దిద్దుకొనవలసినవి
- ఈ సృష్టి వెనుక ఒక సృష్టికర్త ఉన్నాడు అని మనము గుర్తించాలి
- దేవుడు తన పోలికలో మనిషిని చేయటము జరిగినది అని తెలుసుకొని మనము జంతువులనుంచి మార్పుచెందినవారము అనే అపోహలు తొలగించుకోవాలి
- సాటి మనుషులు కూడా దేవుని యొక్క స్వరూపము అని గుర్తించి వారిని గౌరవించాలి
ఆజ్ఞలు
- ఫలించాలి
- అభివృద్ధి చెందాలి
- విస్తరించాలి
- భూమిని నిండించాలి
- భూమిని లోపరుచుకోవాలి
- సముద్రపు చేపలను ఆకాశపక్షులను ప్రాకు జీవులను ఏలాలి
- విత్తనము గల వృక్షఫలములు ఆహారంగా తినాలి
వాగ్దానములు
- దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు
- దేవుడు మన అవసరతలను తీరుస్తాడు
- మన జీవితములోని చీకటిని, శూన్యమును అందంగా తీర్చిదిద్దుతాడు
శాపములు
- ప్రత్యేకించి శాపములు అనేవి లేవు కానీ దేవుని ఎరుగకపోవడం, ఆయన చేసినవాటిని తెలుసుకొనకపోవటం, ఆయన ప్రేమను గుర్తించకపోవడమే నిజమైన శాపముగా ఈ అధ్యాయమునుబట్టి అర్థమవుతుంది
హెచ్చరికలు
- దేవుడు మనలను వెలుగులో నడవడానికి పిలిచారు చీకటికి సంబంధించిన ప్రవర్తన మనలో ఉండకూడదు
- దేవుడు తన స్వరూపము తన పోలికలో మనలను సృజించారు కాబట్టి మనము దానికి తగ్గట్లుగా ప్రవర్తించాలి. మనలను చూసి ఆయనను ద్వేషించే విధముగా మన నడవడిక ఉండకూడదు. మన జీవితములో మనము చేసే ప్రతి పని, మాటతీరు, ప్రవర్తన ఆయనకు మహిమ తెచ్చేవిధంగా ఉండాలి
- సృష్టిని పూజింపకూడదు సృష్టికర్తనే ఆరాధించాలి
ప్రవచనములు
- ఈ అధ్యాయములో ప్రవచనములు లేవు గానీ దేవుడు మనము భూమిని ఏలుదము అని పలికిన మాట ప్రభువైన యేసుక్రీస్తువారి యొక్క రెండవ రాకడ సమయములో ఆయనతోపాటుగా రాజ్యము చేయటము ద్వారాను క్రొత్తభూమిలో ఆయనతో నివాసము చేయటము ద్వారాను నెరవేరుతుంది
- ప్రభువైన యేసుక్రీస్తువారి సిలువ బలియాగముద్వారా మనము చీకటిలోనుండి వెలుగులోనికి నడిపించబడ్డాము
- ప్రభువైన యేసుక్రీస్తువారి పునరుద్ధానముద్వారా అస్తమయమునుంచి ఉదయములోనికి రాగలిగాము (మరణము-జీవము)
- పరిశుద్ధాత్మ దేవుని పరిచర్యద్వారా ఆయన కుమారుని స్వరూపము, పోలికలోనికి మారగలుగుతున్నాము.