దేవునిని అర్ధము చేసికొనుట
సత్యము: దేవుడే సృష్టి కర్త. ఆయన మాత్రమే స్వయంభువుడు. మనము ఆయన ద్వారా చేయబడినవారము. సమస్త జీవులు కూడా తమ జాతి ప్రకారము పునరుత్పత్తి చేయగలిగే విధముగా దేవుడు వాటిని సృజించటము జరిగినది

అన్వయము: మనము సృజించబడిన వారముగా మన సృష్టికర్త పట్ల జవాబుదారీతనము కలిగియున్నాము అని గుర్తించాలి
మనము ఏమైయున్నామో దానిని మాత్రమే పునరుత్పత్తి చేయగలము కాబట్టి , మనము క్రీస్తు మాదిరిని పోలికను వెంబడించాలి
ఆయన తన సృష్టికి పోషణ దయచేసే దేవుడు. ఆత్మ పరముగాను, శరీరపరముగాను మనము ఆయన ఆహారము ద్వారా పోషింపబడాలి

పాపము నుండి తప్పించుకొనుటకు మార్గదర్శకములు
సత్యము: మానవులు తాము చేసుకున్న ఎంపిక ద్వారా పాపములో పడిపోయారు. మనలను మోసపరచి పాపము చేయుటకు ప్రేరేపించిన శోధకుడు అబద్దమునకు జనకుడు. మనకు కలిగియున్న అభిప్రాయము యొక్క అధికారముతో అబద్దము దేవుని యొక్క వాక్యమును ప్రశ్నిస్తుంది. మనము కలిగియున్న అభిప్రాయములు సాతానునకు సులభముగా వేటాడు ఆహారము వంటివి

అన్వయము: దేవుని వాక్యమును ఎప్పుడూ సవాలు చేయవద్దు . దానికి బదులు దేవుని వాక్యమునకు అర్ధము ఏమిటి? దానిని నా జీవితమునకు ఎలా అన్వయించుకోవాలి అని ప్రశ్నించుకోండి
నేత్రాశ, శరీరాశ, జీవపుడంబముల ద్వారా వ్యక్తిగతమైన చెడ్డకోరికలు నెరవేర్చుకోవటానికి శరీరములో కలుగు ఆకలి, అలజడి గుర్తించండి. పరిశుద్దాత్ముని సహాయముతో వాటిని జయించండి. ఆ ఆలోచనలను స్వా గతించవద్దు . అవి మనలను పాపములో పడవేయు ఉచ్చులుగా మారతాయి.

పాపమును అసహ్యించుకొనుటకు వేయవలసిన అడుగులు
సత్యము: దేవుడు పాపమును సంపూర్ణముగా అసహ్యించుకొనును. అందుకే అది తీర్పునకు గురి అయి శిక్ష పొందుతుంది. మానవజాతి చరిత్రలో ఎన్నో నాగరికతలు పాపము యొక్క తీర్పునకు గురి అయి అంతరించిపోయాయి . దేవునియందు విశ్వాసము ఉంచటము అంటే పాపమును ద్వేషించాలి అని ఆదికాండము మనకు తెలియజేస్తుంది

అన్వయము: భక్తిహీనత, దేవుడి గురించిన ఆలోచనలేని, భయములేని పనులు విడిచిపెట్టుము. అలాంటివాటి వలన దేవుడు ఈ లోకమునకు ఒకసారి తీర్పు తీర్చారు అనే విషయము మరచిపోవద్దు
వ్యక్తిగత గుర్తింపు, అధికారము కోసము వచ్చే అవకాశములు, విన్నపములనుండి తిరిగిపోమ్ము . దేవుడు దానివలన ప్రజల భాషను తారుమారు చేశారు
మన జీవితముల ద్వారా దేవుని మాత్రమే మహిమపరచాలి
ప్రతి విధమైన అనైతికత, కల్మషము నుండి పారిపోమ్ము . వాటివలన దేవుడు సోదోమ, గొమెర్రా పట్టణములను నాశనము చేశారు

దైవత్వములో ఎదుగుట
సత్యము: నేత్రాశ, శరీరాశ, జీవపుడంబముల ద్వారా అలనాడు ఆదాము, హవ్వలను సాతాను మోసము చేసాడో, ఈ రోజున కూడా అదే విధముగా ప్రజలను మోసము చేయటానికి పరయత్నము చేసున్నాడు. వారు తాత్కాలికమైన దానికొరకు నిత్యత్వమును, అబద్దముకొరకు సత్యమును బేరము చేసారు.

