1. మీరు స్టడీ చెయ్యాలి అనుకున్న పదము ఎంచుకొనండి
 2. ఆ పదమునకు మాతృబాషలోను, ఇంగ్లీషులోను, గ్రీకు/హీబ్రూ బాషలో గల నిర్వచనము తెలుసుకొనండి
 3. ఇంగ్లీషు బాషనందు గల వివిధ తర్జుమాలలో ఆ పదమునకు బదులుగా వేరే ఇతర పదములు ఏమైనా ఉపయోగించారేమో చూడండి. ఒకవేళ ఉపయోగిస్తే అవి ఏమిటి? వాటి అర్ధములు ఏమిటి?
 4. ఈ పదము వాడుకలోనికి ఎలా వచ్చినది
 5. ఈ పదము బైబిలునందు ఎక్కడ ఉపయోగించబడినదో వచనములు సేకరించండి
 6. ఈ పదము బైబిలునందు మొత్తము ఎన్ని సార్లు ఉపయోగించబడినదో తెలుసుకొనండి
 7. ఈ పదము ఎక్కువ ఏ పుస్తకములలో కనిపిస్తుంది?
 8. ఏ రచయిత ఈ పదమును ఉపయోగించారు?
 9. పుస్తకము వ్రాయబడిన కాలమునకు, ప్రస్తుత కాలమునకు మధ్యన పదము యొక్క వాడుక, అర్ధము ఏమైనా మారినదా?
 10. రచయిత తన పుస్తకములో ఈ పదము ఒకే విధముగా ఉపయోగించాడా లేక ఏమైనా మార్పులు చేసాడా?
 11. ఈ పదము ఉపయోగించబడిన సందర్భములు ఏమిటి?
 12. సందర్భమును బట్టి పదము యొక్క అర్ధము ఏమైనా మార్పు చెందినదా?
 13. ఈ పదమును వేరే ఇతర పదములతో కలిపి ఉపయోగించటము జరిగినదా? అయితే అవి ఏమిటి?
 14. ఈ పదమును వేరే ఇతర పదములతో పోల్చటము జరిగినదా? అయితే అవి ఏమిటి?
 15. ఈ పదము అర్ధము అవటానికి రచయితలు ఏవైనా ఉదాహరణ, ఉపమానము, పోలికె ఉపయోగించారా?
 16. ప్రభువైన యేసుక్రీస్తు వారు లేదా దేవుడు ఈ పదము గురించి ప్రత్యేకముగా ఏమైనా మాట్లాడారా?
 17. ఈ పదము దేవునికి మాత్రమే ఉపయోగించదగినదా?
 18. ఈ పదము ద్వారా దేవుని గురించిన జ్ఞానము ఏదైనా మనకు లభిస్తుందా?
 19. ఈ పదము దేవుని చేత నిషేదించబడిన జాబితాలో ఉన్నాదా?
 20. ఈ పదము పరిశుద్ద గ్రంధములో ఎవరైనా వ్యక్తుల జీవితమును ప్రభావితము చేసినదా?
 21. ఈ ప్రశ్నలు అన్నింటికి సమాధానములు అన్నీ సేకరించి వాటిని విశ్లేషించండి
 22. ఈ క్రమములో మీరు నేర్చుకున్న విషయములు, అవగాహన వ్రాయండి
 23. ఈ స్టడీ చేసిన తరువాత మీ జీవితములో సరిచేసుకొనవలసిన అంశములు ఏమైనా కనిపించాయా?
 24. వాటి విషయము మీరు చేయవలసినది ప్రణాళిక సిద్దము చేయండి
 25. మీరు స్టడీ చేయుటకు ఉదాహరణ క్రింద కొన్ని పదములు
దత్త పుత్రత్వము అపోస్తలుడు పాప పరిహారము రక్షణ
మరణము నరకము పరలోకము దేవదూతలు
సువార్త కృప దేవుని రాజ్యము పస్కా పండుగ