తనకు అప్పగించిన పనిని అంగీకరించెను

నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లిచేయక (24:3)

ఆ దాసుడు తన యజమానుడగు అబ్రాహాము తొడక్రింద తన చెయ్యి పెట్టి యీ సంగతి విషయమై ప్రమాణము చేసెను (24:9)

ప్రత్యామ్నాయములను పరీక్షించెను

ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని యెడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసికొనిపోవలెనా అని అడుగగా (24:5)

ఇవ్వబడిన సూచనలను అనుసరించుటకు ప్రమాణము చేసెను

ఆ దాసుడు తన యజమానుడగు అబ్రాహాము తొడక్రింద తన చెయ్యి పెట్టి యీ సంగతి విషయమై ప్రమాణము చేసెను (24:9)

ప్రణాళిక ఆలోచన చేసి దానిని దేవుని చేతిలో పెట్టి దిశానిర్దేశము కొరకు ప్రార్ధించెను

నా యజమానుడగు అబ్రాహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలముచేసి నా యజమానుడగు అబ్రాహాము మీద అనుగ్రహము చూపుము. చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊటయొద్ద నిలుచుచున్నాను; ఈ ఊరివారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు.  కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని యే చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై యుండును గాక, అందువలన నీవు నా యజమానునిమీద అనుగ్రహము చూపితివని తెలిసికొందుననెను (24:12-14)

వేచి చూచి జాగ్రత్తగా పరిశీలించెను

ఆ మనుష్యుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసెనో లేదో తెలిసికొనవలెనని ఊరకుండెను (24:21)

దేవుని సమాధానమును కృతజ్ఞతతో అంగీకరించెను

ఆ మనుష్యుడు తన తలవంచి యెహోవాకు మ్రొక్కి (24:26)

సంబంధిత వ్యక్తులకు పరిస్థితులను వివరించెను

24:34 అంతట అతడిట్లనెను నేను అబ్రాహాము దాసుడను,
24:35 యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను; అతనికి గొఱ్ఱలను గొడ్లను వెండి బంగారములను దాస దాసీ జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను.
24:36 నా యజమానుని భార్యయైన శారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను; నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికిచ్చియున్నాడు;
24:37 మరియు నా యజమానుడు నాతో నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెండ్లిచేయవద్దు.
24:38 అయితే నా తండ్రి యింటికిని నా వంశస్థుల యొద్దకును వెళ్లి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసికొని రావలెనని నాచేత ప్రమాణము చేయించెను.
24:39 అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నావెంట రాదేమో అని చెప్పినందుకు
24:40 అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడ తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి యింటనుండి నా కుమారునికి భార్యను తీసికొని వచ్చెదవు.
24:41 నీవు నా వంశస్థులయొద్దకు వెళ్లితివా యీ ప్రమాణము విషయములో ఇక నీకు బాధ్యత ఉండదు, వారు ఆమెను ఇయ్యని యెడల కూడ ఈ ప్రమాణము విషయములో నీకు బాధ్యత ఉండదని చెప్పెను.
24:42 నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి అబ్రాహామను నా యజమానుని దేవుడవైన యెహోవా, నా ప్రయాణమును నీవు సఫలము చేసిన యెడల
24:43 నేను ఈ నీళ్ల బావియొద్ద నిలిచియుండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నేను నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పు నప్పుడు
24:44 నీవు త్రాగుము నీ ఒంటెలకును చేది పోయుదునని యెవతె చెప్పునో ఆమెయే నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన పిల్లయై యుండును గాకని మనవిచేసికొంటిని.
24:45 నేను నా హృదయములో అట్లు అనుకొనుట చాలింపకముందే రిబ్కా భుజముమీద తన కడవను పెట్టుకొనివచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను; అప్పుడు నాకు దాహమిమ్మని నేనామెను అడుగగా
24:46 ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని చెప్పెను గనుక నేను త్రాగితిని; ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టెను.
24:47 అప్పుడు నేను నీవు ఎవరి కుమార్తెవని యడిగినందుకు ఆమె మిల్కా నాహోరునకు కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు, నేనామె ముక్కుకు కమ్మియును ఆమె చేతులకు కడియములను పెట్టి
24:48 నా తలవంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రాహామను నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసితిని; ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసికొనునట్లు సరియైన మార్గమందు నన్ను నడిపించెను.
24:49 కాబట్టి నా యజమానునియెడల మీరు దయను నమ్మకమును కనుపరచినయెడల అదియైనను నాకు తెలియచెప్పుడి, లేనియెడల అదియైనను తెలియచెప్పుడి; అప్పుడు నేనెటు పోవలెనో అటు పోయెదననగా

అనవసరమైన కాలయాపనకు అంగీకరించలేదు

అప్పుడతడు యెహోవా  నా  ప్రయాణమును  సఫలము చేసెను గనుక నాకు తడవు కానీయక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్లెదనని చెప్పినప్పుడు (24:56)

తనకు ఇవ్వబడిన సూచనలను అంతము మట్టుకు చేసెను

అప్పుడా దాసుడు తాను చేసిన కార్యములన్నియు ఇస్సాకుతో వివరించి చెప్పెను (24:66)