అన్వయము: పరిశుద్దమైన, దైవప్రేరేపిత వాక్యమును గట్టిగా పట్టుకొనుము.
సాతాను దేవుని వాక్యమును వక్రీకరించాడు. హవ్వ దానికి కొంత కలిపింది. దీనిద్వారా సత్య ము వక్రీకరించబడి మానవజాతి పతనానికి దారితీసింది.
నీ శరీరమును పోత్రహించు కోరికలను తిరస్కరించుము. అవి నీలో ఎందుకు కలుగుతున్నాయో, వాటికి దోహదము చేస్తున్న నీ ఆలోచన, క్రియలు గుర్తించి వాటిని నీ జీవితములో విడిచిపెట్టుము. దీనికి పరిశుద్దాత్ముని సహాయము తీసికొనుము.

క్రియాశీలకమైన భక్తిని కొనసాగించుట
సత్యము: నిత్యత్వములో ఎప్పుడూ నిలిచియుండే దేవుడు మన సృష్టికర్త. ఆయన స్వరూపములోను, పోలికెలోను స్త్రీ, పురుషులుగా మనము రూపించబడ్డాము. మన గమ్యము ఈ జీవితకాలములోను, తరువాత నిత్యత్వములోను ఆయనతో సన్నిహి త, వ్యక్తిగత సంబంధముకలిగి జీవించుట అనే సత్యమును మనము గుర్తించినపుడు అది మనలో క్రియాశీలకమైన భక్తీ, పట్టుదల కలగటానికి దారితీస్తుంది లేదా నడిపిస్తుంది

అన్వయము: సృస్టినందు మనుష్యులకు గల ప్రత్యేకతను గుర్తించుము. మనము దేవునితో కలిగియున్న సంబంధము, అవకాశము మరి ఎవ్వరికీ లేదు.
మనము ఆయన స్వరూపములో చేయబడ్డాము. పాపము ద్వారా దానిని కోల్పోయిన మనము అది మరలా పునరుద్దరించబడే లాగున క్రీస్తు స్వారూప్యము కొరకు
పాటుపడాలి.
మనము ఆయన నామముల ద్వారా, పరిశుద్ద లేఖనములను దివారాత్రము ధ్యానించుట ద్వారా, ఆయన క్రియలు, లక్షణముల ద్వారా ఆయన గురించి మరింత
లోతుగా తెలిసికొనగలము
ఈ రకమైన దైవ సంబంధ జ్ఞానము మనము పాపములో పడిపోకుండా భద్రపరుస్తుంది

పరిశుద్దతను వెంబడించుట
సత్యము: దేవుడు పరిశుద్దుడు, స్వచ్చమైనవాడు, లోపము లేనివాడు. పరిపూర్ణముగా పాపమునకు దూరముగా ఉండువాడు. పాపము మనలను దేవుని దూరము చేస్తుంది. తీర్పు అవసరము అయ్యేలా చేస్తుంది. మనకు శిక్ష కలిగితే దేవుని హృదయము బాధపడుతుంది. మనము పాపమును ద్వేషించి, దేవుని ప్రేమించాలి అని ఆదికాండము తెలియజేస్తుంది

అన్వయము: నీతిని వెంబడించుము. పాపముతో నిండిపోయిన లోకములో తనయొక్క నీటి ప్రవర్తన ద్వారా నోవహు దేవుని దృష్టిలో కృపను పొందగలిగాడు
మన నగరములు, పట్టణములలో దైవభక్తి కలిగినవారు అభివృద్ధి చెందేలా ప్రార్ధన చేయండి. అలాంటివారు తక్కువ సంఖ్యలో ఉన్నా తృణీకరించవద్దు. అలాంటివారు 10 మంది లేని కారణముచేత సోదోమ, గొమెర్రా పట్టణము నాశనము కావలసి వచ్చినది.
అనైతికతకు దూరముగా పారిపోమ్ము. దేవునికి వ్యతిరేకముగా పాపము చేయటము కన్నా కూడా యోసేపు జైలునకు వెళ్లటానికి సిద్దపడ్డాడు.

విశ్వాసపు నడక
సత్యము: అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. విశ్వాసము అనేది దేవునికి స్నేహితుడిగా పిలువబడిన ఈయన జీవితములో అడుగడుగునా చూడగలము. విశ్వాసము అనునది దేవుడు చెప్పినది జరుగుతంది అని నమ్మటమే. ఒకవేళ మనము విశ్వసించినది మన కనుల యెదుటకు
రావటములో ఆలస్యము జరిగినా కూడా, అబ్రహాము జీవితము దేవుని మాటమీద నిరీక్షణ ఉంచుటకు మనకు గొప్ప ప్రోత్సాహముగా ఉంటుంది

అన్వయము: నీకు అర్ధముకాని దిశలోనికి దేవుడు నిన్ను నడిపించినప్పుడు భయపడవద్దు. ఆయన పూర్తిగా నమ్మదగినవాడు. అవి ఎలా జరుగుతాయో,
నెరవేరుతాయో నీకు కనిపించకపోయినా కూడా దేవుని వాగ్దానములమీద నమ్మకము ఉంచుము.
దేవుని యొక్క వాగ్దానములు నీ స్వంత శక్తితో నెరవేర్చుటకు ప్రయత్నము చేయవద్దు. దాని వలన ఎప్పుడూ ఆశించిన ఫలితములు రావు
దేవుడు తాను వాగ్ధానము చేసిన రీతిగా దయచేస్తాడు అని విశ్వసించు.
దేవునికి మన జీవితమార్గములో చూపించు నమ్మకమైన విదేయతలో ఆయన ఇచ్చు దీవెనలు, సమకూర్పు దాగియున్నాయి .
పరిశుద్దమైన, దైవప్రేరేపిత వాక్యమును గట్టిగా పట్టుకొనుము.

