అధ్యాయము విషయము
1 దేవుడు విశ్వమును, ఆకాశమును, భూమిని, మొక్కలను, పక్షులను, జంతువులను మరియు మనుష్యులను చేయుట
2 ఏదేను వనములో ఆదాము హవ్వ ల యొక్క ప్రారంభ జీవితము
3 ఆదాము హవ్వ ల యొక్క అవిధేయత మరియు ఏదేను వనము నుండి పంపివేయబడుట
4 కయీను హేబెలు ను చంపుట, కయీను యొక్క శాపము, కయీను వంశావళి
5 ఆదాము మరియు నోవహు యొక్క వంశావళి
6 మానవుల దుష్టత్వము మరియు నోవహు మీద దేవుడు కృప చూపుట
7 జలప్రళయము
8 ప్రళయము తగ్గి ఓడ అరారాతు పర్వతముల మీద నిలచుట
9 ఇంద్రధనస్సు యొక్క నిబంధన
10 షేము, హాము, యాపేతు ల యొక్క వంశావళి
11 బాబెలు గోపురము, అబ్రహాము వరకు గల షేము పితరుల వివరణ
12 దేవుడు అబ్రహామును పిలచుట, అబ్రహాము ఇగుప్తు ప్రయాణము
13 అబ్రహాము తో లోతు వేరగుట, దేవుడు అబ్రహామునకు గొప్ప వంశావలిని వాగ్ధానము చేయుట
14 అబ్రహాము లోతును కాపాడుట, మెల్కీసెదెకు నుంచి అబ్రహాము ఆశీర్వాదము పొందుట
15 అబ్రహాము తో దేవుని నిబంధన
16 శారా, హాగరు మరియు ఇష్మాయేలు గురించి
17 సున్నతి యొక్క నిబంధన
18 దేవుడు ఇస్సాకు జననము గురించి వాగ్ధానము చేయుట, అబ్రహాము సొదొమ గురించి విజ్ఞాపన చేయుట
19 సొదొమ గొమొఱ్ఱా నాశనము, లోతు కుమార్తెలు ఇద్దరు కుమారులకు జన్మ ఇచ్చుట
20 అబ్రహాము, శారా మరియు అబీమెలెకుగురించి
21 ఇస్సాకు జననము, హాగరు ఇష్మాయేలును పంపివేయుట, బెయేర్షేబా నిబంధన
22 ఇస్సాకును బలిగా అర్పించుట, నాహోరు కుమారులు
23 శారా మరణము మరియు భూస్థాపన
24 ఇస్సాకు మరియు రిబ్కాగురించి
25 అబ్రహాము మరణము, ఇష్మాయేలు వంశావళి, యాకోబు ఏశావు జననము
26 ఇస్సాకు మరియు అబీమెలెకుగురించి
27 యాకోబు ఇస్సాకు చేత అశీర్వదించ బడుట
28 యాకోబు లాబాను దగ్గరకు పారిపోవుట మరియు నిచ్చెన యొక్క దర్శనము
29 యాకోబు రాహేలును కలుసుకొనుట, లాబాను దగ్గర పనిచేయుట, లేయాను రాహేలును వివాహము చేసికొనుట
30 యాకోబు అతని కుమారులు అభివృద్ధి చెందుట
31 యాకోబు కనానుకు పారిపోవుట, లాబాను వెంబడించుట
32 యాకోబు ఏశావు ను కలుసుకొనుటకు సిద్దపడుట, దేవునితో పెనుగులాట
33 యాకోబు ఏశావు ను కలియుట, షెకెము లో స్థిరపడుట
34 షెకెము దీనాను అపవిత్ర పరచుట, యాకోబు కుమారుల ప్రతీకారము
35 యాకోబు బెతెలునకు తిరిగి వచ్చుట, ఇశ్రాయేలు గా పేరు పెట్టబడుట, రాహేలు ఇస్సాకు మరణము
36 ఏశావు యొక్క వంశావళి, ఎదోము రాజ్యము
37 యోసేపు యొక్క కల మరియు అతని సహోదరు ల చేత అమ్మివేయబడుట
38 యూదా మరియు తామారుగురించి
39 యోసేపు అభివృద్ధి పొందుట, పోతిఫరు భార్య చేత శోధన, జైలులో వేయబడుట
40 యోసేపు పానదాయకుల అధిపతియు మరియు భక్ష్యకారుల అధిపతియు యొక్క కల భావములను వివరించుట
41 ఫరో యొక్క కల, యోసేపు భావము వివరించుట, బహుమానము పొందుట
42 యోసేపు సహోదరులు ఇగుప్తునకు వచ్చుట, షిమ్యోను ను బందించుట
43 బెన్యామీను ను తీసుకొని ఇగుప్తునకు తిరిగి వచ్చుట
44 బెన్యామీను మరియు వెండి గిన్నె
45 యోసేపు తన సహోదరులకు తనను బయల్పరచుకొని వారిని క్షమించుట
46 యాకోబు అతని కుటుంబము ఇగుప్తునకు వెళ్లుట
47 యాకోబు గోషేను లో స్థిరపడుట, ఇశ్రాయేలీయులు విస్తరించుట
48 యాకోబు కాయిలా పడుట, మనష్షే ఎప్రాయీము లను దీవించుట
49 యాకోబు అతని కుమారులను దీవించుట, యాకోబు మరణము
50 యాకోబు భూస్థాపన, యోసేపు మరణము