దేవుని ద్వారా సంధించబడిన ప్రశ్నలు ఈ అధ్యాయములో ఏమీ లేవు గానీ ఆయన చేసిన కార్యములను అనుసరించి మనము సంధించుకోవలసిన ప్రశ్నలు అనేకము ఉన్నాయి
- దేవుడు మనయెడల కలిగిన ప్రణాళికను గుర్తించామా?
- చీకటినుంచి వేరుపడి వెలుగులో నడుస్తున్నామా?
- క్రింది జలములను మీది జలములను వేరుపరిచిన రీతిగా లోకంలో ఉన్నవారికి నీకు తేడా చూపించగలుగుతున్నావా?
- ఆయన నీతి సూర్యుడుగా ఉన్నట్లు నీవు నీతిగా ప్రవర్తించి దానిని వెంబడిస్తున్నావా?
- చీకటిలో కొట్టుమిట్టాడుతున్న వారికి నీ జీవితమునుంచి ఏదైనా ఆశ అనేది దేవుని దగ్గరకు రావడానికి కలిగించ గలుగుతున్నావా?
- వాక్యములో ఉన్న జీవమును పొందుకొని బ్రతుకుతున్నావా?
- ప్రార్థన జీవితంపైకి ఎదిగేలాఉందా?
- నీ జీవితంలో ఫలింపు అనేది ఉందా?
- నీ జీవితంలో ఆయన స్వరూపము, పోలికే ఏర్పడడానికి నీవు చేస్తున్న ప్రయత్నములు ఏమిటి?
- సాటివారుకూడా దేవుని రూపములో చేయబడినవారు అని తెలుసుకున్నాక వారిపట్ల నీవు ప్రవర్తిస్తున్న తీరు ఎలాఉంది?
- నీ జీవితమునుంచి నీ తరువాతి తరమువారు తీసుకుని అవలంబించదగిన మాదిరి ఏమైనా ఉన్నదా?
- ప్రభువు యొక్క కాడిని నీ జీవితంలో ఎలామోస్తున్నావు?