ఉదాత్తమైన జీవితమునకు తాళములు
సత్యము: దేవుని పట్ల మరియు ఇతరుల పట్ల ఉదారమైన స్వభావము కలిగియుండుట దేవుని ఎదుర్కొన్న వారి జీవితములలో ప్రస్పుటముగా కనిపించే మార్పు అని మన పితరుల యొక్క అద్భుతమైన, ఆశీర్వాదకర జీవితముల ద్వారా మనకు అర్దము అవుతుంది. దేవుడే మనకు మూలము అని గ్రహించి ఆయనకు మనకు కలిగినవాటిలో దశమబాగము ఇచ్చి ఆరాధించటము అనేది ప్రారంభము అయినది.

అన్వయము: మనము కలిగియున్న సమస్తము కూడా దేవునిద్వారా కలిగినది అని గ్రహించి అబ్రహామువలె ఆయనకు దశమబాగము ఇచ్చి సన్మానించుము.
దేవునియందు తమకు గల నమ్మకము, విశ్వాసమునకు ఇచ్చుట అనేది వారి జీవితములలో ఒక సూచనగా ఉన్నది. ఇది దేవునితో మనకు గల నిబంధన సంబంధమును తెలియజేస్తుంది
ఇది ధర్మశాస్త్రముకన్నా ముందు మొదలయ్యి ఇప్పుడు కృప క్రింద మనము ఎంచుకున్న ప్రకారము ఇచ్చేదానిగా కొనసాగుతూ ఉంది
సమస్తము దేవునిదే. మనము కేవలము సంరక్షణ భాద్యతలు చూసే సేవకులము మాత్రమే. హక్కులు లేవు. నిర్వహణ మాత్రమే

దర్శనము యొక్క నెరవేర్పునకు అడుగులు
సత్యము: తనకు విధేయత కలిగియున్న ఒక వ్యక్తి జీవితములో దేవుడు తన సార్వభౌమాధికారముతో అతని గమ్యమునకు ఎలా చేర్చగలరు అనేది యోసేపు యొక్క జీవితములో శక్తివంతముగా చూడగలము. తాను యవ్వనప్రాయములో ఉన్నప్పుడు దేవుడు తన జీవితముపట్ల కలిగియున్న ప్రణాళిక గురించి దర్శనము పొందాడు. కానీ అనతికాలములోనే ఆ దర్శనము కొట్టివేయబడి తన జీవితము అంతా చెరసాలలోనే వృధా అయిపోతుందేమో అనే పరిస్థితులు తలెత్తాయి . ఏది ఏమైనా యోసేపు దేవునికి నమ్మకముగా ఉన్నాడు. ఇది చెడునకు ఉద్దేశించబడినది అనిపించే దానిలోనుండి దేవుడు తన సేవకుని యొక్క జీవితములో ఆ దర్శనమును నెరవేర్పునకు తీసుకురావటము జరిగినది

అన్వయము: దేవుని దర్శనము గురించి ఆలోచించి దేవుని సమయము కొరకు కనిపెట్టుము.
ఇతరుల దృష్టిలో దేవుని యొక్క అనుకూలత కొరకు ఆశించుము
అసాధ్యము అనిపించే చోట దేవుడు సాధ్యము చేసి మార్గము తెరువగలడు. నీవు చేయు ప్రతి పనిలో దేవునికి నమ్మకముగా ఉండుము
దర్శనము యొక్క నెరవేర్పు మందగించినపుడు నిరాశతో విడిచిపెట్టవద్దు
దేవుడు నీకు చాలినవాడు అని విశ్వసించు
ఆయన తన ఉద్దేశ్యములు నీ ద్వారా నెరవేర్చుటకు అవసరమైన వరములు నీకు ఇచ్చియున్నాడు (వనరులు, వసతులు, నైపుణ్యత)
దేవుని యొక్క సార్వభౌమాధికారముమీద నమ్మకము ఉంచుము
ఆయన పిలుపు, ఉద్దేశ్యమునకు, చిత్తమునకు నీవు నమ్మకముగా ఉన్నప్పుడు, సమస్తము నీ మంచికి జరిగేలా ఆయన చేస్తాడు.
నెరవేర్చలేని దర్శనము దేవుడు నీకు ఎప్పుడూ చూపించరు