- ఈ అధ్యాయము దేవుని యొక్క సృష్టి గురించి మనకు వివరిస్తుంది
- దేవుడు 6 దినములలో సమస్త సృష్టిని చేశారు
- మొదటి 3 దినములలో చివరి 3 దినములకు అవసరమైన పరిస్థితులను, వాతావరణమును సృష్టించటము జరిగినది
- మనిషికి అవసరము అయిన సమస్తమును చేసిన తరువాత ఆఖరిగా మనిషిని చేశారు
- తాను చేసిన సమస్త సృష్టిమీద మనిషికి దేవుడు అధికారము ఇవ్వటము జరిగినది
- కేవలము మనుష్యులు మాత్రమే ఈ సృష్టి మొత్తముమీద దేవుని యొక్క పోలికలోను, స్వరూపములోను చేయటము జరిగినది
- దేవుడు కేవలము సృష్టి చేయటము మాత్రమే కాకుండా ప్రాణము కలిగిన ప్రతి జీవరాశి బ్రతుకుటకొరకు అవసరమైన ఆహారమును కూడా అందించారు
- అన్ని విషయములలోను మనిషికి ప్రత్యేకత ఇచ్చిన దేవుడు, ఆహారము విషయములో కూడా ప్రత్యేకత ఇచ్చారు. విత్తనము కలిగిన ఫలవృక్షములను ఇచ్చారు
- దేవుడు తాను చేసిన సృష్టిని అనుదినము పరిశీలించి మంచిది ఇచ్చినట్లుగా ఈ అధ్యాయములో మనము చూడగలము
- దేవుడు తన రాజ్యమును పరలోకము నుంచి విస్తరిం చాలి అనుకున్న సందర్భములో ఆయన భూమిని ఎన్నుకొని దానిమీద సృష్టి చేసిన సందర్భము వివరించుటకు ఈ అధ్యాయము వ్రాయబడినది
- దేవుడు తన రాజ్యము గురించి కలిగి ఉన్న అభిప్రాయము మనకు ఈ అధ్యాయము వివరిస్తుంది
- ఆయన యొక్క పరిపాలన క్రింద మనము బ్రతకాలి. ఆయన అధికారమునకు ఒప్పుకుని విధేయత చూపించాలి
- దేవుడు మనలను భూమిని పరిపాలించడానికి నియమించారు కానీ మరొక మనిషిని పరిపాలించమని కాదు
- మనము ఆయన పోలికలో చేయబడిన వారము అని జ్ఞాపకము చేసుకుని ఆయనకు తగిన వారసులుగా బ్రతకాలి
- ప్రతి రాజ్యము కూడా ఆయన అధికారము క్రిందనే ఉండాలి
- మనిషి యొక్క ఉనికి, సమాజములో, ప్రకృతిలో అతని యొక్క పాత్రను కూడా ఈ అధ్యాయము వివరిస్తుంది