- మీరు స్టడీ చెయ్యాలి అనుకున్న అంశము గురించి వ్రాసుకొనండి
- అంశము యొక్క పరిధి నిర్ణయించండి
- ఎవరైనా రచయిత వ్రాసిన పుస్తకములు
- బైబిలులోని ఒక విభాగము (ధర్మశాస్త్రము, సువార్తలు….)
- ఏదైనా ఒక పుస్తకము
- పాత/క్రొత్త నిబంధన
- మొత్తము బైబిలు
- ముందుగా చిన్న పరిధి ఎంచుకుని, మీకు అలవాటు అయ్యాక పరిధి పెంచండి
- ఈ క్రింది ప్రశ్నలు ఆ అంశము గురించి వేసుకొనండి
- ఏమిటి?
- ఎలా?
- ఎందుకు?
- ఎప్పుడు?
- ఎవరు?
- ఎక్కడ?
- ఈ ప్రశ్నలకు సంబంధించి ఆ అంశము పరిధిలోని వచనములను, సమాధానములను సేకరించండి
- ప్రతి వచనము స్టడీ చేసి మీరు గ్రహించిన విషయము ఒక చోట వ్రాయండి
- అన్ని వచనములు అయిన తరువాత సారాంశము మీ స్వంత పదములు ఉపయోగించి వ్రాయండి
- మీరు గ్రహించిన విషయములలో మీ జీవితమునకు అన్వయించుకొనదగినవి గుర్తించండి
- వాటిని అన్వయించుకొనుటకు మీ ప్రణాళిక సిద్దము చేయండి
- ఉదాహరణకు ఈ క్రింది అంశములు పరిగణించవచ్చు
ఆదికాండములో విధేయత, కీర్తనలలో దేవుని స్తుతించిన పద్దతులు, రాజుల గ్రంధములో దేవుని వ్యతిరేకించిన వారికి ఏమి సంభవించినది…….