Skip to content
Chapter Wise BIBLE Study Method
- మీరు స్టడీ చెయ్యాలి అనుకున్న అధ్యాయము ఎంచుకొనండి
- మీరు స్టడీ చేయబోతున్న అధ్యాయము ఏ పుస్తకములోనిదో దాని యొక్క అమరిక మీకు ఒక అవగాహన ఉండాలి. అప్పుడే అధ్యాయము యొక్క సందర్భము మీకు సరిగా అర్ధము అవుతుంది. లేకపోతే సందర్భము విడిచి అపార్ధము చేసుకునే ప్రమాదము కలదు
- ఆ అధ్యాయమును కనీసము 5 సార్లు అయినా చదవండి
- అధ్యాయములో ప్రస్తావించబడిన విషయములను బట్టి దానికి ఒక చిన్న హెడ్డింగ్ ఇవ్వండి
- అధ్యాయము యొక్క సారాంశమును 2-3 లైన్లలో క్లుప్తముగా వ్రాయండి
- అధ్యాయము నందు ప్రాముఖ్యముగా ప్రస్తావించిన విషయములు ఏమిటి?
- అధ్యాయము నందు ముఖ్యమైన వ్యక్తులు ఎవరు?
- అధ్యాయములో ముఖ్యమైన వచనము ఏమిటి?
- అధ్యాయము నందు ఉపయోగించబడిన ప్రాముఖ్యమైన పదములు ఏమిటి?
- ఈ అధ్యాయము గురించి మరింత సమాచారము ఇవ్వగలిగిన అధ్యాయములు పరిశుద్ద గ్రంధములో ఇంకా ఏమైనా ఉన్నాయా?
- అధ్యాయము నందు సంధించబడిన ప్రశ్నలు ఏమిటి?
- వాటికి సమాధానములు అధ్యాయములో ఇవ్వబడినాయా?
- అధ్యాయములో దేవుని ఆజ్ఞలు
- అధ్యాయములో దేవుని దీవెనలు
- అధ్యాయములో దేవుని వాగ్ధనములు
- అధ్యాయములో దేవుని శాపములు
- అధ్యాయములో హెచ్చరికలు/జాగ్రత్తలు
- అధ్యాయములో ఉపయోగించబడిన పోలికలు
- అధ్యాయములో ఉపమానములు
- అధ్యాయములో ఉదాహరణలు
- అధ్యాయములో ప్రోత్సహించిన విషయములు
- అధ్యాయములో ప్రస్తావించబడిన వస్తువులు
- అధ్యాయములో ఆశ్చర్యము కలిగించే విషయములు
- అధ్యాయములో వింత/విచిత్రమైన విషయములు
- అధ్యాయములో పరస్పర విరుద్దమైన విషయములు ఏమైనా ఉన్నాయా?
- అధ్యాయములో పాపము గురించి, దాని పర్యవసానములు గురించి ఏమైనా చెప్పబడినదా?
- అధ్యాయములో విధేయత గురించి, దాని వలన కలుగు దీవెనల గురించి ఏమైనా వ్రాయబడినదా?
- ఈ అధ్యాయము చదివినపుడు అర్ధము చేసుకోవటానికి మీకు కష్టముగా అనిపించిన వచనములు, భాగములు వ్రాయండి
- అధ్యాయములోని వ్యక్తుల జీవన పరిస్థితి
- అధ్యాయములోని వ్యక్తుల మానసిక పరిస్థితి
- క్రొత్త నిబంధన అధ్యాయము అయితే పాత నిబంధనతో ఏమైనా సంబంధము కలిగి ఉన్నదా?
- పాత నిబంధన అధ్యాయము అయితే క్రొత్త నిబంధనలో ఎక్కడ అయినా ప్రస్తావించబడినదా?
- అధ్యాయములోని విషయములను ఈ కాలమునకు ఎలా అన్వయించాలి?
- అధ్యాయము పుస్తకములో లేకపోతే కలిగే లోటు ఏమిటి?
- అధ్యాయము ద్వారా ఏమి తెలుసుకోవాలి అని రచయిత యొక్క ఉద్దేశ్యము?
- అధ్యాయము వెనుక దాగియున్న సందర్భము ఏమిటి?
- అధ్యాయములోని విషయములను వర్గీకరించండి
- విషయము
- ఏ వచనములో మొదలు అయినది
- ఏ వచనములో ముగించబడినది
- అధ్యాయము స్టడీ చేయటము ద్వారా మీరు గ్రహించిన విషయములు వ్రాయండి
- వాటిని మీ జీవితమునకు ఎలా అన్వయించుకోవాలో గమనించండి?
- వాటి నిమిత్తము ప్రణాళిక సిద్దము చెయ్యండి
- అధ్యాయములో చెప్పబడిన అంశములు ఆ ప్రజల మీద ఎలాంటి ప్రభావము చూపించాయి?
- అధ్యాయములోని విషయమును చిత్రరూపకముగా చూపించుటకు ప్రయత్నము చేయండి
admin2023-02-16T20:54:38+05:30
Share This Story, Choose Your Platform!
Page load link