- చీకటిలోనుండి వెలుగులోనికి నడిచి ఆయనను ఆరాధించాలి
- ఆయన స్వరూపము, పోలికలోనికి మారుతూ ఆయనను ఆరాధించాలి
- మన జీవితంలో ఆయనకు, ఆయనకు సంబంధించిన పనులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చుటద్వారా ఆయనను ఆరాధించాలి
- మన జీవితంలోని ప్రతి పరిస్థితిలోనూ ఆయన అధికారమునకు లొబడటము ద్వారా, విధేయత చూపుటద్వారా ఆయనను ఆరాధించాలి
- మన జీవితములో, సమాజములో ఒక మంచి క్రైస్తవ సాక్ష్యం సంపాదించుటద్వారా ఆయనను ఆరాధించాలి
- మన జీవితంలో నీతిని వెంబడించుటద్వారా ఆయనను ఆరాధించాలి
- మన జీవితంలో ఆత్మఫలింపుద్వారా ఆయనను ఆరాధించాలి
- మన జీవితము ఆయనకు సాధనంగా మారి ఆయన కాడిని మోయడానికి ఆయన చిత్తము పరలోకములోలాగా భూమిమీద నెరవేరడానికి ఉపయోగపడే విధముగా మలచి ఆయనను ఆరాధించాలి
- దేవుడు మనకు ఇచ్చిన బహుమానము చాలా గొప్పది కాబట్టి ఆయనకు ఇచ్చి ఘనపరిచే విషయంలో కూడా అలానే చేసి ఆయనను ఆరాధించాలి