ఈ అధ్యాయములో ఎక్కడ ఎవరు ప్రార్ధన చేసినట్లుగా మనకు కనిపించదు కానీ అధ్యాయములోని విషయములనుబట్టి ఈ క్రిందివిధముగా మనము ప్రార్థన చేయాలి
- చీకటినుంచి వేరుపరచి వెలుగులోనికి నడిపించమని
- ఆయన స్వరూపము, పోలికెలోనికి మారాలి అని
- దేవుడు కోరుకున్న విధముగా ఫలించి అభివృద్ధి చెందాలి అని
- దేవుని యొక్క జ్ఞానమును తరువాత తరమునకు అందించే సాధనముగా ఉండాలి
- చేప నీటిలోని ఆక్సిజన్ గ్రహించి జీవించినట్లుగా వాక్యములోని జీవమును గ్రహించి బ్రతకాలి
- పక్షిలాగా ప్రార్థనలో దేవుని నివాస స్థలమునకు దగ్గరగా జరగాలి
- ప్రాకు పురుగులాగా తగ్గింపు జీవితం గడపాలి
- సాధు జంతువులాగా ఆయన కాడి మోయాలి
- ఆకాశములోని నక్షత్రములాగా చీకటిలో ఉన్నవారికి మన జీవితము వెలుగు చూపించి సాక్ష్యముగా ఉండాలి