ఆయన జీవము మనలో ఉంటేనే మన పరిశుద్దత సాధ్యము అవుతుంది
పరిశుద్దతను వెంబడించుట
దేవుడు మనలను పరిశుద్దులుగా ఉండుటకు పిలిచారు. తన కొరకు, తన ఉద్దేశ్యముల కొరకు ఆయన మనలను ప్రత్యేకపరుస్తారు
మనము ఆలోచించే విధానములోను, ప్రవర్తనలోను, జీవితములోను లోకమునకు వేరుగా బ్రతకాలి అని దేవుడు తన ప్రజల విషయమై కోరుకుంటున్నారు.
మన జీవితములో ఇతరులకు కనిపించే ప్రత్యేకత దేవునికి మహిమ తీసికొనివస్తుంది
- లోకములో ఉన్న అవిశ్వాసులతో పోల్చుకుంటే దేవుడు తన ప్రజల విషయమై ప్రత్యేకముగా జాగ్రత్త తీసుకుంటారు (8:23; 9:26; 10:23; 11:7).
- మిమ్ములను కాపాడుటకు యేసుక్రీస్తు యొక్క రక్తము మీద ఆధారపడండి (1 పేతురు 1:18, 19).
- తన వాక్యమును గైకొని నిబంధన అనుసరించే వారిని దేవుడు ప్రత్యేకమైన నిధిగా పరిగణిస్తారు
- యేసుక్రీస్తుకు బానిసవై ఉండుము. జీవితాంతము ఆయనను సేవించుటకు నిన్ను నీవు అప్పగించుకొనుము
- దేవుని పరిశుద్దత విషయమై ఆసక్తి కలిగి ఉండుము. తనను ఘనపరచువారిని ఆయన ఘనపరచును
విశ్వాసపు నడక
దేవుడు తన ప్రజలను జ్ణానమువైపు పిలుస్తారు.
దేవుని యందలి భయము జ్ణానమునకు ప్రారంభము (సామె. 9:10).
దేవుని జ్ణానము సత్యమును మనము సరిగా అన్వయించుకొనునట్లు చేస్తుంది.
నిర్గమకాండము తెలివిగా మన జీవితము ఎలా కొనసాగించాలి అనే సూత్రములు, జ్ణానమును మన జీవితములో ఆచరణాత్మకముగా ఎలా అన్వయించుకోవాలో నేర్పిస్తుంది.
జ్ణానము అనేది దేవుని యొక్క క్రమశిక్షణగా మన జీవితములో ఎలా సాధకము చేసుకోవాలి అనే విషయములో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేస్తారు.
- దేవుని వాక్యమునకు విధేయత చూపించే విషయమై దేవుని మీద ఆధారపడుము. ఆయన పరిశుద్ధాత్మ, సన్నిధి నిన్ను ప్రత్యేకపరుస్తుంది
- 10 ఆజ్ణల గురించి తరచుగా ధ్యానించుము. దేవుని నైతిక స్వభావము, వ్యక్తిత్వము జ్ణాపకమునకు తెచ్చుకొనుము
- దేవుని భయమును నేర్చుకొనుము. ఆయనకు పూర్తిగా లోబడుటకు అది నిన్ను ప్రోత్సాహపరుస్తుంది
- జనులు చెడుతనము జరిగించినపుడు వారిని వెంబడించకుము. చెడు గొప్పగా కనిపిస్తుంది కానీ విశ్వాసులు చెడుతనము నుండి తిరిగిపోయి దేవుని ఆసక్తితో వెంబడించాలి
- దేవుని ప్రజలతో ఆరాధించుటకు సమాజముగా కూడుకున్నపుడు దేవునికి ఇవ్వుము. ఇచ్చుట అనేది దేవుడే మనకు సమస్తము దయచేయువాడు అని, స్తుతిని, విశ్వాసమును తెలియజేస్తుంది.
- దేవునితో సహనముగా ఉండుము. అది పాపము చేయకుండా మనలను నివారిస్తుంది. అసహనమును వ్యతిరేకించుము
- నీకున్న తెలివితేటలు, సామర్థ్యము దేవుడు నీకు ఇచ్చిన బహుమతులు అని గుర్తించుము
- అవి ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞత తెలిపి ఆయన మహిమ కొరకు వాటిని మనస్ఫూర్తిగా ఉపయోగించుము
అధికారమును అర్ధము చేసికొనుటకు తాళములు
మీ పైన అధికారులుగా నాయకులను నియమించినవాడు దేవుడు అని గుర్తించుము.
దేవుడు అభిషేకించిన నాయకులను వెంబడించుము, మద్దతునివ్వుము, ప్రోత్సాహపరచుము
- నీ పైన దేవుడు నాయకులుగా ఉంచినవారిని ఎత్తి పట్టుకొనుము
- వారి ప్రక్కన నడుస్తూ వారికొరకు ప్రార్థన చేయుము. వారు అలసినపుడు ప్రోత్సాహపరచుము. వారికి ఆణి విధములుగా సహాయము చేయుము. అలా చేయుట వలన దేవుడు మీ అవసరతలను తీర్చి మిమ్ములను గౌరవించును