బానిసత్వము

ఐగుప్తు దేశములో ఇశ్రాయేలు గడిపిన నాలుగు వందల సంవత్సరాలు ఐగుప్తీయులకు వారు బానిసలుగా ఉన్నారు.   ఐగుప్తు రాజైన  ఫరో  వారిని క్రూరముగా  బాధించాడు.    ఆ పరిస్థితి నుంచి  విడుదల కొరకు వారి దేవునికి ప్రార్థన చేశారు.

పాపము యొక్క బానిసత్వం నుంచి తప్పించుకోవటానికి మనకు కూడా దేవుని యొక్క, సాటి మనుషుల యొక్క నాయకత్వము అవసరమై  ఉన్నది.  వారు తప్పించుకున్న తర్వాత  ఎదుటివారిని గౌరవించటానికి ఆ జ్ఞాపకాలు వారికి ఉపయోగపడినాయి.   ఎదుటివారిని బాదించేవారికి వ్యతిరేకముగా మనము నిలబడాలి

విడుదల

గొప్ప అద్భుతముల ద్వారాను, నాయకుడైన మోషే ద్వారాను  దేవుడు  ఇశ్రాయేలీయులను విడిపించారు.  బానిసత్వము నుంచి వారు విడుదల పొందిన దానికి  గుర్తుగా ప్రతి సంవత్సరము పస్కా పండుగను ఆచరిస్తారు.

దేవుడు మనలను పాపము యొక్క బానిసత్వము నుంచి  విడిపిస్తారు.  ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలను  విడిపించడానికి  సిలువలో మరణించడానికి ముందు  ఆయన శిష్యులతో కలిసి చివరిసారిగా  పస్కా పండుగను ఆచరించారు

నడిపింపు

తెగుళ్ల ద్వారాను,  ఎర్ర సముద్రం చీల్చడం ద్వారాను,  పది ఆజ్ఞలు,  మోషే  యొక్క ధైర్యము ద్వారాను  దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు బయటికి నడిపించారు.  ఆయన నమ్మదగిన  మార్గదర్శి.

దేవుడు ఎన్నో గొప్ప అద్భుత కార్యములు చేయగలిగినా  కూడా   ఆయన ఎల్లప్పుడు  నాయకత్వము మరియు టీం వర్క్ ద్వారా  మనలను నడిపిస్తారు.  మన జీవితములో అనుదినము నిర్ణయములు తీసుకోవటానికి  అవసరమైన  జ్ఞానమును ఆయన వాక్యము మనకు దయచేస్తుంది

పది ఆజ్ఞలు

దేవుని ధర్మశాస్త్రమునకు మూడు భాగములు కలవు.  మొదటిది  పది ఆజ్ఞలు.   ఇందులో ఆత్మీయ  నైతిక జీవితమునకు సంబంధించిన  సంపూర్ణమైన  విషయములు కలవు.  సామాజిక న్యాయము  రెండవది.  ఇందులో ప్రజలు తమ జీవితమును సక్రమంగా కొనసాగించుటకు అవసరమైన నియమములు కలవు.  పండుగలకు సంబంధించినవి  మూడవది.  ఇందులో ప్రత్యక్ష గుడారము యొక్క వివరములు అనుదిన ఆరాధన యొక్క విషయములు కలవు

దేవుడు ఇశ్రాయేలీయులకు ఎంపికల యొక్క బాధ్యత గురించి నేర్పిస్తున్నారు.  వారు  న్యాయసూత్రాలను  పాటించినప్పుడు వారిని దీవించారు.  వారు వాటిని మరిచిపోయి అవిధేయత చూపించినపుడు  వారిని శిక్షించి  వారి  మీదకు  విపత్తులను రప్పించారు.  చాలా దేశములు వారి యొక్క న్యాయ శాస్త్రమును  నిర్గమకాండము  అనుసరించి రూపించారు.  దేవుని నైతిక సూత్రాలు ఇప్పటికీ విలువ కలిగినవే.

దేశము

ప్రపంచము మొత్తానికి కూడా సత్యము మరియు రక్షణ గురించి తెలియజేయటానికి దేవుడు ఇజ్రాయేలు దేశమునకు పునాది వేశారు.  తన ప్రజల యెడల ప్రేమ పూర్వకమైన సంబంధములు కలిగి ఉన్నా కూడా  ఆయన క్రమశిక్షణ కలిగినవారు.  ఇశ్రాయేలీయులు ఐగుప్తు విడిచినప్పుడు  వారికి సైన్యము గాని నడిపించే నాయకులు గానీ ఎవరూ లేరు.  దేవుడే వారికి అన్ని రకముల విధులను బాధ్యతలను సూచించారు.  ఏలా ఆరాధించాలి,  దేశము యొక్క పండగల గురించి వారికి చూపించారు

క్రైస్తవులు నడవవలసిన  పద్ధతులను ఇశ్రాయేలు ఇప్పటికీ కలిగి ఉన్నది.  మనము కొన్ని సార్లు విజయం సాధించవచ్చు,  కొన్నిసార్లు అవిధేయులుగాను,  ప్రణాళిక లేనివారు గాను  ఉండవచ్చు.  దేవుని యొక్క వాక్యము, వ్యక్తిత్వము మాత్రమే మనలను  నడిపిస్తాయి.  మన సంఘములు ఆయన యొక్క నాయకత్వమును  అనుసరించిన యెడల  ఆయనను సేవించుటలో  అవి సమర్థవంతముగా ఉంటాయి