1. ఆదికాండము క్రింది విషయములను వివరిస్తుంది
  1. 11 అధ్యాయములు సృష్టి
  2. పాపములో పడిపోవుట
  3. జలప్రళయము
  4. బాబేలు గోపురము
  5. పితరుల చరిత్ర
 2. 39 అధ్యాయములు అబ్రహాము కుటుంబము యొక్క చరిత్ర
  1. 14 అబ్రహాము గురించి
  2. 5 ఇస్సాకు గురించి
  3. 8 యాకోబు గురించి
  4. 14 యోసేపు గురించి
 3. ఆదికాండము యొక్క హీబ్రూ నామము “బెరెషిత్”
 4. ఆదికాండము 2350 సంవత్సరముల చరిత్రను కలిగిఉన్నది
 5. మొదటి 11 అధ్యాయములు 2000 సంవత్సరముల చరిత్రను కలిగిఉన్నది
 6. చివరి 39 అధ్యాయములు 350 సంవత్సరముల చరిత్రను కలిగిఉన్నది
 7. ఆదికాండమునందలి సంఘటనలు మోషే పుట్టుకకు 3 దశాబ్దముల ముందు జరిగినవి
 8. బైబిలునందు 4,100 సంవత్సరముల చరిత్ర కలదు. అందులో సగము 2,286 సంవత్సరములు ఆదికాండమునందు కలదు. మిగిలిన 1,814 సంవత్సరముల చరిత్ర నిర్గమకాండమునుంచి ప్రకటన గ్రంధము వరకు కలదు (65 పుస్తకములు).
 9. 1-11 అధ్యాయములలో దేవుడు ఇశ్రాయేలును ఎందుకు ఎన్నుకున్నారు అనేది వివరించబడినది.
 10. 12-50 అధ్యాయములలో దేవుడు ఇశ్రాయేలును ఎలా ఎన్నుకున్నారు అనేది వివరించబడినది.
 11. ఆదికాండము అన్నీఎలా మొదలయ్యాయి అనే దానికి సంబంధము కలిగి ఉన్నది.
 12. ఈ గ్రంధమునందు మొత్తము 10 వంశావలులు కలవు
 13. ఈ ఒక్క గ్రంధమునందు మాత్రమే దేవుడు విశ్రాంతి తీసుకున్నట్లు వివరించబడినది (2:2, 3).
 14. మెస్సీయ రాకడ గురించి, ఆయన శ్రమ గురించి, అంతిమ విజయము గురించిన మొదటి ప్రవచనము ఇందులో వివరించబడినది (3:15).
 15. ఆదికాండము నూతన నిబంధనలో 200 సార్లకు పైగా ఉదహరించబడినది.
 16. 1-11 అధ్యాయములు నూతన నిబంధనలో 100 సార్లకు పైగా ఉదహరించబడినవి.
 17. ప్రస్తుత కాలము యొక్క యాత్రికులకు వారి ప్రయాణములలో నిశ్చయత ఇస్తుంది