1. మీరు ఎవరి జీవితము గురించి స్టడీ చేయాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు వ్రాయండి
 2. బైబిలులోని స్త్రీ, పురుషుల పేర్లు మీ జాబితాలో ఉండేలా చూడండి. దేవునికి ఇద్దరి మధ్యన బేధము లేదు కాబట్టి ఇద్దరి జీవితముల నుంచి మనము నేర్చుకొనవచ్చు
 3. పరిశుద్ద గ్రంధములో విజయము కలిగినవారు, వైఫల్యము చెందినవారి ఇద్దరి జాబితా నుండి మీ పేర్లు ఉండేలా చూడండి
 4. ఆ వ్యక్తి గురించి సరైన దృక్పదముతో అర్ధము చేసికొనగలిగేలా ప్రార్ధన చెయ్యండి
 5. ఆ వ్యక్తికి సంబంధించిన ప్రతి వచనమును పరిశుద్ద గ్రంధము నుండి సేకరించండి
 6. ఆ వ్యక్తి గురించి మీరు కలిగియున్న ప్రాధమిక సమాచారము, అభిప్రాయము వ్రాయండి
 7. ఆ వ్యక్తి జీవితములో జరిగిన సంఘటనలను పుట్టుక నుంచి మరణము వరకు వరుస క్రమములో అమర్చండి
 8. ఆ వ్యక్తి గురించి మీరు సేకరించిన వచనములను స్టడీ చెయ్యండి
 9. ఆ వ్యక్తి యొక్క లక్షణములను గురించి అధ్యయనము చేయండి
 10. ఆ వ్యక్తి తన జీవితము ద్వారా తెలియజేసిన బైబిలు సత్యములను గుర్తించండి
 11. స్టడీ చేసిన తరువాత ఆ వ్యక్తి గురించి మీకు కలిగిన అభిప్రాయము, తెలుసుకున్న విషయములు వ్రాయండి
 12. ఆ వ్యక్తి గురించి ఏమైనా అపార్ధములు కలిగి ఉన్నారేమో గమనించండి. ఆ అపార్ధము ఎందుకు వచ్చినదో విశ్లేషించండి
 13. ఇదే విధముగా మీ జీవితములో ఎవరిని అయినా అపార్ధము చేసుకున్నారేమో, సంబంధ బాంధవ్యములు దెబ్బతిన్నాయేమో ఆలోచించండి.
 14. వాటిని దేవుని సహాయముతో ఎలా సరిచేసుకోవాలో ప్రార్ధనా పూర్వకముగా ఆలోచించండి
 15. ఆ వ్యక్తి జీవితమును, మీ జీవితముతో పోల్చుకుని చూడండి
  • ఈ వ్యక్తి జీవితము నా జీవితమును ఎంతవరకు ప్రతిబింబిస్తుంది?
  • ఈ వ్యక్తి జీవితములో ఉన్న మంచి లక్షణములు నాలో ఏవైనా ఉన్నాయా?
  • ఈ వ్యక్తి జీవితములో ఉన్న చెడ్డ లక్షణములు నాలో ఏమైనా ఉన్నాయా?
  • ఈ వ్యక్తి జీవితములో మిమ్ములను ఎక్కువగా ప్రభావితము చేసిన అంశములు ఏమిటి?
  • ఈ వ్యక్తి జీవితము చూసినపుడు మీరు ఏ విషయములలో తగిన స్థాయిలో లేరు?
 16. మీరు సరిచేసుకొనవలసిన అంశములు గుర్తించండి.
 17. ఆ అంశముల నిమిత్తము ప్రణాళిక సిద్దము చెయ్యండి
 18. మీరు కలిగియున్న మంచి లక్షణముల విషయమై దేవునికి, అందుకు కారణమైన వ్యక్తులకు కృతజ్ఞత చెల్లించండి
 19. వ్యక్తి యొక్క జీవితమును స్టడీ చేస్తున్నపుడు ఈ క్రింది విషయములను గమనించండి
  • ఈ వ్యక్తి యొక్క కుటుంబము, వంశము గురించి ఏమి తెలుసు?
