• దేవునికి బయపడి, రాజీపడని వారిని దయచేసినందుకు (1:17);
 • తన ప్రజల యొక్క వేధనభరితమైన కేకలకు స్పందించినందుకు (2:24);
 • ఆయన వాగ్ధానములను నెరవేర్చే విషయములో విశ్వాస్యత కొరకు (2:24-25);
 • తన ప్రజల పరిస్థితి విషయమై ఆయన దయ కలిగిన ఆందోళన కొరకు (2:25);
 • తన ప్రజలను నడిపించుట కొరకు ఆయన దయచేసిన సమర్ధులైన నాయకుల కొరకు (3:18);
 • ప్రకృతి మీద ఆయనకు ఉన్న పరిమితిలేని అధికారము కొరకు (9:13-16);
 • తన ప్రజలను కంటికి రెప్పలా కాపాడినందుకు (13:20-22);
 • తన శతృవుల మీద ఆయనకు ఉన్న శక్తి కొరకు (14:1-31);
 • తన ప్రజలకు ఆహారము, నీరు దయచేసినందుకు (15:27–16:36);
 • తన ప్రజల విషయమై ఆయనకు ఉన్న సహనము కొరకు (15:25; 16:1-12; 17:1-7);
 • తెలివి, వివేచన కలిగిన సలహాదారులను తన ప్రజలకు ఇచ్చినందుకు (18:1-27);
 • తన ప్రజల మధ్యన నివసించాలి అనే ఆయన కోరిక కొరకు (19:10-11; 25:8; 40:34-38);
 • ఉన్నతమైన జ్ణానము, దయ కలిగిన ఆయన న్యాయసూత్రముల కొరకు (20–23);
 • పాపమును క్షమించి తనను ఆరాధించటానికి మనలను పిలిచినందుకు (24–31);
 • మనము ఇతరుల కొరకు మొర్రపెట్టినపుడు వినుటకు ఆయన చూపు సుముఖత కొరకు (32:11-14)
 • ఆయన కలిగియున్న మహోన్నతమైన లక్షణముల కొరకు (దయ, కృప, కోపించుటకు నిదానించటం…) (34:6-7).