- ఆదికాండము 1వ అధ్యాయము సృష్టియొక్క ఉనికిని గురించి మనకు వివరిస్తుంది
- ఈ సమస్త విశ్వమునకు ఆధారభూతుడైన దేవుని మనకు పరిచయము చేస్తుంది
- ఈ విశ్వము, భూమి, జీవరాసులు యొక్క సృష్టిక్రమము మనకు తెలియజేస్తుంది
- సృష్టి చేయుటకు పట్టిన కాలపరిమితి, వరుసక్రమము మనకు విశదీకరిస్తుంది
- సృష్టిలోని వివిధ వస్తువుల యొక్క ప్రాముఖ్యత, దేవుడు వాటి విషయములో కలిగి ఉన్న ఉద్దేశ్యములను వివరిస్తుంది
- మానవుని యొక్క ఉనికిని, దేవుడు మనలను సృష్టించుట వెనుక కలిగి ఉన్న ప్రణాళికను వివరిస్తుంది
- దేవుడు జీవరాసులకు నియమించిన మొదటి ఆహార పద్ధతులను వివరిస్తుంది
- దేవుడు పనిచేయు విధానము గురించి, ఆయనకు మనయెడల కలిగి ఉన్న ప్రేమను గురించి అవగాహన కల్పిస్తుంది
- ఈ సమస్త సృష్టిలో ఏదీకూడా దానంతట అదే ఉనికిలోనికి రాలేదు అని, సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు అని స్పష్టముగా తెలియజేస్తుంది.
- ఈ యొక్క అధ్యాయము ప్రకారము దేవుడు భూమిమీద తప్ప మరి ఎక్కడా కూడా జీవరాశులను సృజింపలేదు. మరి ఏ ఇతర గ్రహములమీద కూడా ప్రాణులు లేవు