  • వ్యక్తి పేరునకు ఉన్న అర్ధము ఏమిటి?
  • ఆ పేరు ఎందు నిమిత్తము పెట్టబడినది?
  • ఆ పేరు ఎప్పుడైనా మార్చబడినదా?
  • వ్యక్తి కుటుంబము ఎలాంటిది?
  • వ్యక్తి ఎలా పెంచబడ్డాడు?
  • వ్యక్తి ఎలాంటి లక్షణములతో పెరిగాడు?
  • వ్యక్తి తల్లితండ్రులు ఎలాంటివారు?
  • తల్లి తండ్రి యొక్క ప్రభావము వ్యక్తి మీద ఎంతవరకు ఉన్నది?
  • వ్యక్తి పుట్టుకలో ఏదైనా విశేషమున్నదా?
  • వ్యక్తి ఎక్కడ జీవించాడు?
  • అతని అనుదిన జీవితము ఎలా ఉండేది?
  • వ్యక్తి ఇతర సంస్కృతులలో ఎప్పుడైనా జీవించాడా?
  • వాటి యొక్క ప్రభావము వ్యక్తి జీవితము మీద ఏమైనా ఉన్నదా?
  • వ్యక్తి జీవిత సమయములో వారు జీవిస్తున్న దేశము యొక్క రాజకీయ పరిస్థితులు ఏమిటి?
  • వ్యక్తి జీవిత సమయములో వారు జీవిస్తున్న దేశము యొక్క ఆత్మీయ పరిస్థితి ఏమిటి?
  • వ్యక్తి చదువుకున్నవాడా?
  • వ్యక్తి ఎవరి ద్వారా అయినా ప్రత్యేకమైన తర్ఫీదు పొందుకున్నాడా?
  • వ్యక్తి యొక్క వృత్తి ఏమిటి?
  • వ్యక్తి యొక్క వృత్తికి, దేశము యొక్క సంస్కృతికి, ఆచారములకు ఏమైనా సంబంధము ఉన్నదా?
  • వ్యక్తి ఎన్ని సంవత్సరములు జీవించాడు?
  • వ్యక్తి ఎక్కడ మరణించాడు?
  • ఆ ప్రదేశములో మరణించటానికి ఏదైనా ప్రత్యేక కారణము ఉన్నదా?
  • వ్యక్తి ఎలా మరణించాడు?
  • వ్యక్తి గురించి పరిశుద్ద గ్రంధములో ఏ రచయితలు వ్రాసారు?
  • రచయితకు వ్యక్తికి ఏమైనా సంబంధము ఉన్నదా?
  • వ్యక్తి గురించి పరిశుద్ద గ్రంధములో వ్రాయబడిన పుస్తకముల పేర్లు ఏమిటి?
  • వ్యక్తి గురించి ఆ కాలపు ప్రజలు ఎలాంటి అభిప్రాయము కలిగియున్నారు?
  • వ్యక్తి గురించి అతని స్నేహితులు ఎలాంటి అభిప్రాయము కలిగియున్నారు?
  • వ్యక్తి గురించి అతని శతృవులు కలిగియున్న అభిప్రాయము ఏమిటి?
  • వ్యక్తి గురించి అతని కుటుంబసభ్యులు కలిగియున్న అభిప్రాయము ఏమిటి?
  • దేవుడు ఎందునిమిత్తము ఈ వ్యక్తి గురించి పరిశుద్ద గ్రంధములో వ్రాయించారు?
  • వ్యక్తి యొక్క లక్ష్యములు ఏమిటి?
  • వ్యక్తి ఇంటిలో ఎలా ప్రవర్తించేవాడు?
