- మీరు స్టడీ చెయ్యాలి అనుకున్న పుస్తకమును ఎంచుకొనండి
- మొదటిలో చిన్న పుస్తకములతో మొదలుపెట్టి, తరువాత పెద్ద పుస్తకములు స్టడీ చెయ్యండి
- పుస్తకము గురించి అప్పటి వరకు మీరు కలిగియున్న అభిప్రాయము, సమాచారము క్లుప్తముగా వ్రాయండి
- పుస్తకము గురించిన ప్రాధమిక సమాచారము సేకరించండి
- పుస్తకము యొక్క పేరు
- ఇంగ్లీషు పేరు
- హీబ్రూ/గ్రీకు పేరు
- రచయిత
- ఏ నిబంధనకు చెందినది
- వ్రాసిన కాలము
- వ్రాసిన ప్రదేశము
- ఎవరికొరకు వ్రాయబడినది
- వ్రాయబడిన ఉద్దేశ్యము
- పుస్తకము నందు గల చరిత్ర కాలము
- పుస్తకము యొక్క విభాగము
- ముఖ్యమైన వచనము
- ముఖ్యమైన వ్యక్తులు
- ముఖ్యమైన ప్రదేశములు
- రచనాశైలి
- గణాంకములు
- బైబిలు నందు పుస్తకము యొక్క సంఖ్య
- పాత/క్రొత్త నిబంధన యందు పుస్తకము యొక్క సంఖ్య
- విభాగము నందు పుస్తకము యొక్క సంఖ్య
- అధ్యాయములు
- వచనములు
- పరిశుద్ద గ్రంధము నందు పుస్తకము యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
- రచయిత గురించి కొంత సమాచారము సేకరించండి
- పుస్తకము వ్రాసినపుడు రచయిత యొక్క మానసిక పరిస్థితి ఏమిటి?
- పుస్తకము కనీసము 5 సార్లు అయినా పూర్తిగా చదవండి
- పుస్తకము గురించి విశ్లేషణ చేసి సమాచారము సేకరించండి
- సమాచారము విస్తరించి వ్రాయకండి. క్లుప్తముగా ఉంచటానికి ప్రయత్నము చేయండి. విస్తరించి వ్రాయుట అధ్యాయములు, వచనములు స్టడీ చేస్తున్నపుడు వ్రాయాలి
- స్టడీ చేసిన తరువాత పుస్తకమును గురించిన మీ అభిప్రాయము వ్రాయండి
- స్టడీ చేసిన తరువాత మీ జీవితమునకు అన్వయించుకోదగిన అంశములు గుర్తించండి
- వాటిని అవలంబించుటకు ప్రణాళిక సిద్దము చెయ్యండి
- పుస్తకము యొక్క సమాచారము సేకరించుటకు క్రింది విషయముల మీద దృష్టి పెట్టండి
- పుస్తకము గురించి ప్రత్యేకముగా గమనించవలసిన విశేషములు ఏమైనా ఉన్నాయా?
