- దేవుని యొక్క ఆత్మ జలములమీద అల్లాడుచుండెను (1:2). సృష్టికార్యమునందు ఆత్మ దేవుడు పాలుకలిగి ఉన్నారని మనకు తెలియజేస్తుంది
- యోసేపునందు జ్ఞానము కలిగిన ఆత్మగా “ఇతనివలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా? అని యనెను.” (41:38).
- మన పితరుల యొక్క జీవితకాలమునందు వారి కుటుంబములను కాపాడి వారిని దీవించుటయందు ఆత్మయొక్క కార్యము మనకు స్పష్టముగా కనిపిస్తుంది
- ఆదికాండము 8వ అధ్యాయములో భూమి దేవుని యొక్క తీర్పుద్వారా జలప్రళయమునకు గురి అయినపుడు మరలా సాధారణమైన నివాసయోగ్యమైన పరిస్థితులు భూమిమీద నెలకొనేలా చేయుటలో ఆయన పాత్ర అమోఘమైనది
- ఆదికాండము 1, 3, 11 అధ్యాయములలో ఉపయోగించబడిన “మనము” అనే మాటలో ఆయన ఇమిడి ఉన్నాడు
- అబ్రహాము, యోసేపులకు దేవుని మనస్సులో ఉన్నధర్మశాస్త్రము యొక్క విధులను గురించి ప్రత్యక్షత అనుగ్రహించిన ఘనత ఆయనదే
- రిబ్కాను, ఇస్సాకు దగ్గరకు తీసికొనివచ్చిన ఎలియాజరు, సంఘమును అను వధువును వరుడైన యేసుక్రీస్తు ప్రభువు కొరకు సిద్దము చేసి తీసికొనివచ్చు పరిశుద్దాత్మునికి సాదృశ్యముగా ఉన్నాడు
- యాకోబు తన కుమారులను దీవించినపుడు అతనిమీద ఉన్న ప్రవచన ఆత్మగా ఆయనను మనము చూడగలము
- ఓడలో ఉన్ననోవహు వద్దకు ఒలీవ ఆకు తెచ్చిఅతనికి నిశ్చయత, ధైర్యము, ఆదరణ కలిగించిన పావురమునకు ఆయన సాదృశ్యము