1. దేవుని పట్ల నమ్మకము, విశ్వాసము కలిగియుండాలి.
 2. తమ జీవితమనకు దేవుని యొక్క ఆవశ్యకతను గుర్తించగలిగి యుండాలి
 3. తిరిగి జన్మించిన అనుభవము కలిగి ఉంటే చాలా మంచిది. బైబిలును చదువుటకు అవసరము లేదు కాని అధ్యయనము చేయుటకు ఈ అనుభవము చాలా ఉపకరిస్తుంది
 4. దేవుని వాక్యము పట్ల ప్రేమ కలిగి ఉండాలి
 5. కష్టపడి సమయము వెచ్చించి నేర్చుకోవటానికి సుముఖత కలిగి ఉండాలి
 6. దేవుని మాటకు సంపూర్ణముగా లోబడే మనస్సు/గుణము కలిగి ఉండాలి
 7. చిన్నపిల్లల వంటి హృదయము ఉండాలి
 8. వాక్యము దేవుని యొక్క మాటగా పరిగణించాలి. మనుష్యుల చేత వ్రాయబడినదిగా చూడకూడదు
 9. ప్రార్ధనా పూర్వకముగా చదవాలి, సిద్దపడాలి
 10. ప్రతిరోజూ క్రమము తప్పకుండా చేయటానికి ప్రయత్నము చేయండి
 11. పూర్తి ఏకాగ్రతతో చేయాలి, చదవాలి
 12. ప్రతిసారి చదువబడిన వాక్యములో దేవుని గురించి, యేసుక్రీస్తు గురించి చూడటానికి ప్రయత్నము చేయండి
 13. చదివిన వచనములను గుర్తు పెట్టుకోవటానికి లేదా కంటస్థము చేయటానికి ప్రయత్నము చేయండి
 14. సమయమును సద్వినియోగము చేసుకోవటానికి ప్రయత్నము చేయండి
 15. మ్రొక్కుబడిగా, హడావుడిగా చేయకండి. ఏదైనా ఒకరోజు కుదరకపోతే విరామము ఇవ్వండి
 16. పరిశుద్దాత్మ దేవుని సహాయము, నడిపింపు అడగండి
 17. మార్పు అనేది కష్టము. సాతాను మనతో ఎప్పుడూ ఎదురు పోరాడుతూనే ఉంటాడు. అయినా పట్టుదలతో ప్రయత్నించాలి
 18. మీలో మార్పుకోసము తగిన సమయము తీసుకొని హడావుడి లేకుండా మీ సామర్ధ్యము కొలది సాధ్యమయ్యే విధముగా ప్రణాళిక సిద్దము చేసుకొనండి
 19. బైబిలు గురించి సరైన అవగాహన కలిగిన వారిని నాయకుడిగా పెట్టుకొనండి
 20. మీరు నేర్చుకునే అంశములు బైబిలు పరిధిదాటి లేకుండా చూసుకొనండి
 21. మొదటిరోజునే మనకు సమస్తము అర్ధము కావు అని గుర్తెరిగి వాక్యము అర్ధము అవటానికి, అవగాహన రావటానికి తగిన సమయము తీసుకొనండి
 22. మొదటిగా మీరు చేయవలసిన స్టడీ చేయండి. మీ ఆలోచనలు, దేవుడు మీతో మాట్లాడిన అంశములు వ్రాయండి. తరువాత కంప్యూటర్ సాఫ్ట్ వేర్, కామెంటరీలు చదవండి.
 23. పరిశుద్ద గ్రంధము జీవితము మార్చటానికి కాని మనము క్రొత్త సిద్దాంతములు చేయటానికి కాదు అని గుర్తెరిగి వాక్యము మీ జీవితము గురించి ఏమి చెప్తున్నది అనే కోణములో చూడండి
 24. మీరు వ్రాసుకున్న నోట్స్ మీరు కొన్ని దినములు లేదా సంవత్సరముల తరువాత చూస్తే మరలా దేవునిలో ప్రోత్సహించబడేలా వ్రాసుకొనండి.
 25. మీరు ఎంత కష్టపడ్డారు అని కాకుండా దేవుడు మీ నిమిత్తము ఏమి చేసియున్నారు అనేది హైలైట్ చెయ్యండి
 26. మీరు వ్రాసుకున్న నోట్స్ మీ తరువాతి తరములను ప్రోత్సహించే విధముగా ఉండాలి. మీ పిల్లలు మీ అనుభవములను చాలా సీరియస్ గా తీసుకుంటారు అని గుర్తించండి
 27. మీరు వ్రాసుకున్న నోట్స్ కంప్యూటర్ లో టైపు చేసి భద్రము చేయండి