- సృష్టిదేవుని మంచితనము యొక్క కార్యమై ఉన్నది. అది ఎల్లప్పుడూ దేవుని యొక్క శక్తిని ప్రచురపరుస్తూఉన్నది. (1:12:25).
- ఆరాధన అనేది వేడుక కాదు. అది ఒకరి హృదయము జీవితమును దేవునికి సమర్పించటము (4:2-7; 22:1-19).
- ఆరాధన విధేయతతో మొదలవుతుంది (6:22; 12:4).
- నిజమైన ఆరాధన దేవునితో నిబంధన కలిగిన జీవితము జీవించుటకొరకు ఆస్తులను, హోదాను, సౌకర్యములను వదులుకుంటుంది (12:1-4; 13:18).
- దేవుని ప్రత్యక్షతను అనుసరించి ఆనందముగా ఆరాదించువారికి నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఉదాహరణలు (17:3; 26:25; 33:20).
- మన పాపమునకు దేవుడు క్షమాపణ, దయ ద్వారా స్పందించును. ఆ దయకు ఆరాధన అనేది సరైన ప్రతిస్పందన అయి ఉన్నది (18:20-33).
- దేవునికి ఆయన ప్రజలకు ఇవ్వటము అనేది కూడా ఒక ఆరాధన పద్దతి (14:18-20).
- దేవుని ఆరాధించే క్రమములో మనకు ఏంటో ఇష్టమైన వాటిని, ప్రేమించే వాటిని త్యాగము చేయవలసి వస్తుంది
- దేవుని నిబంధన అనుసరించి నడుచుట ఆయనను ఆరాధించుటలో భాగము
- ఆయన ఇచ్చేటటువంటి వస్తు, ధన సంబంధ దీవెనలకొరకు కాకుండా ఆయనను వ్యక్తిగతముగా కోరుకొనుట నిజమైన ఆరాధన