1. ఇది ఒక తండ్రి తన కుమారునికి, ఒక భర్త తనకు కాబోయే భార్యకు వ్రాసిన ప్రేమలేఖయై ఉన్నది
  2. ప్రభువైన యేసుక్రీస్తు గురించి తెలిసికొనుటకు
  3. క్రైస్తవ జీవితము అనేది ఆచారములు పాటించేది కాదు. దేవుని యొక్క వాక్యానుసారము జీవించవలసినదై ఉన్నది
  4. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కలుగు రక్షణ పొందుకొనుటకు
  5. అద్యాత్మికముగా ఎదుగుటకు
  6. దేవుడు అప్పచెప్పిన పని నెరవేర్చుటకు తగిన శక్తి, జ్ఞానము, సామర్ధ్యము పొందుకొనుటకు
  7. ప్రభువైన యేసుక్రీస్తునకు శిష్యులుగా మారుటకు
  8. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కాని దేవుని నోట నుంచి వచ్చు ప్రతిమాట వలన జీవించును అని పరిశుద్ద గ్రంధము సెలవిస్తుంది
  9. ఆయన వాక్యము మనము అనుదినము నడువవలసిన త్రోవను బోధిస్తుంది
  10. మనము ఆయన మార్గము తప్పి ప్రవర్తించినపుడు గద్దిస్తుంది
  11. మనము మరలా అయన మార్గములోనికి తిరిగి చేరుటకు మనలను సరిదిద్దుతుంది
  12. మనము ఆయన మార్గములో క్రమము తప్పకుండా నడుచుటకు తర్పీదునిస్తుంది
  13. సత్యము మనలను స్వతంతృలుగా చేస్తుంది
  14. వాక్యము ఈ రూపములో మన చేతులలోనికి రావటానికి చాలా మంది ఎన్నో త్యాగములు చేసారు. వారి ప్రాణములు సహితము ధారపోశారు
  15. మనకు వాక్యము తెలియకపోతే తప్పుడు బోధలచేత మోసపోయి, ఈడ్వబడే ప్రమాదము ఉంది
  16. దేవుడు కోరుకున్న వ్యక్తిగా జీవించటానికి మారదర్శినిగా పనిచేస్తుంది
  17. దేవుడు మనకొరకు చేసినదానిని మనము నాశనము చేసుకోకుండా, వదులుకోకుండా కాపాడుతుంది
  18. మన వ్యక్తిత్వములోని లోటుపాట్లను సరిచేసుకోవటానికి ఉపయోగపడుతుంది
  19. మనిషి జీవనప్రమాణములు ఎలా ఉండాలి అనేది తెలియజేస్తుంది
  20. పాపములో పడిపోకుండా సాతాను యొక్క కుతంత్రములను తప్పించుకోవటానికి వివేచన, వివేకము, వాగ్దానములు దయచేస్తుంది
  21. మనము ప్రతిరోజూ నడువవలసిన త్రోవను తెలియజేస్తుంది
  22. మన జీవితము పట్ల దేవుని ప్రణాళిక/చిత్తము తెలిసికొనుటకు ఉపయోగపడుతుంది
  23. మనలను నిత్యజీవములోనికి నడిపిస్తుంది
  24. దేవుడు ఏర్పాటు చేసిన జీవము అనుదినము పొందుకొనుటకు
  25. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వారూప్యము లోనికి మారుటకు. (ఆయన వ్యక్తిత్వము, ఆలోచన, మాటతీరు, చేతలు, విలువలు)
  26. మన మార్గము దేవుని పద్దతిలో వర్దిల్లజేసికొనుటకు ఉపకరిస్తుంది