  • అపజయము కలిగినపుడు వ్యక్తి యొక్క ప్రతిస్పందన ఎలా ఉండేది?
  • సులభముగా కృంగిపోయే మనస్తత్వము కలిగినవాడా?
  • నిందలకు అతని స్పందన ఎలా ఉండేది?
  • నిందలను సమర్ధవంతముగా ఎదుర్కొనగలిగిన సామర్ధ్యము ఉన్నదా?
  • విజయము కలిగినపుడు వ్యక్తి యొక్క స్పందన ఎలా ఉండేది?
  • దేవునికి కృతజ్ఞత చెల్లించే మనస్తత్వము కలిగినవాడా?
  • ఎవరైనా పొగిడితే గర్వించే హృదయము కలిగినవాడా?
  • అల్పమైన, చిన్న విషయముల యందు అతని ప్రవర్తన ఎలా ఉండేది?
  • చిన్న విషయములలో నమ్మకత్వము కలిగియున్నాడా?
  • లోక సంబంధమైన విషయములలో వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉండేది?
  • అతనికి జరిగిన మేలుల విషయమై దేవుని స్తుతించే మనస్సు ఉన్నదా? అది ఎంత త్వరగా అమలుచేసేవాడు?
  • అతనికి కలిగిన చెడు విషయముల యందు దేవుని దూషించే లక్షణము ఉన్నదా?
  • అతనికి కలిగిన చెడు విషయముల యందు దేవుని స్తుతించే గుణము ఉన్నదా?
  • దేవుడు ఏదైనా చేయమని చెబితే ఎంత సమయములో చేసేవాడు?
  • దేవుని వలన ఏర్పరచబడిన అధికారులకు, అధికారమునకు లోబడే గుణము ఉన్నదా?
  • దేవునితో ఏకాంతముగా ఉన్నప్పుడు వ్యక్తి ప్రవర్తన ఎలా ఉండేది?
  • అతని జీవితములో పెనుసవాళ్లు ఏమైనా ఎదురయ్యాయా?
  • వాటిని అతను ఎలా ఎదుర్కొన్నాడు?
  • వ్యక్తి గురించి గుర్తుపెట్టుకునేంతగా సాధించినవి ఏమైనా ఉన్నాయా?
  • వ్యక్తి జీవితము మీద దేవుని పిలుపు ఉన్నదా?
  • దానికి అతను ఎలా ప్రతిస్పందించాడు?
  • దేవుని సార్వభౌమాధికారమునకు అతను లోబడ్డాడా?
  • దేవునికి, వ్యక్తికి మధ్య జరిగిన సంఘటనలు ఏమిటి?
  • వ్యక్తి జీవితము పట్ల దేవుడు కలిగియున్న ఉద్దేశ్యము ఏమిటి?
  • వ్యక్తి జీవితము ద్వారా దేవునికి కలిగిన మహిమ ఏమిటి?
  • వ్యక్తి జీవితము ద్వారా దేవుని నామమునకు ఏమైనా దూషణ కలిగినదా?
  • వ్యక్తి ఇతరులకు ఎలాంటి సందేశము బోధించాడు?
  • వ్యక్తి తన జీవితము ద్వారా ఎలాంటి సందేశము ఇతరులకు ఇచ్చాడు?
  • వ్యక్తి ఇచ్చిన సందేశము దేవునికి అనుకూలమైనదా? వ్యతిరేకమైనదా?
  • లోకమునకు వేరుగా వ్యక్తి ప్రత్యేకమైన జీవితము జీవించినాడా?
  • వ్యక్తి జీవితములో వేటిమీద తన విశ్వాసము ఉంచాడు?
  • వ్యక్తికి దేవుడు నేర్పించిన గొప్ప పాటములు ఏమిటి?
  • దేవుడు వ్యక్తి జీవితములో ఎందుకు అలా ప్రవర్తించవలసి వచ్చినది?
