• మనలను పాపము నుంచి, బంధకముల నుంచి రక్షించు దేవునితోనే ఆరాధన మొదలవుతుంది (1–3).
  • ఆరాధన ప్రకృతి మీద, మనుష్యుల మీద దేవుడు కలిగియున్న తిరుగులేని అధికారమును మనకు గుర్తుచేస్తుంది (7:14–11:10).
  • పండుగ అనేది దేవుని దయను, శక్తిని మనకు జ్ణాపకమునకు తెస్తుంది (12:1-30).
  • కీర్తన అనేది దేవుని క్రియలను, ఆయన రక్షణ గురించి మనకు నేర్పిస్తుంది (15:1-18).
  • సబ్బాతు విశ్రాంతి మనలను పునరుత్తేజింపచేస్తుంది. దీనిని ఆరాధన నుంచి విడదీయలేము (23:12).
  • మనము పరిశుద్ధుడైన దేవుని ఆరాధిస్తున్నాము. ఆయన సన్నిధిలో నిర్లక్ష్యముగా ప్రవేశించకూడదు (25–31).
  • చేతిపనుల యొక్క నైపుణ్యత ద్వారా దేవుని గురించి మనము తెలుసుకోవచ్చు (36:1–39:31).
  • ఆరాధనకు సిద్దపాటు అనేది జీవము కలిగిన దేవుని సమీపించుటకు చాలా ఆవశ్యకము (39–40).