- స్టడీ చెయ్యాలి అనుకున్న లక్షణాన్ని వ్రాసుకొనండి
- ఒక వ్యక్తి ఎలాంటి లక్షణములు కలిగి ఉండాలి, ఎలాంటివి కలిగి ఉండకూడదు అని బైబిలు చెప్తుందో తెలుసుకోవటానికి ఈ పద్దతి ఉపకరిస్తుంది
- ఈ స్టడీ ద్వారా మనలో పెంచుకొనవలసిన, తృంచుకొనవలసిన లక్షణములను తెలిసికొని వాటికొరకు సిద్దపడాలి
- ఒకసారికి ఒక లక్షణము మీద పనిచేయండి. అది సాదించిన తరువాత వేరే లక్షణము గురించి స్టడీ చెయ్యండి
- ఈ వ్యక్తిత్వ లక్షణములు మీలో పెంపొందేలా పరిశుద్దాత్మ దేవుని సహాయము మీద ఆధారపడండి
- మీరు స్టడీ చేస్తున్న లక్షణమునకు వ్యతిరేకమైన లక్షణమును కూడా వ్రాసుకుని స్టడీ చెయ్యండి
- ముందుగా మీరు ఎంచుకున్న లక్షణమునకు నిర్వచనము తెలుసుకొనండి. దీని నిమిత్తము డిక్షనరీ ఉపయోగించండి
- పరిశుద్ద గ్రంధములో ఈ రెండు లక్షణముల గురించి ఇవ్వబడిన లేఖనములను సేకరించండి. దీని నిమిత్తము పదసూచిక ఉపయోగించండి
- ఆ వచనముల యొక్క రిఫరెన్స్ లు కూడా సేకరించండి. దీని నిమిత్తము రిఫరెన్స్ బైబిలు ఉపయోగించండి
- వాటి అన్నింటి మీద కొద్ది సమయము ప్రార్ధనా పూర్వకముగా ధ్యానము చేయండి
- మీకు ఈ ధ్యానములో సహకరించటానికి ఈ క్రింది ప్రశ్నలు వేసుకొనండి
-
- ఈ లక్షణము మంచిది అయితే దానివలన కలిగే లాభములు ఏమిటి?
- ఈ లక్షణము చెడ్డది అయితే దానివలన కలిగే నష్టములు ఏమిటి?
- ఈ లక్షణము మంచిది అయితే అది నాలో ఉండటము వలన ఇతరులకు కలిగే ఉపయోగములు ఏమైనా ఉన్నాయా?
- ఈ లక్షణము చెడ్డది అయితే అది నాలో ఉండటము వలన ఇతరులకు కలిగే నష్టములు ఏమిటి?
- ఈ లక్షణము మంచిది అయితే దీని గురించి దేవుడు ఇచ్చిన వాగ్దానములు ఏమైనా ఉన్నాయా?
- ఈ లక్షణము చెడ్డది అయితే దీని గురించి దేవుడు ఇచ్చిన హెచ్చరికలు, శాపములు, తీర్పులు ఏమైనా ఉన్నాయా?
- ఈ లక్షణము గురించి దేవుని ఆజ్ఞ ఏమైనా ఉన్నదా?
- ఈ లక్షణము ఒక మనిషిలో రావటానికి ఎలాంటి పరిస్థితులు దోహదము చేస్తాయి?
- ఈ లక్షణము గురించి ప్రభువైన యేసుక్రీస్తు ఏమైనా చెప్పటము, బోధించటము, హెచ్చరించటము జరిగినదా?
- ఈ లక్షణము గురించి పరిశుద్ద గ్రంధములో ఏ పుస్తకములలో వ్రాయబడినది?
- ఈ లక్షణము గురించి ఎక్కువగా ప్రస్తావించిన రచయిత ఎవరు?
- ఈ లక్షణము పరిశుద్ద గ్రంధములో దేనితో అయినా పోల్చి వివరించటము జరిగినదా? అలా అయితే పోల్చబడిన వస్తువు, జీవి ఏమిటి? దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
- ఈ లక్షణము వేరే ఇతర లక్షణములతో కలిపి చెప్పబడినదా? అయితే ఆ ఇతర లక్షణములు ఏమిటి?
- దేవుడు ఈ లక్షణము గురించి ఎలాంటి అభిప్రాయము లేదా ఉద్దేశ్యము కలిగి ఉన్నారు అని లేఖనము చెప్తుంది?
- ఈ లక్షణము కలిగిన వ్యక్తులు పరిశుద్ద గ్రంధములో ఎవరు ఉన్నారు?
- ఈ లక్షణము వారి జీవితములను ఎలా ప్రభావితము చేసినది?
- ఈ లక్షణము ద్వారా వారి జీవితముల అంతము/గమ్యము ఎలా మారినది?
- మీరు చేసిన అధ్యయనము బట్టి ఈ క్రింది విషయములు ఆలోచించండి
-
- ఈ లక్షణము మీలో ఉండదగినదా? ఉండకూడనిదా?
- ఈ లక్షణము గురించి మీ హృదయమునకు హత్తుకున్న లేదా ప్రాముఖ్యమైన 1 లేదా 2 వచనములను వ్రాయండి
- మీ జీవితములో ఈ యొక్క లక్షణము ఎప్పుడు, ఎలా ప్రతిబింబిస్తున్నదో గమనించండి
- ఈ లక్షణము ఉండవలసినది అయితే దానిని పొందుకోవటానికి లేదా అభివృద్ధి చేసుకోవటానికి పరిశుద్దాత్మ దేవుని సహాయముతో మీరు చేయబోతున్న ప్రయత్నములు ఏమిటి?
- ఈ లక్షణము మీలో ఉండకూడనిది అయితే దానిని వదిలించుకోవటానికి, మరలా రాకుండా ఉండటానికి మీరు పరిశుద్దాత్మ దేవుని సహాయముతో చేయబోవుతున్న ప్రయత్నములు ఏమిటి?
- మీరు చేయబోవుతున్న ప్రయత్నముల యొక్క ప్రణాళిక ఎలా అమలుచేయబోవుతున్నారు, దానికి సంబందించిన కాలపరిమితి వివరములు వ్రాసుకొనండి
- ఈ లక్షణము గురించి ప్రార్ధన చేయవలసిన అంశములు వ్రాసుకొనండి
- ఈ లక్షణము మీ కుటుంబములోని ఇతర సభ్యులలోను, తరువాతి తరములలోను రావటానికి లేదా రాకుండా ఉండటానికి మీరు తీసుకోబోతున్న చర్యలు ఏమిటి?
- ఈ అధ్యయనములో మీరు గ్రహించిన/నేర్చుకున్న విషయములను వ్రాయండి
- మీరు స్టడీ చేయుటకు ఈ క్రింది లక్షణములు కొన్ని ఉదాహరణగా ఇవ్వబడినవి
సేవకత్వము | నిజాయితీ | తగ్గింపు | పట్టుదల |
సహాయము చేయుట | విస్వాస్యత | క్రమశిక్షణ | అందుబాటులో ఉండుట |
క్షమాగుణము | దానము | నమ్మకము | సర్దుకుపోవుట |
విధేయత | నేర్చుకొనగలుగుట | బద్దకము | కటినము |
అపనమ్మకము | విమర్శించుట | గర్వము | అసహనము |
స్వార్ధము | చింత | అవిశ్వాసము | భయము |
అగౌరవము | కామము | తిరుగుబాటు | కక్ష |