  • వ్యక్తి ప్రవర్తన అతని జీవితములో దేవుని విధి, విధానాలను ఎలా ప్రభావితము చేసినది?
  • దేవుని వాక్యము పట్ల వ్యక్తి యొక్క ప్రవర్తన ఏమిటి?
  • వ్యక్తి బ్రతికిన సమయములో అందుబాటులో ఉన్న లేఖనములు ఏమిటి?
  • ఆ లేఖనములలో వ్యక్తికి గల జ్ఞానము ఎలాంటిది?
  • వ్యక్తి ప్రార్ధనా జీవితము ఎలాంటిది?
  • వ్యక్తికి దేవునితో అవినాభావ సంబంధము ఉన్నదా?
  • వ్యక్తి తన సాక్ష్యమును ప్రజల మధ్యన ధైర్యముగా పంచుకోగలిగాడా?
  • సంఘమునకు హింస కలిగినపుడు వ్యక్తి ధైర్యము వహించి తన సాక్ష్యము కాపాడుకున్నాడా?
  • దేవుని పట్ల వ్యక్తికి గల విశ్వాస పరిమాణము ఎలా కనుపరచినాడు?
  • వ్యక్తికి దేవుడు ఏమైనా ప్రత్యేక వాగ్దానములు ఇచ్చారా?
  • వ్యక్తి దేవుని చేత ఏ విషయములో అయినా గద్దించబడ్డాడా?
  • వ్యక్తి తన జీవితకాలములో దేవుని మార్గము నుంచి తప్పిపోయిన పరిస్థితులు ఉన్నాయా?
  • వ్యక్తికి దేవుడు అప్పగించిన పనులు అన్నింటిలో నమ్మకత్వము కలిగియున్నాడా?
  • వ్యక్తి దేవుని పట్ల దాసుని స్వభావము కలిగియున్నాడా?
  • వ్యక్తి పరిశుద్దాత్మ చేత నింపబడినాడా?
  • వ్యక్తికి పరిశుద్దాత్మ అనుభవము ఎలా సంభవించినది?
  • వ్యక్తి జీవితములో పరిశుద్దాత్మ దేవుడు చేసిన క్రియలు ఏమిటి?
  • వ్యక్తి జీవితము మీద పరిశుద్దాత్మ దేవుని ప్రభావము ఎలా ఉన్నది?
  • వ్యక్తిని పరిశుద్దాత్మ దేవుడు ఎలా నడిపించారు?
  • వ్యక్తి ఏమైనా ఆత్మీయవరములు కలిగియున్నాడా?
  • వ్యక్తి తనకు ఇవ్వబడిన ఆత్మీయవరములను ఎలా ఉపయోగించాడు?
  • వ్యక్తి తన జీవితకాలములో చేసిన అద్భుతకార్యములు ఏమిటి?
  • వ్యక్తి దేవుడు తనకు ఇచ్చిన శక్తిని, అవకాశమును దుర్వినియోగము చేసాడా?
  • ఎదురు ప్రశ్నించకుండా దేవుని చిత్తము చెప్పినట్లు చేసే మనస్తత్వము కలిగియున్నాడా?
  • దేవుడు వ్యక్తిని తృణీకరించి నిందకు, అవమానమునకు ఆస్పదముగా చేసియున్నారా?
  • దేవుడు వ్యక్తి జీవితములో చూపిన కృప ఎలాంటిది?
  • దేవుడు వ్యక్తికి తన జీవితములో ఇచ్చిన అవకాశములు ఏమిటి?
  • వ్యక్తి తన జీవితములో దేవుని గురించి తెలుసుకోవటము ఎలా తటస్థించినది?
  • వ్యక్తి యొక్క రక్షణ సాక్ష్యము ఏమిటి?
  • వ్యక్తి తన జీవితములో దేవుని కొరకు చేసిన త్యాగములు ఏమిటి?
  • ఇతర వ్యక్తులతో ఎలా ప్రవర్తించేవాడు?
