ప్రారంభములు
ఆదికాండము విశ్వము, భూమి, మానవులు, పాపము మరియు దేవుని రక్షణ ప్రణాళిక లాంటి అనేక ప్రాముఖ్య మైన సంగతుల ప్రారంభము గురించి వివరిస్తుంది. ఆదికాండము భూమి చక్కగా, మంచిగా చేయబడినది అని తెలియజేస్తుంది. మానవులు దేవునికి ప్రత్యేకమైన వారు. దేవుడు జీవమును సృష్టించి దానిని కాపాడి కొనసాగించువాడు.
అవిధేయత
మానవులు ఎల్లప్పుడూ కూడా గొప్ప ఎంపికలు చేసుకునే అవకాశము కలిగి ఉన్నారు. అవిధేయత అనేది మానవులు దేవుని జీవిత ప్రణాళిక ఎంపిక చేసికోనకపోవుట, వెంబడింపకపోవుట వలన కలుగుతుంది.
ఆదికాండము మానవులు ఎందుకు చెడ్డవారుగా ఉన్నారో వివరిస్తుంది. వారు తప్పుడు మార్గమును ఎంపిక చేసుకొనియున్నా రు. బైబిలులోని గొప్ప నాయకులు కూడా దేవుని విఫలము చేసి అవిధేయత చూపినారు.
పాపము
పాపము మనిషి జీవితాన్ని నాశనము చేస్తుంది. అది మనము దేవునికి అవిధేయత చూపినపుడు కలుగుతుంది
దేవుని యొక్క మార్గములో జీవించుట ద్వారా జీవితము ఫలభరితముగాను, సంపూర్ణముగాను ఉంటుంది.
వాగ్దానములు
దేవుడు మానవులకు సహాయము చేసి కాపాడుటకు వాగ్దానములు చేయును. ఈ రకమైన వాగ్దానమును నిబంధన అని కూడా అంటారు.
దేవుడు ఎల్లప్పుడూ తన వాగ్దానములను నెరవేర్చేవానిగా ఉన్నారు. దేవుడు మనలను ప్రేమించుటకు, క్షమించుటకు, అంగీకరించుటకు వాగ్దానము చేసి ఉన్నారు.
విధేయత
పాపమునకు వ్య తిరేకమైనది విధేయత. విధేయత దేవునితో మన సంబంధమును పునరుద్దరిస్తుంది.
దేవుని వాగ్దానముల యొక్క ప్రయోజనము పొందాలి అంటే ఆయనకు విధేయత చూపటము ఒక్కటే మార్గము
అభివృద్ధి
అభివృద్ధి అనేది వస్తురూపకమైన ఆస్తుల కన్నా లోతైనది. నిజమైన అభివృద్ధి అనేది దేవునికి విధేయత చూపుట ద్వారా వచ్చు ఫలితమై ఉన్న ది.
మానవులు దేవునికి విధేయత చూపినపుడు వారికి వారితోను, ఇతరులతోను, దేవునితోను శాంతి, సమాధానము లభిస్తుంది.
ఇశ్రాయేలు
తనకొరకు ఒక జనాంగమును ప్రత్యేకపరచుకోవాలి అనే ఉద్దేశ్యము కలిగి దేవుడు ఇశ్రాయేలు దేశమును ప్రారంభించటము జరిగినది. వీరి ద్వారా దేవుడు లోకములో తన మార్గములు సజీవముగా ఉండాలి అని, ఆయన ఎలాంటివాడు అనేది లోకము తెలుసుకోవాలి అని, యేసుక్రీస్తు ప్రభువు పుట్టుకకొరకు లోకమును సిద్దపరచాలి అని ఆయన అభీష్టము.