- పుస్తకము యొక్క సారాంశము ఒకటి లేదా 2 పేరాలలో వ్రాయటానికి ప్రయత్నము చేయండి
- పుస్తకము నందు దేవుని యొక్క ప్రత్యక్షత
- తండ్రియైన దేవుడు
- ప్రభువైన యేసుక్రీస్తు
- పరిశుద్దాత్మ దేవుడు
- పుస్తకము నందు దేవదూతల యొక్క ప్రభావము
- పుస్తకము నందు సాతాను యొక్క ప్రభావము
- మన అనుదిన జీవితములో పాటించదగిన సత్యములు
- మన అనుదిన జీవితములో చేయకూడనివి
- పుస్తకము నందు కల ఆశీర్వాదములు
- పుస్తకము నందు కల శాపములు
- పుస్తకము నందు స్తుతింపతగిన అంశములు
- పుస్తకము నందు ఆరాదింపదగిన అంశములు
- పుస్తకము నందు ప్రధానముగా చర్చించబడిన అంశములు
- పుస్తకము నందు ఆత్మీయ విజయములు
- పుస్తకము నందు ఆత్మీయ పతనములు
- పుస్తకము నందలి వివిధ వర్గముల ప్రజలు
- రాజులు
- యాజకులు
- ప్రవక్తలు
- దైవజనులు
- పుస్తకము నందు గల ప్రాముఖ్యమైన ప్రార్ధనలు
- పుస్తకము నందు దేవుని చేత చేయబడిన అద్భుత కార్యములు
- పుస్తకము నందు దేవుని చేత ఇవ్వబడిన తీర్పులు
- పుస్తకము నందు దేవుని చేత ఇవ్వబడిన హెచ్చరికలు
- పుస్తకము నందు కల ప్రముఖ ప్రవచనములు
- పుస్తకము నందు ప్రముఖ వాగ్దానములు
- పుస్తకము నందు ప్రముఖ కుటుంబములు/వంశావళి
- పుస్తకము నందు భౌగోళిక ప్రదేశముల మ్యాపులు
- పుస్తకము నందు పేర్కొనబడిన ప్రదేశముల ప్రస్తుత పేర్లు
- పుస్తకమును సులభముగా అర్ధము చేసికొనుటకు అందుబాటులో ఉన్న చార్టులు
- పుస్తకము గురించి మరింత సమాచారము తెలిసికొనుటకు ఉపయోగపడు ఇతర వనరులు
- బైబిలు నందు
- బైబిలు మీద వ్రాయబడిన పుస్తకములు
- ఇంటర్ నెట్ లింక్స్
- పుస్తకము నందు మనుష్యులకు సంధించబడిన ప్రశ్నలు
- పుస్తకము నందు దేవుని చేత పలుకబడి, ప్రస్తుత సమాజములో అందుకు విరుద్ధముగా ఉన్న అంశములు
- పుస్తకము యొక్క గణాంకములు
- పుస్తకము యొక్క కాలమానము వరుసక్రమములో
- పుస్తకము యొక్క అమరిక
- అధ్యాయము సంఖ్య
- ఉద్దేశ్యము/తెలుపబడిన విషయము
- పుస్తకము నందు పేర్కొనబడిన విషయములకు గల చారిత్రక ఆధారములు
- ప్రజలు/దేశము యొక్క సంస్కృతి
- ఆ కాలములో ప్రజల జీవన పరిస్థితులు ఏమిటి?
- ప్రజల యొక్క వృత్తులు ఏమిటి?
- ప్రజల యొక్క వ్యాపారములు ఏమిటి?
- ఆ దినములలో వాడుకలో ఉన్న కరెన్సీ ఏమిటి?
- సంగీతము యొక్క ప్రభావము
- ఎలాంటి ఇండ్లలో నివసించేవారు?
- ఆచారములు ఏమిటి?
- సేదతీరటానికి ఏమి చేసేవారు?
- ప్రాముఖ్యమైన కళలు ఏమిటి?
- భాషా పరిజ్ఞానము
- చుట్టుప్రక్కల ప్రదేశములు ఏమిటి?
- వారి యొక్క ప్రభావము ప్రజల మీద ఏమైనా ఉన్నదా?
- మతపరమైన ఆచారములు
- మతపరమైన పండుగలు
- ప్రధానమైన మతములు
- అన్య మతములు
- వాడుకలో ఉన్న వస్తువులు
- వాడుకలో ఉన్న ఆయుధములు
- రాజకీయ పరిస్థితులు ఏమిటి?
- ఈ సంస్కృతి యొక్క ప్రభావము దేవుని యొక్క ప్రణాళికల మీద ఏమైనా ఉన్నదా?
- పుస్తకము నందు ఉపయోగించబడిన ప్రధాన పదములు ఏమిటి?