  • ఒంటరిగా ఉండటానికి ఇష్టపడే వ్యక్తా? అందరితో కలిసిపోయేవాడా?
  • వ్యక్తిలో ఉన్న నాయకత్వ లక్షణములు ఏమిటి?
  • ఇతరులను ఉపయోగించుకుని మర్చిపోయే వ్యక్తా?
  • ఇతరులకు సహాయము చేసే లక్షణము ఉన్నదా?
  • ఇతరులకు ఎలాంటి గౌరవమర్యాదలు ఇచ్చేవాడు? తనకన్నా పెద్దవారికి? చిన్నవారికి?
  • వ్యక్తి యొక్క భార్య/భర్త ఎవరు?
  • వ్యక్తి జీవితములోనికి భార్య/భర్త ఎలా ప్రవేశించారు?
  • భార్య/భర్త యొక్క ప్రభావము వ్యక్తి జీవితము మీద ఏమైనా ఉన్నాదా?
  • వ్యక్తి ప్రభావము తన భార్య/భర్త మీద ఎలా ఉన్నది?
  • భార్య/భర్త వలన వ్యక్తి దేవునిలో ఎదిగాడా? పడిపోయాడా?
  • వ్యక్తి యొక్క సంతానము ఎవరు?
  • వ్యక్తికి సంతానము ఎవరి ద్వారా కలిగినది?
  • సంతానము యొక్క ప్రభావము వ్యక్తి జీవితము మీద ఏమైనా ఉన్నదా?
  • వ్యక్తి యొక్క సమీప స్నేహితులు ఎవరు?
  • వ్యక్తి స్నేహితులు ఎలాంటివారు?
  • స్నేహితుల వలన వ్యక్తి జీవితము ఎలా ప్రభావితము చేయబడినది?
  • వ్యక్తికి శతృవులు ఎవరు?
  • వ్యక్తి శతృవులు ఎలాంటివారు?
  • శతృవుల యొక్క ప్రభావము వ్యక్తి జీవితము మీద ఎలా ఉన్నది?
  • ఇతరులను ప్రభావితము చేయటములో వ్యక్తి యొక్క పాత్ర ఏమిటి?
  • తన దేశము మీద, ప్రక్కన ఉన్న దేశముల మీద వ్యక్తి యొక్క ప్రభావము ఏమిటి?
  • వ్యక్తి తన కుటుంబ భాద్యతలు ఎలా నిర్వర్తించేవాడు?
  • వ్యక్తి యొక్క సంతానము ఎలా తయారు అయ్యారు?
  • వ్యక్తి యొక్క కుటుంబము దేవునిలో ఎదుగుటకు సహాయము చేసారా? కృంగదీశారా?
  • వ్యక్తి యొక్క స్నేహితులు దేవునిలో ఎదుగుటకు సహాయము చేసారా? కృంగదీశారా?
  • వ్యక్తి దేవునిలో ఎదగటానికి ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తులు ఎవరు? ఎలా చేశారు?
  • వ్యక్తి దేవునిలో ఆటంకపరచబడటానికి ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తులు ఎవరు? ఎలా చేశారు?
  • వ్యక్తి తన తదనంతరం భాద్యతలు చేపట్టుటకు ఎవరిని అయినా తయారుచేశాడా?
  • వ్యక్తి జీవితములో తనని వెంబడించిన శిష్యులు ఉన్నారా?
  • వ్యక్తి తన జీవితకాలములో ఎవరి చేత అయినా మోసపోయాడా?
  • వ్యక్తి జీవితములో స్నేహితులు ఎవరైనా శతృవులుగా మారారా?
  • వ్యక్తి జీవితములో శతృవులు ఎవరైనా స్నేహితులుగా మారారా?
  • అతను శిష్యులను తయారుచేసిన విధానము ఎలాంటిది?
  • అతను పెరిగి ఏమయ్యాడో, అలా అవటానికి గల ప్రధాన కారణములు ఏమిటి?
  • వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి ఎలాంటిది?
  • వ్యక్తిలో ఉన్న మంచి బలమైన లక్షణములు ఏమిటి?
  • ఆ లక్షణములు అతనికి ఎలా వచ్చాయి?
  • వ్యక్తి జీవితములో ఉన్న చెడ్డ లక్షణములు ఏమిటి?
  • ఆ లక్షణములు అతనికి ఎలా వచ్చాయి?
  • వ్యక్తి తన జీవితములో ఎదిగేకొద్దీ తన ప్రవర్తన సరిచేసుకున్నాడా?
  • వ్యక్తి జీవితములో క్రమేపీ ఎదిగాడా? తగ్గింపబడ్డాడా?
  • వ్యక్తి చేసిన పాపములు ఏమైనా ఉన్నాయా?
  • ఆ పాపములు చేయటానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి?
  • వ్యక్తి తన జీవితములో దేనితో పోరాడాడు? (నేత్రాశ, శరీరాశ, జీవపుడంబము)
  • వ్యక్తి తన జీవితములో చేసిన పాపము వలన ఎదుర్కొన్న పర్యవసానములు ఏమిటి?
  • వ్యక్తి తన జీవితకాలములో పాపము మీద విజయము సాదించగలిగాడా?
  • ఆ విజయము ఎలా సాధించాడు?
  • వ్యక్తిలో క్రీస్తునకు సంబంధించిన పోలికలు ఏమైనా ఉన్నాయా?
  • వ్యక్తి ప్రవర్తనలోను, వ్యక్తిత్వ లక్షణములలోను అతను విజయము సాధించటానికి దోహదము చేసినవి ఏమిటి?
  • వ్యక్తి యొక్క ప్రవర్తనలోను, వ్యక్తిత్వ లక్షణములలోను అతను పడిపోవటానికి దోహదము చేసినవి ఏమిటి?
  • వ్యక్తి జీవితములో కలిగియున్న ఆశీర్వాదములు ఏమిటి?
  • వ్యక్తి యొక్క జీవితము ముగింపులో దేవుడు అతని గురించి ఎలాంటి తాత్పర్యము ఇచ్చారు?
  • వ్యక్తి తన తల్లిని, తండ్రిని చివరిదశ వరకు సరిగా చూసుకున్నాడా?
  • వ్యక్తి వలన తల్లి, తండ్రి అనుభవించిన సంతోషము ఏమైనా ఉన్నదా?
  • వ్యక్తి వలన తల్లి, తండ్రి అనుభవించిన దుఃఖము ఏమైనా ఉన్నదా?
  • వ్యక్తి యొక్క స్వంత కుటుంబములో తనను అసహ్యించుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా?
  • ఎందు నిమిత్తము వారు అలా చేశారు?
  • వ్యక్తి జీవితముతో సంబంధము కలిగిన పరిశుద్ద గ్రంథములోని ప్రధాన దైవజనులు ఎవరైనా ఉన్నారా?
  • వ్యక్తికి ఎవరైనా గురువు ఉన్నాడా?
  • సంఘములోని వ్యక్తుల పట్ల వ్యక్తి ప్రవర్తన ఎలా ఉండేది?
  • సంఘము వెలుపలి వ్యక్తుల పట్ల వ్యక్తి ప్రవర్తన ఎలా ఉండేది?
  • సంఘము యొక్క అభివృద్దిలో/నాశనములో వ్యక్తి యొక్క పాత్ర ఏమైనా ఉన్నదా?
 20. మీరు స్టడీ చేయుటకు కొన్ని పేర్లు ఉదాహరణ కొరకు
అబ్రహాము ఇస్సాకు యాకోబు యోసేపు
శారా రిబ్కా రాహేలు ఆసేనతు
ఆహాబు ఏలియా మరియ తబిత